For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో శిశువుని సేఫ్ గా ఉంచేందుకు పాటించవలసిన చిట్కాలు

|

మండే వేసవి కాలంలో వర్షాకాలం గురించి ఆత్రంగా ఎదురుచూడడం సహజమే. అయితే, వర్షాకాలం ప్రారంభమయ్యాక ఒకవైపు ఉపశమనంతో పాటు మరోవైపు కొన్ని చిక్కులు కూడా ఎదురవుతాయి. టెంపేరేచర్ తగ్గుతుంది. కావలసినంత రిలీఫ్ ను ఇస్తుంది. అయితే, వర్షపు నీళ్లు నిల్వ ఉండటం, కీటకాలు, అలాగే హ్యుమిడిటీ అనేవి కొన్ని ఆరోగ్యసమస్యలు తెచ్చిపెడతాయి.

5 things you need to know to keep your new-born safe during monsoons

వర్షాకాలంలో ఎక్కువగా చిన్నపిల్లలు అలాగే న్యూ బర్న్ బేబీస్ ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి, వర్షాకాలంలో ఎదురయ్యే ఆరోగ్యసమస్యలు తట్టుకునే చిట్కాలను ఇక్కడ తెలియచేశాము.

హ్యుమిడిటీను అదుపులో ఉంచండి

హ్యుమిడిటీను అదుపులో ఉంచండి

హ్యుమిడిటీని పెంచడంలో వర్షాకాలం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందువలన, బేబీస్ కు చికాకు ఎక్కువవుతుంది. పెసిఫైర్స్ అలాగే టీతెర్స్ కొంత వరకు ఉపశమనం అందించినా గాలిలోని తేమను అదుపులో ఉంచడం ముఖ్యమని గుర్తించాలి. గాలి డ్రై గా ఉంచేందుకు ఎయిర్ కండిషన్ ను ఆన్ చేయాలి లేదా డీహ్యుమిడిఫయర్ ను ఉపయోగించాలి. ఎయిర్ కండిషనర్ ను రన్ చేయడం వలన పాపాయికి చలిగా ఉండవచ్చు. కాబట్టి బేబీ రగ్స్ ను అందుబాటులో ఉంచుకోండి. అలాగే వాతావరణం వలన దుస్తులు పూర్తిగా ఆరకపోవచ్చు. అందువలన, దుస్తులపై వెచ్చటి ఐరన్ ను ఉపయోగించండి.

పరిశుభ్రమైనవే తినండి అలాగే తాగండి:

పరిశుభ్రమైనవే తినండి అలాగే తాగండి:

కాలమేదైనా హైజీన్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో హైజీన్ కున్న ప్రామఖ్యత ను గుర్తించాలి. ఇంట్లోని చంటి పిల్లలు ఉన్నప్పుడు హైజీన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలోనే బాక్టీరియా మరియు ఫంగై అనేవి విపరీతంగా వృద్ధి చెందుతాయి. కాబట్టి, తినేవాటిపై అలాగే తాగేవాటిపై దృష్టి పెట్టండి. బేబీ బాటిల్స్ ను ఎక్కువగా అందుబాటులో ఉంచుకోండి. అదనపు బాటిల్స్ ను అందుబాటులో ఉంచుకోవడం వలన బాటిల్స్ ను బాయిల్ చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. పాపాయి ఫుడ్ పాడవకుండా ఉండేందుకు ఫుడ్ ను ఫ్రిడ్జ్ లో భద్రపరచండి.

ఇంట్లోని బగ్స్ ను బహిష్కరించండి:

ఇంట్లోని బగ్స్ ను బహిష్కరించండి:

వర్షం నుంచి రక్షణ కోసం చీమలు, దోమలు అలాగే ఈగలు ఇళ్లల్లోకి ప్రవేశిస్తాయి. మీ ఇంటిని అవి ఎంచుకోకుండా జాగ్రత్తపడండి. ఇంటి చుట్టుపక్కల నీళ్లు నిల్వ లేకుండా జాగ్రత్త పడండి. ప్రతీదీ డ్రై గా అలాగే క్లీన్ గా ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా వంటిళ్లు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తపడండి. మిగతా రూమ్స్ అంటే ముఖ్యంగా పాపాయి ఉండే గదిని ప్రతి రోజూ తుడిచి అలకండి. తద్వారా, క్రిమికీటకాలు గదిలో లేకుండా జాగ్రత్తపడండి. గుడ్ నైట్ ప్యాచెస్ ను వాడటం ద్వారా దోమల నుంచి రక్షణను పొందవచ్చు.

డ్రెస్ లను తెలివిగా ఎంచండి:

డ్రెస్ లను తెలివిగా ఎంచండి:

వర్షాకాలంలో ప్రతి రోజూ వర్షం పడకపోవచ్చు. కొన్ని సార్లు ఎండ ఎక్కువగా ఉండవచ్చు. అటువంటప్పుడు వేసవికాలంలో కనిపించేటటువంటి ఉష్ణోగ్రతలను గమనించే ఆస్కారం ఉంది. అందువలన, లైట్ గా ఉండే లాంగ్ స్లీవ్డ్ కాటన్ డ్రెస్ లను పాపాయి కోసం సిద్ధంగా ఉంచుకోండి. అందువలన, దోమకాటుల నుంచి వారికి రక్షణ లభిస్తుంది. కాటన్ వస్త్రం చల్లదనాన్ని కూడా అందిస్తుంది. బట్టలు బాగా ఆరాక వాటిని వాడండి.

English summary

5 things you need to know to keep your new-born safe during monsoons

All through the sweltering summer, we long for rain. When it finally starts pouring, it brings relief and trouble in equal measure. The drop in temperature offers much-needed relief, but the humidity, the stagnant water, and the insects, all bring their own set of health problems.It is young children and new-born babies who are most susceptible to the ill-effects of the rainy season. So, here are some tips and tricks to help you breeze through the monsoons.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more