For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బిడ్డ పొట్టలో గ్యాస్ సమస్యకు కారణాలు ఏమై ఉండవచ్చు?

మీ బిడ్డ పొట్టలో గ్యాస్ సమస్యకు కారణాలు ఏమై ఉండవచ్చు?పిల్లల ఏడుపు గురించి మాట్లాడవలసి వస్తే, దీనికి ఉన్న సాధారణ కారణాల్లో కడుపు నొప్పిని ఒకటిగా చెప్పుకోవచ్చు. చిన్న పిల్లలు తరచూ అపానవాయు సమస్యతో బాధపడ

|

ఒక నూతన జీవి యొక్క ఆలనాపాలనా చూసుకోవడమనేది, ఒక వ్యక్తి జీవితంలో అతిపెద్ద బాధ్యత. చాలా వరకు (ముఖ్యంగా భారతీయల విషయంలో) ప్రణాళిక ప్రకారం గర్భధారణ జరుగుతుంది. ఒక ప్రాణిని ఈ భూమి మీదకు ఆహ్వానించే ఈ ప్రక్రియకై సంసిద్ధమై, జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలి. ఈ రకమైన ప్రణాళిక సాధారణంగా తల్లిదండ్రులు ఇద్దరు కలిసి చేసుకుంటారు.

గర్భధారణ అనంతరం తల్లిదండ్రులు తరచూ పిల్లల యొక్క ఆరోగ్యం మరియు విద్య వంటి విషయాల గురించి చర్చించుకుంటారు. అయితే, తల్లిదండ్రులు ఇటువంటి విషయాలలో తీసుకునే నిర్ణయాలు ఆచరణలోకి రాక ముందే, వారు ప్రారంభదశలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొంటూ, పిల్లల ఏడుపులతో కూడిన నిద్రలేని రాత్రులు గడపవలసి ఉంటుంది.

How To Know If Babies Have Gas

పిల్లల ఏడుపు గురించి మాట్లాడవలసి వస్తే, దీనికి ఉన్న సాధారణ కారణాల్లో కడుపు నొప్పిని ఒకటిగా చెప్పుకోవచ్చు. చిన్న పిల్లలు తరచూ అపానవాయు సమస్యతో బాధపడుతుంటారు. దీనిని వ్యక్తపరచడానికి వేరొక మార్గం లేక ఏడుస్తూ ఉంటారు.

తల్లిదండ్రులుగా, వారి యొక్క వివిధ రకాల బాధలను అర్థం చేసుకుని, వారికి ఉపశమనం మీ కలిగేలా చేయడం మన బాధ్యత. ఈ వ్యాసం ద్వారా మీ పిల్లల నొప్పులకు గల కారణాలు వాటిని తగ్గించగల మార్గాలు గురించిన చర్చల గురించి సమాచారం మీకు అందిస్తున్నాము.

1. పిల్లల త్రేన్పు

1. పిల్లల త్రేన్పు

పెద్దవారము కనుక మనకు కడుపులో ఎటువంటి అసౌకర్యం తలెత్తినా,ఎలా ఎదుర్కోవాలి తెలుసుకుని ఉంటాం కనుక, సులభమయిన మార్గాల ద్వారా వాటినుండి బయట పడతాం.

కానీ, మీ శిశువుకు మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన పరిజ్ఞానం ఉండదు కనుక, వారు ఆహారం తీసుకున్న అనంతరం ప్రతిసారి త్రేన్పు వచ్చేలా చేసే బాధ్యత మీదే. ఇలా చేయడం వల్ల వారి పొట్టలో ఎలాంటి వాయువులు నిలిచి ఉండలేదని నిర్థారణ అవుతుంది.

2. సరికాని భంగిమలోలో బిడ్డకు ఆహారం అందించడం

2. సరికాని భంగిమలోలో బిడ్డకు ఆహారం అందించడం

పీడియాట్రిషియన్స్ ప్రకారం, ఇది పిల్లలలో గ్యాస్ ఏర్పడటానికి గల అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి. పోషణ అందించేటప్పుడు, బిడ్డ నోరుతో పోలిస్తే కడుపు ఎత్తులో ఉన్నట్లయితే, గాలి లోపలకు వెళుతుంది.

సీసాలో పాలు తాగేవారి విషయంలో ఇది వర్తిస్తుంది. తత్ఫలితంగా, శిశువులోకి పాలుతో పాటు గాలికూడా లోపలికి వెళ్ళి అసౌకర్యం ఏర్పడుతుంది.

ఇలా జరగకుండా నివారించడానికి, తల కడుపు కంటే ఎక్కువ ఎత్తులో ఉండేట్టు జాగ్రత్తలు తీసుకోండి. దీని కొరకు , మీకొక నర్సింగ్ దిండు అవసరమవచ్చు. సీసాలో పాలు తాగేటప్పుడు, మీ బిడ్డ నిలబడి ఉండేట్టు చూసుకోండి, దీని వలన సీసా యొక్క నిపుల్ లోనికి గాలి చొరబడదు.

