పాపాయిలను పడుకోబెట్టే స్థితులుః ఏది సురక్షితం మరియు ఏది కాదు

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీ ఇంట్లో పసిబిడ్డ ఉంటే, వారు సురక్షితంగా పడుకునే పద్ధతులు తెలిసి ఉండటం మరియు సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ లేదా ఎస్ ఐడిఎస్ రిస్క్ ను తగ్గించటానికి చిట్కాలు పాటించండి. ఈ అనారోగ్యం యూఎస్ లో ఏటా 2500 మంది ప్రాణాలను కబళిస్తోంది.

హఠాత్తు మరియు అనూహ్య పసిపిల్లల మరణాలలో 80 శాతం ఎస్ ఐడిఎస్ వల్లనే కలుగుతున్నాయని ఒక అధ్యయనంలో తేలింది. దీన్ని ఎదుర్కొనే అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఏడాదిలోపు ఆరోగ్యంగా ఉన్న బిడ్డను వెల్లకిలా పడుకోబెట్టడం అంటే వీపుపై పడుకునేలా చేయటం.

simple remedies to lighten dark elbows

బోల్డ్ స్కై ఈరోజు మీకు బేబీని సరిగా ఎలా పడుకోబెట్టవచ్చో చెప్తుంది, మరియు పసిపిల్లలకి, పాపాయిలకి సురక్షితమైన నిద్రకి చిట్కాలు కూడా అందిస్తుంది.

సడెన్ అన్ ఎక్స్పెక్టడ్ డెత్ ఇన్ ఇన్ఫాన్సీ (ఎస్ యూడిఐ) కి దారితీసే నిద్ర పద్ధతులు

పసిపిల్లల్లో అపాయకర నిద్రామరణాలు (ఎస్ యూడిఐ) కిందకి సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోం (ఎస్ ఐడిఎస్) మరియు అపాయకరమైన నిద్రప్రమాదాలు రెండూ వస్తాయి.

ఎస్ యూడిఐకి దారితీసే పడుకునే విధానాలు ఇవిగో;

పాపాయిని బోర్లా లేదా పక్కకి పడుకోబెట్టడం

బేబీని మెత్తని స్థలాలైన పరుపులు,సోఫా, నీటిబెడ్, దిండు,లేదా గొర్రె వూలు

తల్లి లేదా తండ్రితో పడుకున్నా లేకపోయినా

స్పాన్సర్ చేయబడినది

బేబీ తలని లేదా ముఖాన్ని దుప్పటితో మూయడం,ఇది ప్రమాదకరంగా ఊపిరిఆడనివ్వకపోదు మరియు అతిగా వేడిగా కూడా అన్పిస్తుంది.

కడుపుతో ఉన్నప్పుడు లేదా బిడ్డ పుట్టాక పొగతాగడం

పాపాయి పడుకునే మంచి మరియు చెడ్డ విధానాలు

పై రిస్క్ లను తగ్గించటానికి మీరు బేబీ పడుకునే సురక్షిత మరియు అపాయకర స్థితులను తెలుసుకుని వుండాలి.

1.వెల్లకిలా పడుకోవటం

1.వెల్లకిలా పడుకోవటం

ఆరోగ్యంగా పుట్టిన పాపాయిలను చిన్న కునుకులకు, విశ్రాంతికి మరియు రాత్రిపూట నిద్రకి కూడా వెల్లకిలానే పడుకోబెట్టాలి.

వెల్లకిలా పడుకోబెట్టే పొజిషన్ ఎస్ ఐడిఎస్ రిస్క్ ను తగ్గించి, గాలి వెళ్ళే మార్గాలను ఎప్పుడూ మూసుకుపోకుండా, నలగకుండా ఉంచుతుంది.

యూఎస్ నేషనల్ ఇన్స్ స్టిస్ట్యూట్ ఆఫ్ ఛైల్డ్ అండ్ హ్యూమన్ డెవలప్ మెంట్ (ఎన్ ఐసిహెచ్ డి) దీన్నే పాపాయిలకి సరైన పడుకునే విధానమని నిర్థారించింది.

అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ 1992లో నిద్రలోకి జారుకోండి అనే సలహా ఇచ్చినప్పటి నుండి ఎస్ ఐడిఎస్ రేటు 50శాతం కన్నా తగ్గింది.ఈ నిద్రలోకి జారుకోండి సలహాను తర్వాత ఇక నిద్ర సురక్షితం అనే ప్రచారంగా మార్చారు.

2. వెల్లకిలా పడుకోవటం వలన ఉండే రిస్క్ లు

2. వెల్లకిలా పడుకోవటం వలన ఉండే రిస్క్ లు

పసిపిల్లలను ఎక్కువసేపు వెల్లకిలా ఒకే స్థితిలో పడుకోబెడితే, అది పొజిషనల్ ప్లేగియోసెఫాలీ అనే అనారోగ్యస్థితికి దారితీస్తుంది. ఇది సమతలంగా మారిపోయిన లేదా వికారమయిన రూపమున్న తలగా మారిపోతుంది మరియు బ్రాకీసెఫలీ అనగా కపాలం వెనకభాగం సమతలంగా మారిపోవటం కూడా జరుగుతుంది. వారికి ఏడాది వయస్సు రాగానే ఆకారం మామూలుగా మారిపోతుంది, వైద్య అవసరం కూడా అరుదుగా ఉంటుంది.

