పసిపిల్లల్లో వచ్చే చర్మ సమస్యలు

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

తల్లిదండ్రులుగా, మనము మన పిల్లలకు ఎదురయ్యే సమస్యలను గూర్చి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పసిపిల్లల జీవితంలో మొదటి కొన్ని సంవత్సరాలు అంటువ్యాధులు, రోగాల భారీన పడే సమయముగా భావిస్తారు.

అందువలన, ఈ పరిస్థితులు గురించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కొన్ని లక్షణాలు గుర్తించడం ద్వారా, మీ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

హెల్తీ బేబీ పుట్టడానికి.. ప్రెగ్నన్సీ టైంలో కంపల్సరీ తినాల్సినవి..!!

చర్మం అనేది మానవశరీరంలో అతిపెద్ద అవయవంగా చెప్పవచ్చు. ఇది అనేక రకాల పరిస్థితుల్లో వ్యాధుల బారిన పడకుండా మనకు రక్షణగా ఉంటుంది.

బయటకు కనిపించే మనచర్మాన్ని పరిగణనలోకి తీసుకొని, దానికి ఎదురయ్యే చాలా రకాల పరిస్థితులను గూర్చి తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు.

ఎదిగే పిల్లలకు బహు ప్రయోజనాలందించే అమృతం నెయ్యి...

చర్మ వ్యాధులు ఏర్పడటానికి చిన్న పిల్లల శరీరం చాలా అనుకూలంగా ఉంటుంది. వాటిని త్వరగా గుర్తించి చికిత్స అందించినట్లయితే, వారి జీవిత కాలంలో ఎదురయ్యే సమస్యలను నుండి తప్పించుకోవచ్చు.

కాబట్టి, మనం సాధారణంగా పిల్లలు ఎదురయ్యే కొన్ని చర్మసమస్యలను పరిశీలిద్దాం.

మోటిమలు (acne) :

మోటిమలు (acne) :

పసిపిల్లలు కూడా మొటిమల భారీన పడతారు. ఇది తల్లిలో ఉన్న హార్మోన్ల మార్పు వలన (లేదా) పిల్లలు పుట్టిన తర్వాత వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పుల ఫలితంగా వస్తుంది.

ఈ మోటిమలు అప్పుడే పుట్టిన కొంతమంది పిల్లల్లో రావచ్చు లేదా పుట్టిన కొన్ని వారాల తర్వాత అయినా రావచ్చు. ఇది సాధారణంగా బుగ్గల మీద వస్తాయి, కానీ కొంతమందికి నుదుటి మీద - గెడ్డం మీద కూడా వస్తాయి.

మొటిమ మరింత ఎక్కువగా అవోచ్చు, మీ పిల్లలకు పాలు తాగాక దాని చర్మం మీద ఆ తడి ఉండటం, లాలాజలం లేదా మెత్తగా లేని బట్టలు వల్ల. కొన్నిసార్లు డిటర్జెంట్లు ప్రభావం వల్ల కూడా ఈ మోటిమలకు కారణమవుతుంది.

ఈ మోటిమలు వాటికి అవే తగ్గుతాయి. కానీ కాస్త సమయం పడుతుంది.

ఆటలమ్మ (chicken pox) :

ఆటలమ్మ (chicken pox) :

ఇది తరచుగా పిల్లలు మరియు పసిపిల్లల్లో కనిపిస్తుంది. తలనొప్పి, జ్వరం, ఆకలి, వికారం, కండరాల నొప్పి వంటి లక్షణాలతో ఇది మొదలవుతుంది.

మీ పిల్లల చర్మం పగలడానికి ఈ బోడిపెలు కారణం అవుతుంది. ఈ బోడిపెలు ద్రవంతో నిండిపోయి ఉండి, శరీరాన్ని ఎరువుగా, లేతగా మార్చవచ్చు.

చికిత్స సమయంలో బాధాకరం ఉండకపోవచ్చు కానీ దురదగా ఉంటుంది.

ఆటలమ్మ అనేది ఒక వైరస్ ప్రభావం వల్ల వస్తుంది.

ఇది కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది. మీ పిల్లలను డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్ల్తే ఆ జ్వరం తగ్గడానికి కావలసిన మెడిసిన్స్ ని ఇస్తారు. కాలామైన్ లోషన్ని ఉపయోగించి దురదను తగ్గించవచ్చు. ఈ సమయంలో మీ పిల్లలను హైడ్రేట్ గా ఉండేటట్టు చూసుకోండి.

చర్మశోథి (cradle cap) :

చర్మశోథి (cradle cap) :

అప్పుడే పుట్టిన పిల్లలకు ఇది సాధారణంగా వస్తుంది. ఎక్కువ ప్రభావం గల చుండ్రుని కలిగి ఉంటుంది. ఎర్రని దద్దుర్లుగా వచ్చి, చర్మం రంగు మారి పొరలు పొరలుగా ఉడేటట్లుగా ఉంటుంది.

