For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 13 చర్యలను తీసుకుంటే మీ పిల్లలు రాత్రంతా హాయిగా నిద్రపోతారు

పిల్లల స్లీపింగ్ పాటర్న్ ను సాధారణ స్థితికి తీసుకురావడమే అసలు రహస్యం. అప్పుడే పుట్టిన శిశువులు రాత్రంతా హాయిగా నిద్రపోతారు. వారికి ప్రతి రెండు గంటలకొకసారి తల్లిపాలు లభిస్తాయి కాబట్టి వారెటువంటి ఇబ్బంద

|

తమ పిల్లలను నిద్రపుచ్చడానికి తల్లిందండ్రులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆలా ఎంతో కష్టపడి పిల్లలను నిద్రపుచ్చితే వారు చిన్న కునుకు తీసి మేలుకుని తిరిగి ఆటలలో పడతారు. ఈ అవస్థ తల్లిదండ్రులందరికీ పరిచయమే. అందుకే, పిల్లల స్లీప్ ప్యాటర్న్స్ విషయంలో తల్లిదండ్రులకు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. చిన్నారులు ఏకధాటిగా 8 గంటల సేపు నిద్రించరు.

చిన్న చిన్న కునుకులు తీస్తూ వారి నిద్రాసమయాన్ని ముగిస్తారు. ఆరునెలలు నిండిన మీ శిశువుని రాత్రంతా హాయిగా నిద్రపుచ్చే ప్రయత్నం చేయాలి. ఈ వయసు నుంచి మీ శిశువు యొక్క నిద్రకి సంబంధించిన విషయంపై మీరు అమితమైన శ్రద్ధ కనబరచాలి. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులైతే తమ పిల్లలు రాత్రంతా హాయిగా నిదురించాలని వారు కోరుకుంటారు. ఉదయమంతా ఆఫిసు వర్క్ తో శ్రమకు గురైన వారికి రాత్రంతా పిల్లలతో మేలుకోవడం అలసటగా అనిపిస్తుంది. అంతే కాదు, పిల్లలకు రాత్రిళ్ళు నిద్రపోవడాన్ని అలవాటు చేయడం వారి ఆరోగ్యానికి కూడా మంచిది.

మీ చిన్నారి రాత్రంతా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా నిద్రించాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఐదేళ్లు నిండేవరకు చాలా మంది పిల్లలలో స్లీపింగ్ రొటీన్ ఏర్పడదు. మీ పిల్లలకు రాత్రి పూట నిద్రపోవడం అలవాటు చేయడానికి మీరు పిల్లలతో కలిసి తగిన షెడ్యూల్ ని ఏర్పరచుకోవాలి. ఇలా చేయడం ద్వారా, క్రమంగా, రాత్రిళ్ళు పిల్లలు ఎక్కువ సమయం హాయిగా నిద్రపోతారు. తద్వారా, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా వారికి హాయిగా నిద్రపోవడం అలవాటవుతుంది.

పిల్లల స్లీపింగ్ పాటర్న్ ను సాధారణ స్థితికి తీసుకురావడమే అసలు రహస్యం. అప్పుడే పుట్టిన శిశువులు రాత్రంతా హాయిగా నిద్రపోతారు. వారికి ప్రతి రెండు గంటలకొకసారి తల్లిపాలు లభిస్తాయి కాబట్టి వారెటువంటి ఇబ్బందులూ లేకుండా హాయిగా నిద్రపోతారు. అయితే, పిల్లలు ఎదిగేకొద్దీ వారికందించే ఫీడ్స్ మధ్య ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి వారు రాత్రంతా హాయిగా నిద్రపోయేలా ప్రయత్నించవచ్చు. శిశువుకి 4 నుంచి 5 నెలలు నిండాక వారి నిద్రకు సంబంధించిన టైమ్ టేబుల్ ని మీరు రూపొందించవచ్చు.

మీ చిన్నారి రాత్రంతా హాయిగా నిద్రపోవడానికి అవసరమైన చిట్కాలను ఇక్కడ వివరించాము.

ఒక రొటీన్ ను ఏర్పరచండి:

ఒక రొటీన్ ను ఏర్పరచండి:

ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రించేలా మీ చిన్నారులను సిద్ధం చేయాలి. అలా చేయడం ద్వారా చిన్నారుల బయలాజికల్ క్లాక్ లో అనుకూల మార్పులు కలగడం వలన చిన్నారులకి నిద్రించే సమయం ఆసన్నమైందని తెలుస్తుంది.

