మీ చిన్నారులకు ఒంటరిగా నిద్రపోయే అలవాటు కలిగించే 11 మార్గాలు

Subscribe to Boldsky

చిన్నారులను నిద్రపుచ్చడం అంత సులభమేం కాదు. చిన్నారులకు ఒంటరిగా నిద్రపోయే అలవాటును కలిగించడమనేది తల్లిదండ్రులకు పెద్ద పరీక్షలాంటిది. అప్పుడే పుట్టిన శిశువులు ఎక్కువగా నిద్రపోతారు. అయితే, వారు ఎదుగుతున్న కొద్దీ నిద్రపోయే సమయం మారుతూ ఉంటుంది. కాబట్టి, చిన్నారులకు నిద్రకు సంబంధించి ఒక రొటీన్ ను ఏర్పరచడం తప్పనిసరి. ఎంత త్వరగా నిద్రకు సంబంధించిన రొటీన్ ను వారికి ఏర్పాటు చేస్తే చిన్నారులు అంత త్వరగా నిద్రపోయే అలవాటును ఏర్పరచుకుంటారు.

పిల్లలకు ఒంటరిగా నిద్రపోయే అలవాటును కల్పించడమెలా?

పిల్లలు తమంతట తాము నిద్రపోయే అలవాటును కల్పించాలంటే మీరు వారితో కాస్త సహనంగా వ్యవహరించాలి. వారికి పగటిపూట ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి. ఎంతో ప్రేమను వారిపై కురిపించాలి. మంచి బెడ్ టైం రొటీన్ లో భాగంగా పిల్లల గదిలోని లైట్లను డిమ్ చేయడం తప్పనిసరి. అలాగే, అనవసర శబ్దాలతో పిల్లలు నిద్రాసమయంలో డిస్టర్బ్ కాకుండా మీరు జాగ్రత్త వహించాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, పిల్లల నిద్రకు సంబంధించి ఒక పద్ధతినే అనుసరించకండి. వారి అవసరాలను గుర్తించి అందుకు తగిన పద్దతులను ఎంచుకుని వారికి సమయానికి నిద్రించే అలవాటును కల్పించండి.

how to let baby sleep alone

కిడ్ ఫ్రెండ్లీ రూమ్ ను ఏర్పరచిన తరువాత మీ పిల్లలకు ఆ రూమ్ లో కంఫర్ట్ జోన్ వచ్చేలా చూడండి. వారికి ఒంటరిగా నిద్రపోయే అలవాటు చేయండి. అయితే, మీ చిన్నారిని గదిలో ఒంటరిగా నిద్రపోవడానికి అలవాటు చేసే ముందు మీరు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవాలి.

మొదట్లో, మీ గదిలోనే మీ చిన్నారికి సెపరేట్ బెడ్ ను ఏర్పాటు చేయాలి. అలా అలవాటైన తరువాత వారికి వేరొక రూమ్ లో ఒంటరిగా నిద్రపోవడం నేర్పాలి. ఈ ఆర్టికల్ లో, పిల్లలకు ప్రత్యేకమైన గదిలో నిద్రించే అలవాటును కల్పించాలని కోరుకుంటున్న తల్లిదండ్రులకు అవసరమయ్యే చిట్కాలు పొందుపరచబడ్డాయి.

బెస్ట్ ప్లేస్:

బెస్ట్ ప్లేస్:

కొత్తగా తల్లిదండ్రులైన వారు తమ చిన్నారి హాయిగా నిదరపోయేందుకు సరైన ప్లేస్ ను ఎన్నుకోవాలి. పిల్లల ఎదుగుదలకు తగ్గట్టు మార్పులు తీసుకువస్తే చిన్నారికి ఒంటరిగా నిదురపోయే అలవాటును తెప్పించవచ్చు.

సరైన సమయం:

సరైన సమయం:

చిన్నారి నిద్రకు సంబంధించి ఖచ్చితమైన షెడ్యూల్ ను అనుసరించాలి. చిన్నారి నిద్రకు సంబంధించిన అంశాలను మీరు గుర్తించగలగాలి. మీ చిన్నారికి నిద్ర వస్తున్నట్టు ఈ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. మీ చిన్నారి కళ్ళు నులుముకుంటున్నా, ఆవలిస్తున్నా మీ చిన్నారి నిద్రలోకి జారుకునే సమయం ఆసన్నమైందని తెలుసుకోవాలి. చిన్నారిని నిద్రపుచ్చడానికి సరైన ఏర్పాట్లు చేయాలి.

