For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొంతమంది పిల్లలు పుట్టుకతోనే అతి తక్కువ బరువుతో ఉంటారు? కారణం తెలుసా?

కొంతమంది పిల్లలు పుట్టుకతోనే అతి తక్కువ బరువుతో ఉంటారు? కారణం తెలుసా?

|

అందరు తల్లులు తమకు పుట్టే శిశువు ఆరోగ్యకరముగా, మరియు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ అన్ని వేళలా అది సాధ్యం కాదు. తల్లి వైపు నుండి ఉత్తమ సంరక్షణ కలిగి ఉన్నప్పటికీ, కొందరు పిల్లలు ఇప్పటికీ తక్కువ బరువుతో జన్మిస్తున్నారు. తక్కువ బరువు కలిగిన పిల్లలు 2500 గ్రాముల కన్నా తక్కువగా ఉంటారు.

అనేకమంది పిల్లలు తక్కువ బరువు కారణముగా ఆరోగ్యకరమైన జీవితాన్ని కొంతమేర పొందలేకపోతున్నారు అన్నది వాస్తవం. తక్కువ బరువు కలిగిన పిల్లలు సాధారణముగా శ్వాస సంబంధిత వ్యాధులు మరియు తక్కువ రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటారు. అలాగని జీవిత కాలం మొత్తం ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేము. ఒక్కోసారి తక్కువ రోగ నిరోధక శక్తి ప్రభావం వలన తల్లి పాలు తాగడానికి కూడా శక్తి చాలక శిశువులు ఇబ్బంది పడుతుంటారు అన్నది వాస్తవం. కావున శిశువుకు జన్మనిచ్చిన తర్వాతే కాకుండా, గర్భానికి ముందు, గర్భధారణ సమయంలో మరియు జన్మనిచ్చిన తర్వాత, ఈ మూడు అంశాలలో ప్రత్యేక శ్రద్దని కలిగి ఉండవలసి ఉంటుంది.

Why are some babies born with low weight?

ముఖ్యంగా తక్కువ బరువుతో పుట్టిన శిశువు పట్ల అత్యంత జాగరూతులై వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. ఎప్పటికప్పుడు వీరి ఆరోగ్య స్థితులను గురించిన పరీక్షలను చేయిస్తూ పర్యవేక్షిస్తూ ఉండాలి. మరియు పరిసరాలను తమ శరీరానికి అనువుగా మలచుకునే వరకు అనారోగ్య సమస్యలు తరచుగా ఎదుర్కొంటుంటారు, కావున ఎప్పటికప్పుడు వైద్య పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. కొందరు డెలివరీ తర్వాత, నెలల తరబడి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళకుండా అజాగ్రత్త కలిగి ఉంటారు. అటువంటి సందర్భంలో, వారికి సమస్యలను అర్ధమయ్యేలా చెప్పి ఆసుపత్రికి పంపవలసిన భాద్యతను కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తీసుకోవలసి ఉంటుంది.

వైద్యుని సలహా మేరకు శిశువు ఉండవలసిన బరువును దృష్టిలో ఉంచుకొని, క్రమంగా ఆహార ప్రణాళికలో మార్పులు చేస్తూ, సరైన పోషకాహారాన్ని అందిస్తూ బరువును క్రమబద్ధీకరించవలసిన అవసరం ఉన్నది.

ఇటువంటి సమస్యలను ఎదుర్కోవడం కష్టతరమే అయినప్పటికీ, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా, తల్లి దండ్రులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ, ఈ వ్యాసములో తక్కువ బరువుతో శిశువు పుట్టడానికి కారణాలు మరియు, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలతో వ్యవహరించవలసిన అంశాల గురించిన వివరాలను తెలుసుకుందాం..


కొంతమంది పిల్లలు పుట్టుకతోనే అతి తక్కువ బరువుతో ఉంటారు? కారణం తెలుసా?