3. కొంచెం చిన్న చిన్న పడుకునే విధానాలలో మార్పులతో ఇలాంటివి అధిగమించవచ్చు. అవేంటంటే ;

3. కొంచెం చిన్న చిన్న పడుకునే విధానాలలో మార్పులతో ఇలాంటివి అధిగమించవచ్చు. అవేంటంటే ;

పాపాయి మెలకువగా ఉన్నప్పుడు బోర్లా పడుకునే సమయాన్ని పెంచడం.

సమతలంగా ఉన్న వైపు కాకుండా పాపాయిని మరోవైపు తిరిగి పడుకునేలా చేయడం.

క్యారియర్లు కానీ కార్ సీటర్లలో కానీ పాపాయిలు ఎక్కువసేపు గడపకుండా చేయడం

హత్తుకునే సమయాన్ని వారికి పెరిగేలా చేయడం.

క్రిబ్ లో పాపాయి ఉన్న దిశను అప్పుడప్పుడూ మారుస్తూ ఉండటం వలన ఒకే దిశలో ఒకే వస్తువులను చూస్తూ ఉండకుండా ఉండటం జరుగుతుంది.

4. బోర్లా పడుకోవడం

4. బోర్లా పడుకోవడం

అనేక సిద్ధాంతాలు తల్లిదండ్రులను తమ బిడ్డలు బోర్లా పడుకోనివ్వకూడదని చెబుతున్నాయి ఎందుకంటే;

అలా చేయటం వలన పాపాయి దవడపై ఒత్తిడి పెరిగి గాలి సరిగా లోపలికి వెళ్ళక ఊపిరి ఆడదు.

ఒకవేళ పాపాయి బోర్లా పడుకుంటే అంటే పొట్టపై పడుకుంటే, తన మొహం దుప్పటికి దగ్గరగా ఉండి మళ్ళీ వదిలిన గాలినే పీలుస్తూ ఉండే అవకాశం ఉంది.

మెత్తటి పరుపుపై బోర్లా పడుకుంటే బేబీకి ఊపిరి ఆడకపోవచ్చు.

బేబీ దుప్పట్లలో ఉండే సూక్ష్మజీవులను పీల్చుకోవచ్చు. పాపాయిలు బోర్లా పడుకునగలిగే స్థితులు ఏమన్నా ఉన్నాయా మరి?

అరుదైన కేసుల్లో, అనారోగ్య స్థితి వలన, వైద్యులు పాపాయిని వెల్లకిలా కాక బోర్లా పడుకోబెట్టమని చెప్తారు.

కొందరు వైద్యులు బోర్లా పడుకోవటం తీవ్రంగా ఎసిడిటీ ఉన్న లేదా పైన శ్వాసకోశ లోపాల స్థితులైన పియరీ రాబిన్ సిండ్రోమ్ తో గాలి అస్సలు ఆడకపోవటం వంటి పిల్లలకి మంచిదని చెప్తారు. కానీ ఇలాంటి లాభాలను ధృవీకరించటానికి ఇటీవల అధ్యయనాలేవీ జరగలేదు. ఆరోగ్య నిపుణులు కూడా దీన్ని సలహాగా ఇచ్చేటప్పుడు లాభాలు, రిస్క్ లు దృష్టిలో పెట్టుకోవాలి.

ఇదివరకు వైద్యులు వెల్లకిలా పడుకునే పిల్లల్లో వాంతులయితే చాలా ప్రమాదకరమని, అందుకని బోర్లా పడుకోవడం మంచిదేనని ముఖ్యంగా వాదనల్లో వినిపించేవారు. పాపాయిలకి వెంటనే తలతిప్పే సామర్థ్యం ఉండనందువలన వాంతి అవుతున్న సమయంలో ఊపిరాడదని వారు భావించేవారు. కానీ అనారోగ్యంగా ఉన్నప్పుడు వెల్లకిలా పడుకునే పాపాయిలకి తలలు పక్కకి తిప్పడంలో ఎలాంటి కష్టం లేదని తేలింది.

5.పక్కకి తిరిగి పడుకోబెట్టడం

5.పక్కకి తిరిగి పడుకోబెట్టడం

బేబీలను పక్కకి తిప్పి పడుకోబెట్టడం అపాయకరం ఎందుకంటే వారు తొందరగా బోర్లా పడిపోతారు, దాని వలన సడెన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోం (ఎస్ ఐడిఎస్ ) ప్రమాదం పెరుగుతుంది.

English summary

Sleeping Positions For Babies: What Is Safe And What Is Not

If you have a baby at home, it is essential to know about the safe sleeping positions and tips to reduce Sudden Infant Death Syndrome or SIDS risk
Story first published: Thursday, January 4, 2018, 13:30 [IST]