నిద్రించే వాతావరణంపై శ్రద్ధ వహించండి:

నిద్రించే వాతావరణంపై శ్రద్ధ వహించండి:

మీ చిన్నారి నిద్రించే సమయంలో పెద్ద సౌండ్ తో టెలివిజన్ ను వీక్షించడం అలాగే గదిలో వెలుతురూ ఎక్కువగా ఉంచటం వారి నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తుంది. అందుచేత, చిన్నారి నిద్రకు ఎటువంటి అటంకంగా కలగని వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. టీవీని ఆఫ్ చేసి గదిలోని లైట్లను డిమ్ చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చిన్నారి హాయిగా రాత్రంతా నిద్రిస్తుంది.

చిన్నారులకు తమంతట తామే నిదురించే అలవాటును కలిగించాలి:

చిన్నారులకు తమంతట తామే నిదురించే అలవాటును కలిగించాలి:

తల్లిదండ్రులు తమ చిన్నారులను నిద్రపుచ్చడంలో భాగంగా వారిని ఎత్తుకుని తిప్పడం వంటివి చేస్తూ ఉంటారు. వీటివలన, తలిదండ్రులు ఎత్తుకున్నంత సేపూ చిన్నారులకి నిద్రవస్తున్నట్టు అనిపిస్తుంది, మీరు వారిని బెడ్ పైన పడుకోబెట్టగానే వారు వెంటనే మేల్కొంటారు. అందుచేత, చిన్నారులకు తమంతట తామే నిద్రించే అలవాటును చేయడం వలన వారి నిద్రకు ఎటువంటి ఆటంకం కలగదు.

బొమ్మలను లేదా మెత్తటి తలగడను వాడండి:

బొమ్మలను లేదా మెత్తటి తలగడను వాడండి:

మీ చిన్నారి ఈ ప్రపంచానికి ఇప్పుడిప్పుడే అలవాటుపడుతోందన్న విషయం మరచిపోకండి. అందుకే, నిద్రించే సమయంలో తను భయపడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. తన వద్ద మెత్తటి తలగడని లేదా ఒక సాఫ్ట్ టాయ్ ని ఉంచండి. మీ చిన్నారి సాఫ్ట్ టాయ్ ని హత్తుకుని హాయిగా నిద్రిస్తుంది.

నైట్ ఫీడింగ్ ఉపయోగపడుతుంది

నైట్ ఫీడింగ్ ఉపయోగపడుతుంది

మీ చిన్నారింకా తల్లిపాలు త్రాగుతున్నట్లైతే నిద్రించే సమయంలో కూడా పక్కమీదనే వారికి ఫీడింగ్ ఇవ్వడం ద్వారా చిన్నారికి నిద్రాభంగం కలగకుండా చూసుకోవచ్చు. ఒకవేళ చిన్నారి నిద్రించిన కొంతసేపటికే తిరిగి మేల్కొంటే ఫీడింగ్ ఇవ్వడం ద్వారా చిన్నారిని మళ్ళీ నిద్రపుచ్చవచ్చు. అందుకే, రాత్రిళ్ళు కూడా వీలైనంతగా చిన్నారులకు ఫీడింగ్ ఇవ్వమని డాక్టర్లు సూచిస్తున్నారు.

పగటిపూట చిన్నారిని ప్రశాంతంగా ఉంచండి

పగటిపూట చిన్నారిని ప్రశాంతంగా ఉంచండి

తమ పిల్లలు పగటిపూట ఎంత ఎక్కువసేపు ఆడుకుంటే రాత్రి పూట అంత హాయిగా నిద్రపోతారని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. అయితే, ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి, పగటిపూట మీ చిన్నారి హైపర్ యాక్టివ్ గా ఉన్నట్టయితే రాత్రి కూడా అదే స్థాయిలో యాక్టివ్ గా ఉండడానికి ప్రయత్నించి నిద్రలేమితో ఇబ్బందిపడుతుంది.