రొటీన్ ను ఏర్పాటు చేసుకోండి:

రొటీన్ ను ఏర్పాటు చేసుకోండి:

ఒక రొటీన్ ను ఏర్పాటు చేయడం ద్వారా చిన్నారికి ఒంటరిగా నిద్రపోయే అలవాటును కల్పించవచ్చు. ఆ రొటీన్ చాలా సులభతరంగా ఉండాలి. చిన్నారిని నిద్రపుచ్చడానికి ముందు చిన్నారికి స్నానం చేయించడం, నాపీని మార్చడం, ఒక చిన్న మసాజ్ ను చేయడం వంటివి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

సౌకర్యవంతమైన బట్టలు

సౌకర్యవంతమైన బట్టలు

చిన్నారికి రాత్రిపూట సౌకర్యవంతమైన దుస్తులనే తొడగాలి. కాటన్ వస్త్రాలను అలాగే మెత్తటి మెటీరియల్స్ ను చిన్నారి నిద్రించే సమయానికి అందుబాటులో ఉంచాలి. చికాకు కలిగించే నైట్ వేర్ లో చిన్నారికి నిద్రపట్టదు.

చిన్నారి ఆకలి తీర్చండి

చిన్నారి ఆకలి తీర్చండి

ఆకలితో ఉన్న చిన్నారికి సరిగా నిద్రపట్టదు. అందుకే సరైన పోషకాహారంతో చిన్నారి ఆకలిని తీర్చాలి. చిన్నారి నిద్రించే సమయానికి కనీసం మూడుగంటల ముందు ఆహారాన్ని అందించాలి.

శ్వాస అందేలా చూసుకోవాలి

శ్వాస అందేలా చూసుకోవాలి

జలుబుచేత చిన్నారులు నిద్రలో శ్వాసకు సంబంధించిన ఇబ్బందులతో సతమతమవుతారు. అందుకే, వారికి సరైన చికిత్స ద్వారా శ్వాస సరిగా అందేలా చూసుకోవాలి. ముక్కులో ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. వారికి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోండి.

ప్రశాంతమైన వాతావరణం:

ప్రశాంతమైన వాతావరణం:

ప్రశాంతమైన, నిశ్శబ్దమైన వాతావరణాన్ని చిన్నారులు ఇష్టపడతారు. ఏవైనా రొదలు వినిపిస్తే వారి నిద్రకు భంగం కలుగుతుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే చిన్నారులు ప్రశాంతంగా నిదురిస్తారు.

వార్మ్ లైట్స్:

వార్మ్ లైట్స్:

చిన్నారుల గదిలో వార్మ్ లైట్స్ ని వాడటం ద్వారా వారికి అదనంగా ఒక గంట నిద్రను కానుకగా ఇచ్చినవారవుతారు. వార్మ్ లైట్స్ అనేవి చిన్నారుల నిద్రకు భంగం కలగకుండా కాపాడతాయి.

సంరక్షించండి

సంరక్షించండి

దుప్పటి వంటి కొన్ని భద్రతా వస్తువులని ఇస్తూ వారిని సంరక్షించండి. ఒంటరిగా నిద్రపోయేటప్పుడు వారికి భయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.

చికాకు కలిగించే వస్తువులను తొలగించండి

చికాకు కలిగించే వస్తువులను తొలగించండి

చిన్నారులు నిద్రకుపక్రమించే సమయంలో వారికి సమీపంలో దుమ్మూ ధూళిని కలిగించే వస్తువులు లేకుండా చూసుకోవాలి. పౌడర్ల వంటివి దూరంగా ఉంచాలి. లేదంటే వారికి శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతాయి.

ఆహ్లాదకరమైన టెంపరేచర్:

ఆహ్లాదకరమైన టెంపరేచర్:

చిన్నారులు నిద్రించే గదిలో స్థిరమైన టెంపరేచర్ ఉండేలా చూసుకోవాలి. గదిలో వెచ్చటి టెంపరేచర్ ఉండేలా చేయడం ద్వారా చిన్నారులు నిద్రించడానికి అనుకూలమైన వాతావరణం కల్పించినవారవుతారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    11 ways to make your baby sleep alone

    How to let baby sleep alone? In order to help your child learn how to sleep on his own, offer your child lots of cuddles and love at daytime. Try to get a good bedtime routine by making the lights low with deadpan silence. Don’t ever approach with a single method on baby sleeping.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more