ఇది పసుపు రంగులో జిడ్డుగా ఉంటుంది. ఇది పొరలుగా ఉండి, తర్వాత పొలుసులగా ఊడిపోతుంది. దాన్ని గోకడం వల్ల సులువుగా తీసేయవచ్చు, కానీ ఆ సమయంలో చాలా ఎక్కువగా జుట్టు రాలిపోతుంది.

ఇది తల భాగంలోనే కాకుండా ముఖము, ముక్కు, మెడ, చంకలో, కాలి గజ్జల భాగంలో ఇవి ఏర్పడతాయి. తల స్నానం తరచుగా చేస్తు, సాఫ్ట్ గా ఉన్న దువ్వెనని యూజ్ చెయ్యడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది.

తామర (eczema) :

తామర (eczema) :

తామర అనేది చర్మం మీదఎర్రగా ఉండి, పగుళ్లు, దద్దుర్లు వంటివి స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లో రక్తం కారుతూ, ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒకచోట స్థిరంగా ఉండి, రోజురోజుకూ ఆ ప్రాంతంలో మంటఎక్కువ అవుతుంది. దీనిని చేతులు, మోచేతులవెనుక, మెడ, ముఖం మరియు మోకాలు దగ్గర చూడవచ్చు. దీని ప్రారంభదశలో గుర్తించినవెంటనే చికిత్సఇప్పిస్తే మీ పిల్లలు టీనేజ్ కి వచ్చేసరికి పూర్తిగా నయమవుతుంది.

గర్భంలో వున్నది బేబీ యా? బాబా?

తట్టు / చిన్నఅమ్మవారు (measles) :

తట్టు / చిన్నఅమ్మవారు (measles) :

మీ పిల్లలకు కారుతున్నముక్కు, జ్వరం, వాపు, గొంతు కళ్ళు, దగ్గు అలాగే మీ పిల్లలనోటిలో తెల్లని మచ్చలు ఉన్నాయనే, తట్టు లక్షణాలుగ నిర్ధారించవచ్చు.

శరీరం పై ఎర్రని మచ్చలు కొన్ని రోజులుకే బాగా ఎక్కువగా అవ్వడం దీని లక్షణం. ఇది ముఖం మీద, మెడమీద, చెవుల చుట్టూ కనిపిస్తాయి. ఈ దద్దుర్లు సాధారణంగా 5-6 రోజులపాటు చాలా దురదగా ఉంటాయి. మీరు తట్టుగా అనుమానిస్తే వెంటనే డాక్టర్ ని కలవండి. ఒక వైరస్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది, దానంతట అదే స్వతహాగా దూరం అవుతుంది. మీ పిల్లల జ్వరానికి పారాసెటమాల్ టాబ్లెట్ ని వాడాలి.

మిలియ ( milia) :

మిలియ ( milia) :

ముఖ భాగంలో తెల్లని మచ్చలు గానీ ఉంటే, పేరంట్స్ చాలా అలర్ట్ గా ఉండాలి. ఈ మచ్చలనే మిలియగా పిలుస్తారు. ఈ చిన్న మచ్చలు బుగ్గలు, నొసలు, గడ్డం, ముక్కు పైన మరియు కళ్ళ చుట్టూ చూడవచ్చు. ఈ మచ్చలయితే, పెరిగినట్లుగా ఉండి ముట్టుకుంటే చాలా మృదువుగా ఉంటాయి.

దీని గూర్చి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి కేవలం 6 వారాల సమయంలోనే పూర్తిగా తగ్గిపోతాయి.

నాపీ రాష్ (nappy rash) :

నాపీ రాష్ (nappy rash) :

ఇది ఎర్రగా ఉన్న పొక్కులను, బేబి క్రిందభాగంలో జననేంద్రియాలచుట్టూ ఉంటుంది. ఇవి తడిగా లేదా పొడిగానైన ఉండవచ్చు.

సున్నితమైన చర్మాని కలిగిన, 1సంవత్సర వయస్సు ఉన్న పిల్లల్లో ఇది సాధారణంగా వస్తాయి. మృదువైనబట్టల వల్ల, కొన్నిరకాల డిటర్జెంట్ల వల్ల "నాపీ రాష్" రావచ్చు.

మీ పిల్లలకు తరచుగా డైపర్స్ ని మార్చడం ద్వారా

దీనిని అడ్డుకోవచ్చు. పిల్లలను ఎప్పుడూ తేమలేకుండా శుభ్రంగా ఉంచాలి.

English summary

Skin Conditions That Occur In Babies And Toddlers

As parents, we need to be vigilant about any kind of afflictions that may occur to our babies. Read this!
Story first published: Wednesday, August 9, 2017, 13:00 [IST]
Subscribe Newsletter