For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేబీ పుడ్స్ లో బెల్లం చేర్చడం వల్ల ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు..

By Super
|

బెల్లంలో అనేక ఔషధ గుణాలున్నాయి. అందుకే పురాతన కాలం నుండి దీని వాడకం ఎక్కువ. ముఖ్యంగా పాల్మిర, డేట్ పాల్మ్, మరియు కోకనట్ వంటి వివిధ రకాల మూలంగా తీసుకుంటుంటారు. బెల్లంలో షుగర్ కంటెంట్ కంటే న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి . ఇవి బేబీకి చాలా అవసరం అవుతాయి, ముఖ్యంగా క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ మరియు ఇతర మనిరల్స్ చాలా అవసరం అవుతాయి. కాబట్టి, బేబికి పెట్టే ఆహారాల్లో బెల్లం చేర్చడం మంచిది.

అలాగే బేబికి ఇది ఒక గొప్ప న్యూట్రీషియన్ ఫుడ్. ఇది అన్ రిఫైడ్ కాబట్టి, బేబి జీర్ణక్రియకు ఎలాంటి సమస్య ఉండదు. బెల్లం బేబి యొక్క రెగ్యులర్ డైట్ లో చేర్చడం వల్ల న్యూట్రీషియన్స్ తో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. ఇది వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది, రక్తహీనత నివారిస్తుంది, లివర్ ను శుభ్రం చేస్తుంది మరియు ఎముకలను బలోపేతం చేస్తుంది..

Amazing Health Benefits Of Jaggery For Babies

అందువల్ల, బెల్లంను తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. పిల్లలకు మోతాదుకు మించితే, కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది . అంతే కాదు, బెల్లంలో ఉండే స్వీట్ నెస్ వల్ల పిల్లలు దీనికి అలవాటు పడుతారు . దాంతో ప్రేగుల్లో పురుగులు పడుతాయి మరియు హీట్ బంప్స్ కూడా ఏర్పడుతాయి.మరియు క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల బేబీ హెల్త్ మీద ప్రభావం చూపుతుంది.

అందువల్ల, బెల్లంను మితంగా తీసుకోవాలి. మరి బేబీ ఫుడ్ లో బెల్లంను రెగ్యులర్ గా చేర్చడం వల్ల పొందే మరికొన్ని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం....

Amazing Health Benefits Of Jaggery For Babies

అనీమియా నివారిస్తుంది: బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇది హీమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. బేబీ ఫుడ్ లో బెల్లం చేర్చడం ద్వారా బేబికి ఐరన్ పుష్కలంగా అందుతుంది మరియు ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. మరియు రోజూ అవసరం అయ్యే మినిరల్స్ ను అందిస్తుంది.

మలబద్దకం నివారిస్తుంది: బెల్లం బౌల్ మూమెంట్ ను స్మూత్ చేస్తుంది మరియు మలబద్దకంను నివారిస్తుంది. జీర్ణవ్యవస్థను యాక్టివ్ ఉంటుంది . డైజెస్టివ్ ఎంజైమ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ అన్ రిఫైండ్ షుగర్ బేబీ బాడీని డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేసి లివర్ ను శుభ్రం చేస్తుంది మరియు డిటాక్సిఫై చేస్తుంది..

Amazing Health Benefits Of Jaggery For Babies


బోన్స్ ను బలోపేతం చేస్తుంది: బెల్లంలో మినిరల్స్, క్యాల్షియం మరియు ఫాస్పరస్ అందిస్తుంది.బేబి యొక్క హెల్తీ బోన్స్ కు ఇది చాలా అవసరం అవుతుంది. . బేబీ డైట్ లో బెల్లం చేర్చడం వల్ల బేబీలో బోన్స్ హెల్తీగా మరియు స్ట్రాంగ్ గా ఉంటాయి.

కోల్డ్ అండ్ ఫ్లూ నివారిస్తుంది : బేబీలో వ్యాధినిరోధికశక్తి బలహీనంగా ఉండటం వల్ల కోల్డ్, ఫ్లూ మరియు దగ్గును నివారిస్తుంది. మరియు దగ్గును మరియు జలుబును చాలా ఎఫెక్టివ్ గా తగ్గించడంలో బెల్లం గ్రేట్ గా సహాయపడుతుంది. చిన్న చిన్న వ్యాధులను నివారిస్తుంది .

Amazing Health Benefits Of Jaggery For Babies

వ్యాధినిరోధకత పెంచుతుంది: బెల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు మినిరల్స్ , సెలీనియం, జింక్ ఇవన్నీ సెల్ డ్యామేజ్ ను నివారిస్తుంది. బేబీలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్ మరియు బూస్ట్ లా పనిచేసి, వ్యాధినిరోధశక్తి పెంచుతుంది.

English summary

Amazing Health Benefits Of Jaggery For Babies

Jaggery is obtained from many sources such as palmyra, date palm and coconut. It has a high amount of nutrients than sugar that are required for the body, especially calcium, phosphorus, iron and other minerals. Therefore, jaggery is the best way to sweeten a baby's food.
Story first published: Monday, January 25, 2016, 15:43 [IST]
Desktop Bottom Promotion