3. ఫీడింగ్ పరికరాలలో లోపాలు

3. ఫీడింగ్ పరికరాలలో లోపాలు

సీసా పాలు తాగేవారిలో గ్యాస్ సమస్యలు ఎక్కువ. దీనికి కారణం వారు తాగే పాలు కానప్పుడు, వారికి ఆ పాలను పట్టించే పరికరాలలో లోపాలు కారణమవుతాయి. మీ బిడ్డ తాగగలిగే వేగానికంటే, ఎక్కువ వేగంతో పాలు నోటిలోకి పోవడం వల్ల , పిల్లలు తాగలేకపోతారు. ఈ సమయంలో వారిలోకి గ్యాస్ చేరుతుంది.

కనుక , ఇటువంటి సమస్య తలెత్తినప్పుడు, మీరు పాలు అందే వేగం తక్కువగా ఉండే నిపిల్ ఎంచుకోవాలి. మీ బిడ్డకు అనుగుణంగా ఉండే పాలసీసాలను ఎంచుకుని వాడాలి.

4. పిల్లలకు అందించే ఆహారం

4. పిల్లలకు అందించే ఆహారం

పిల్లలకు ఆహారం అందించే భంగిమ మరియు పరికరాలతో ఎటువంటి దోషం లేనట్లయితే, మీరు సరిచూసుకోవలసిన మరొక అంశం మీ చిన్నారికి ఏమి ఆహారం ఇస్తున్నారనేదే! మీ బిడ్డకు డబ్బా పాలు ఇస్తున్నట్లైతే రకరకాల బ్రాండ్ లను పరీక్షిస్తూ, వారిపై ఒత్తిడి కలిగించని బ్రాండ్ ని ఎన్నుకోండి. మీరు పట్టేవి తల్లి పాలైతే, మీరు తినే ఆహారం మూలంగా ఈ సమస్య తలెత్తుతుందని అర్ధం.

పాల ఉత్పత్తులు మరియు కెఫిన్ వంటి పదార్థాలను పాలిచ్చే తల్లి తరచుగా తీసుకున్నట్లైతే, వారి పిల్లలలో గ్యాస్ సమస్యలు అధికంగా కలుగుతాయి. అందువలన, వైద్యుని సంప్రదించి మీ ఆహారపు అలవాట్లలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే, మీ చిన్నారికి ఉపశమనం లభిస్తుంది.

5. జీవనశైలిలో మార్పులు

5. జీవనశైలిలో మార్పులు

మీ చిన్నారికి ఒక వెచ్చని స్నానం చేయించడం వంటి పనులు, గ్యాస్ వలన కలిగే నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. సున్నితమైన మర్దన (ముఖ్యంగా ఒక సైకిల్ సవారీ మాదిరిగా వారి కాళ్ళను కదిలించేటప్పుడు) ప్రత్యేకించి ఒక సంవత్సరం కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో, ఎన్నో అద్భుతాలు చేస్తుంది.

ఆహారం తీసుకున్న తరువాత ప్రతిసారి, మీ బిడ్డను 10-15 నిమిషాలు పాటు వారి కడుపు మీదగా పడుకునేట్టు అలవాటు చేయండి. ఈ విధమైన సాధారణ జీవనశైలి మార్పులు పిల్లల్లో గ్యాస్ సమస్య నివారణలో సహాయపడతాయి.

6. మీ బిడ్డను పైకి కిందికి ఊపండి

6. మీ బిడ్డను పైకి కిందికి ఊపండి

ఇది పిల్లలలో గ్యాస్ సమస్య నివారించడానికి కల సులభమైన మార్గాల్లో ఒకటి. మీరు చేయవలసినదల్లా, మీ బిడ్డని జాగ్రత్తగా మీ ఒడిలో పెట్టుకోండి. ఇలా చేసేటప్పుడు మీకు సౌకర్యంగా ఉండాలి. పరుపు మీద కూర్చుని చేస్తే, మీకు సౌకర్యవంతంగా ఉంటుంది . మీ బిడ్డను మెల్లగా పైకి, కిందకి ఎగరేయండి. ఇలా ఒక వారం పాటు, రోజుకు రెండు మూడు సార్లు చేస్తే మార్పు గమనించవచ్చు.

7. మందులు

7. మందులు

పిల్లల్లో గ్యాస్ సమస్య నివారణకు అనేక మందులు లభ్యతలో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం తప్పేమీ కాదు ఎందుకంటే, వాటి ద్వారా పిల్లలకు ఉపశమనం కలుగుతుంది. అయితే, మీరు డాక్టర్ను సంప్రదించి, వారి సలహాపై మాత్రమే వీటిని వాడండి. ఎందుకంటే, కొన్నిసార్లు, కొన్ని మందుల వలన పిల్లలలో అలెర్జీ వస్తుంది.

English summary

How To Know If Babies Have Gas

The biggest responsibility that one can have in their life is that of nurturing a new life. In most cases (especially in the Indian context), pregnancies are planned. A lot of careful planning and preparedness goes into brining a new life on earth. This type of planning usually involves both the parents.
Desktop Bottom Promotion