పిల్లల బిహేవియర్ పై వారికి మనం ఇచ్చే ఆహారం ప్రభావం ఎక్కువ

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

పిల్లల్లో బిహేవియరల్ ప్రాబ్లెమ్స్ అనేవి కొంతవరకు సాధారణమే. ఐతే, ఒకవేళ ఈ ప్రాబ్లెమ్స్ అనేవి శృతి మించితే మీరు తక్షణ వైద్య సలహాను పాటించడం మంచిది.

పిల్లల బిహేవియర్ పై వారికి మనం ఇచ్చే ఆహారం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంపై దృష్టి పెడితే వారిని బిహేవియరల్ ప్రాబ్లెమ్స్ నుంచి రక్షించుకోవచ్చు. చాలా మందికి పిల్లలకిచ్చే డైట్ పై అవగాహన లేకపోవటం దురదృష్టకరం. పిల్లలకు అందించే ఆహారం పట్ల శ్రద్ధ వహించటం వలన వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించవచ్చు. తద్వారా, వారిలో అనేకరకాల సమస్యలను అరికట్టవచ్చు.

Baby Sleep Tips That Will Help You Get More Sleep

సొసైటీలో సాధారణంగా పిల్లలు ఏ ఫుడ్స్ ని తీసుకోకూడదో చర్చించుకుంటూ ఉంటారు. షుగర్ కప్స్ ని అవాయిడ్ చేయమని లేదా ఛీజ్ ని అవాయిడ్ చేయమని సలహాలు మీకు వస్తూనే ఉంటాయి.

అయితే, ఏ పోషకాలు పిల్లలకు ముఖ్యమో తెలియచేసే సలహాలు తక్కువగా వస్తుంటాయి. పిల్లల బిహేవియర్ కి పోషకాహార లోపమనేది ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు.

కెమికల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలతో పాటు ప్రొసెస్డ్ ఫుడ్స్ పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావము చూపిస్తాయి. ఈ ఫుడ్స్ ని వారికి అందిస్తే, వారిలో బిహేవియరల్ ప్రాబ్లెమ్స్ కూడా తలెత్తే అవకాశం కలదు.

అందువలన, ఈ ఆర్టికల్ లో పిల్లలకు అవసరమయ్యే పోషకాల వివరాలను ఆయా పోషకాల ప్రాముఖ్యతను వివరించాము. ఈ ఆర్టికల్ ని చదవడం ద్వారా పేరెంట్స్ తమ పిల్లలకు పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించి వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తాము.

Baby Sleep Tips That Will Help You Get More Sleep

ఈ లిస్ట్ అనేది పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన మెగ్నీషియం, జింక్, విటమిన్ డి, విటమిన్ బి, ఐరన్, ప్రోటీన్ మరియు ఒమేగా-3 లపై ఫోకస్ చేస్తోంది. ఈ పోషకాల ప్రాధాన్యతను ఇప్పుడు తెలుసుకుందాం.

సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ ని ప్రశాంతపరిచేందుకు అలాగే బ్రెయిన్ ఎలెక్ట్రికల్ యాక్టివిటీను ఎనేబుల్ చేసేందుకు మెగ్నీషియం అవసరపడుతుంది. ఈ న్యూట్రియెంట్ అనేది బ్రెయిన్ యాక్టివిటీను మెరుగుపరిచేందుకు అలాగే నెర్వస్ సిస్టమ్ ని ప్రశాంతపరిచేందుకు అవసరమవుతుంది.

జింక్ అనేది న్యూరో ట్రాన్స్మీట్టర్ ఫంక్షన్ ని ఎనేబుల్ చేస్తుంది. ఆలాగే మెదడులోని DHA ఫ్యాట్ మెటబాలిజం కి కూడా ఇది అవసరం. స్లీప్ కి అలాగే మూడ్ కి అవసరమయ్యే మెలటోనిన్ ని కూడా ఇది నియంత్రిస్తుంది. పిల్లలు ప్రశాంతంగా ఉండేందుకు వారి సోషల్ బిహేవియర్ మెరుగయ్యేందుకు జింక్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Baby Sleep Tips That Will Help You Get More Sleep

ఒమేగా-3 ల నుంచి చిన్నారుల మెదడు ఎదుగుదలకు అవసరమైన DHA లభిస్తుంది. అమ్మాయిల కంటే అబ్బాయిలకు ఈ న్యూట్రియెంట్ అవసరం మూడు రెట్లు ఎక్కువ. ఒక అధ్యయనం ఫలితం ప్రకారం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తగినంత తీసుకుంటునన్ చిన్నారులు రీడింగ్ మరియు స్పెల్లింగ్స్ లో బెటర్ గా పెర్ఫామ్ చేయగలుగుతున్నారని తెలుస్తోంది. అలాగే, వారిలో బిహేవియరల్ ప్రాబ్లెమ్స్ తక్కువని కూడా తెలుస్తోంది.

శరీరంలోని ప్రతి సింగిల్ సెల్ యొక్క ఫంక్షన్ కి విటమిన్ డి అవసరమవుతుంది. అలాగే అటెన్షన్ మరియు బ్రెయిన్ ఫంక్షన్ కై ఈ విటమిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లెవెల్స్ ని సరైన స్థాయిలో మెయింటైన్ చేస్తే శక్తితో పాటు మూడ్ మెరుగవడంతో పాటు పిల్లలకు తగినంత నిద్ర కూడా లభిస్తుంది. సూర్యుడి నుంచే విటమిన్ డి ని గ్రహించడం మంచిది. ఫుడ్ ద్వారా కూడా విటమిన్ డి ని గ్రహించవచ్చు.

మూడ్ ని అలాగే బిహేవియర్ ని రేగులేట్ చెసే సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్మీట్టర్స్ ఉత్పత్తికి విటమిన్ బి అవసరపడుతుంది. విటమిన్ బి తక్కువగా ఉన్న చిన్నారులు లెర్నింగ్ మరియు బిహేవియరల్ ప్రాబ్లెమ్స్ తో ఇబ్బందులకు గురవుతారు.

Baby Sleep Tips That Will Help You Get More Sleep

అటెన్షన్, మూడ్ మరియు ఎనర్జీలకై ఐరన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా రెండేళ్ల వయసున్న చిన్నారులకు ఐరన్ అవసరం ఎక్కువ. ఈ సమయంలో బ్రెయిన్ డెవెలప్మెంట్ అనేది వేగంగా జరుగుతుంది. ఐరన్ లోపం వలన అటెన్షన్ అలాగే మూడ్ కి సంబంధించి దీర్ఘకాల సమస్యలు ఎదురవవచ్చు. కాబట్టి, ఐరన్ లెవల్స్ హెల్తీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రోటీన్ అనేది పిల్లల మెదడు అలాగే శరీరానికి బిల్డింగ్ బ్లాక్ లా పనిచేస్తుంది. ప్రోటీన్లు సమృద్ధిగా లభించే డైట్ ను అందించడం వలన వారికి శక్తి అందుతుంది. డైట్ లో హై క్వాలిటీ ప్రోటీన్ ను జోడించడం వలన వారి ప్రవర్తన, అటెన్షన్ అలాగే సోషల్ ఫంక్షన్ అనేవి మెరుగ్గా ఉంటాయి.

English summary

Baby Sleep Tips That Will Help You Get More Sleep

We live in a society that talks endlessly about the foods our kids shouldn’t eat. You probably heard things like fruit cups are all sugar. Or never give your kids red food dye. Or Kraft mac and cheese is the devil.