శిశువు అకాల పుట్టుక :

శిశువు అకాల పుట్టుక :

నెలలు నిండకుండా పుట్టిన శిశువులలో బరువు అత్యంత తక్కువగా ఉండడం సర్వసాధారణం. నెలలు నిండకుండా పుట్టడానికి అనేక కారణాలు కారకాలుగా ఉన్నాయి. అందులో ముఖ్యముగా తల్లి‌ లేదా గర్భస్థ పిండం యొక్క ఆరోగ్య సమస్యలు ప్రధాన కారణంగా ఉంటుంది. ఒక్కోసారి ప్రమాదాలు, అధిక రక్తపోటు, భయం, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా కారణాలుగా మారవచ్చు. క్రమంగా తక్కువ బరువుతో పుట్టిన శిశువులలో ఎదుగుదలలో, మరియు జీవక్రియలలో ఒత్తిడి ఎక్కువగా నెలకొంటుంది. కావున సరైన బరువును లేదా సరైన ఆరోగ్యాన్ని సంతరించుకునేంతవరకు, దీర్ఘకాలంపాటు శిశువు ఆసుపత్రిలోని వైద్యుల పర్యవేక్షణలో ఉంచవలసి వస్తుంది. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న కారణాన, సులభంగా వ్యాధులకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు.

ఆక్సిజన్ తగ్గుదల :

ఆక్సిజన్ తగ్గుదల :

గర్భస్థ పిండానికి సరైన మోతాదులో ప్రాణవాయువు అందని పక్షంలో, తక్కువ బరువుతో పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయి. కావున శిశువు కడుపులో ఉండగా తల్లి సరైన పోషక ఆహారాన్ని తీసుకుంటూ, వైద్యుని సూచనల ప్రకారం మందులను తీసుకుంటూ, పరిసరాలను ఆరోగ్యానికి అనుగుణంగా అమర్చుకోవాల్సి ఉంటుంది. గర్భస్థ పిండం గర్భాశయంలో సరైన ప్రాంతములో లేకపోయినా, లేదా తల్లి యొక్క ఆరోగ్య పరిస్థితి ముఖ్యముగా ఇందుకు ప్రధాన కారణాలుగా ఉంటాయి.

ఫ్రీ ఎక్లాంప్సియా :

ఫ్రీ ఎక్లాంప్సియా :

ప్రీ ఎక్లాంప్సియా అనునది ఒక ఆరోగ్య సమస్య. ఈ సమస్య ఎదురైన ఎడల, కడుపులో పెరుగుతున్న గర్భస్థ పిండం ఎదుగుతున్న దశ లేదా పరిస్థితి, మరియు తల్లి యొక్క ఆరోగ్యస్థితి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యముగా అధిక రక్తపోటు ప్రధాన అడ్డంకిగా మారి శిశువుకు రక్తప్రసరణలో ఆటంకాన్ని కలిగించవచ్చు. మరియు శిశువు ఆరోగ్యకరంగా పుట్టడానికి అవసరమైన ప్రాణవాయువును మరియు పోషకాహార సరఫరా మీద ప్రభావాన్ని చూపి, వాటి పరిమితిని దారుణముగా తగ్గిస్తుంది.

ధూమపానం హానికరం :

ధూమపానం హానికరం :

ప్రత్యక్ష లేదా పరోక్ష ధూమపానం, శిశువు బరువు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది అని అధ్యయనాల్లో తేలిన నిజం. ధూమపానంలో నికోటిన్ వంటి హానికరమైన రసాయనాలు శరీరంలో చెడు ప్రభావాలను కలిగిస్తాయి. క్రమంగా వీటి ప్రభావం శరీరంలోని రక్తనాళాల మీద ప్రధానంగా పడుతుంది. దీని కారణముగా కడుపులోని బిడ్డకు తగినంత ప్రాణవాయువు మరియు పోషకాలు అందక శిశువు ఎదుగుదల, బరువు మీద ప్రభావం చూపుతుంది. కేవలం ప్రత్యక్ష ధూమపానం వల్లనే కాకుండా పరోక్ష ధూమపానం మూలముగా కూడా కడుపులోని శిశువు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది‌. కావున మీరు ధూమపానానికి దూరంగా ఉండడమే కాకుండా ధూమపానం చేసే వారిని కూడా మీ చుట్టు పక్కల పరిసరాలలో లేనివిధంగా చర్యలు తీసుకోవలసి ఉంటుంది ‌

మద్యపానం :

మద్యపానం :

ప్రత్యక్ష మరియు పరోక్ష ధూమపానం కారణముగా మాత్రమే కాకుండా మద్యపానం మూలముగా కూడా కడుపులోని బిడ్డ మీద ప్రభావం ఉంటుంది. అనేక అధ్యయనాల ప్రకారం మద్యపానం తీసుకునే వారి కన్నా తీసుకొనని వారు ఆరోగ్యకర శిశువుకు జన్మనిస్తున్నట్లు తేలింది. ఆల్కహాల్ తీసుకోవడం మూలముగా శరీరంలోని జీవక్రియల మీద ప్రభావం చూపుతుంది, క్రమంగా రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, మూత్రపిండాల సమస్యలు మరియు హార్మోనుల అసమతౌల్యం వంటి సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. సాధారణముగానే గర్భందాల్చిన వారు రోగనిరోధకశక్తిని తక్కువగా కలిగి ఉంటారు, కావున ఇటువంటి సమయాలలో మద్యపానం మరియు ధూమపానం శరీర‌ ఆరోగ్యం మీద మరియు జీవక్రియల మీద పెను ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డ్రగ్స్ వాడకం :