రాత్రి సమయంలో స్నానం:

రాత్రి సమయంలో స్నానం:

రాత్రి సమయంలో స్నానం చేయించడం ద్వారా హైపర్ యాక్టివ్ గా ఉండే మీ చిన్నారికి ప్రశాంతత లభిస్తుంది.అలాగే, నిద్రపోయే ముందు చిన్నారి దుస్తులను తప్పనిసరిగా మార్చండి. వీటిని పాటిస్తే చిన్నారి హాయిగా రాత్రంతా నిదురిస్తుంది.

ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినిపించండి:

ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినిపించండి:

తల్లి గర్భంలోంచే చిన్నారులు సంగీతాన్ని ఆస్వాదించడం మొదలుపెడతారు. అందుకే, పిల్లల బెడ్ టైం రొటీన్ లో భాగంగా వారికి చక్కటి సంగీతాన్ని వినిపించండి. సంగీతాన్ని వింటూ వారు నిద్రలోకి జారుకుంటారు. రాత్రంతా హాయిగా నిదురిస్తారు.

చిన్నారుల పక్కనే నిదురించండి

చిన్నారుల పక్కనే నిదురించండి

చిన్నారుల పక్కనే మీరు నిద్రించడం వలన వారు హాయిగా నిద్రిస్తారు. మీ నుంచి వచ్చే వెచ్చదనంతో చిన్నారులు నిద్రలోకి జారుకుంటారు. చిన్నారికి తనంతట తనుగా నిద్రించే అలవాటును కల్పించడంతో పాటు అప్పుడప్పుడూ మీరు కూడా మీ చిన్నారితో నిద్రిస్తే వారు హాయిగా నిద్రిస్తారు.

ఒక గూడును నిర్మించండి

ఒక గూడును నిర్మించండి

తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువులు ఒక గూటిలో ఉన్నట్టుగా భావన కలిగి ఉంటారు. అదే భావన వారికి నిద్రించే సమయంలో కలగాలంటే తలగడాలతో దుప్పట్లతో వెచ్చటి గూటిని నిర్మించండి. చిన్నారులు ఈ గూటిని ప్రత్యేకంగా భావించి హాయిగా నిద్రిస్తారు.

నిద్రించే సమయమని చిన్నారులకు సహజంగా తెలియాలి

నిద్రించే సమయమని చిన్నారులకు సహజంగా తెలియాలి

ప్రతిరోజూ నిద్రించే సమయంలో ఎదో ఒక యాక్టివిటీని ఒక భాగంగా తప్పనిసరిగా చేయాలి. తద్వారా, చిన్నారులకు నిద్రించే సమయం ఆసన్నమైందని తెలుస్తుంది. చక్కటి సంగీతంగాని, కథలు చెప్పడం గాని ఏదైనా యాక్టివిటీని ఏర్పాటు చేసుకోండి.

చిన్నారుల ఆకలిని తీర్చండి

చిన్నారుల ఆకలిని తీర్చండి

ఆకలితో ఉన్న చిన్నారి సరిగ్గా నిద్రించలేదు. నిద్రలో కదులుతూ కలత నిద్రతో ఇబ్బంది పడుతుంది. అందువలన, నిద్రపోయే సమయానికి కొన్ని గంటల ముందు చిన్నారికి కడుపునిండా భోజనం పెట్టండి.

చిన్నారులలో మలబద్దకం సమస్యను నిర్మూలించాలి

చిన్నారులలో మలబద్దకం సమస్యను నిర్మూలించాలి

మలబద్దకం సమస్యతో చిన్నారులు నిద్రలో ఇబ్బందులు పడతారు. ఒక్కోసారి రాత్రిపూట మలవిసర్జనకై ప్రయత్నించి నిద్రకు భంగం ఏర్పరచుకుంటారు. అందుచేత, పగటిపూటే వారు మలవిసర్జనకు వెళ్లేలా తగుచర్యలు తీసుకోవాలి. కనీసం, నిద్రించడానికి ముందైనా వారు మలవిసర్జనని చేసుకునేలా జాగ్రత్తపడడం మంచిది.

English summary

Get Baby Sleep Through The Night | Make Baby Sleep Through The Night | Baby Sleep Duration

The key here is to adapt your baby's sleep patterns to normalcy. A newborn baby will never sleep through the night because he or she has to be fed every two hours. But as the time between feeds increases, you can try to get your baby to sleep through the night. The 4th or 5th month is a good time to start working on a sleep timetable for your baby.!
Story first published:Friday, December 15, 2017, 15:56 [IST]
Desktop Bottom Promotion