డ్రగ్స్ వాడకం :

గర్భధారణ సమయంలో వైద్యులు నిర్దారించిన ఔషధాలు మాత్రమే తీసుకొనవలసి ఉంటుంది. దీనికి కారణం, తల్లి తీసుకునే ప్రతి ఆహారం బిడ్డకు అందుతుంది కాబట్టి. అలాకాకుండా మత్తుపదార్థాలకు బానిసగా మారడం మూలముగా, నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం, మృతశిశువుకు జన్మనివ్వడం, కడుపులోని శిశువు బరువులో అసాధారణ మార్పులు చోటుచేసుకోవడం, మొదలైనవి జరుగుతుంటాయి. కావున మత్తుపదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మత్తుపదార్ధాల వాడకం శరీర జీవక్రియల మీద, జీర్ణవ్యవస్థ మీద, గుండె, కాలేయం, క్లోమం మరియు మూత్రపిండాల మీద‌ పెనుప్రభావాలను చూపగలదు. కొన్ని సందర్భాలలో అవయవ లోపాలతో కూడా శిశువులు జన్మించే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ మీకు ఇదివరకే ఈ అలవాట్లు ఉన్న ఎడల వైద్యుని సలహాలు తీసుకోవడం మంచిది.

ఫైబ్రాయిడ్స్ :

ఫైబ్రాయిడ్స్ :

గర్భాశయంలో సాధారణంగా కనబడే కణుతులను ఫైబ్రాయిడ్స్ అని వ్యవహరిస్తారు. ఇవి తీవ్రమైన బాధతోపాటు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. నిజానికి సరైన సమయంలో కనుగొనును యెడల ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. ఇవి గర్భాశయంలో ఉన్న ఎడల శిశువు బరువు మీద ప్రభావం చూపవచ్చు. కావున ఎప్పటికప్పుడు వైద్య పర్యవేక్షణ అవసరం ఉంటుంది. ఈ కణుతులు పెద్దవిగా ఉన్న ఎడల శస్త్రచికిత్స ద్వారా తొలగించవలసి ఉంటుంది.

వైరల్ ఇన్ఫెక్షన్స్ :

వైరల్ ఇన్ఫెక్షన్స్ :

తల్లి గర్భంలో శిశువు పెరుగుతున్న సమయంలో, తల్లి ఆరోగ్యకరముగా ఉండడం ముఖ్యం. కానీ ఒక చిన్న సంక్రమణ వ్యాధి కూడా కడుపులోని బిడ్డ మీద ప్రభావాన్ని కలుగజేస్తుంది. మరియు అకాల పుట్టుకకు దారితీయడం, చికెన్ పాక్స్, తట్టు, గవదబిళ్ళలు, సాధారణ జలుబు మొదలైనవి కూడా శిశువు తక్కువ బరువుతో జన్మించుటకు కారణాలు కావచ్చు.

బహుళ గర్భాలు :

బహుళ గర్భాలు :

కొన్ని అరుదైన సందర్భాలలో కవలలు లేదా అంతకన్నా ఎక్కువ మంది గర్భంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాలలో గర్భస్థ పిండాలు ఆక్సిజన్ మరియు పోషకాల కోసం పోటీపడుతున్న కారణాన, అవి సరిగ్గా అందని శిశువు లేదా శిశువులు తక్కువ బరువుతో పుట్టే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భాలలో నెలలు నిండకుండానే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పోషకాహార లోపం:

పోషకాహార లోపం:

గర్భస్థ పిండానికి సరైన పోషకాలు అందాలి అంటే, గర్భం దాల్చిన స్త్రీ తగిన మొత్తంలో పోషకాహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి. సరైన పోషకాహారాన్ని తీసుకోని తల్లులు తక్కువ బరువుతో లేదా నెలలు నిండకుండా శిశువులకు జన్మనిచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యముగా ఆహారంలో శిశువు పెరుగుదలకు ఐరన్ వంటి పోషకాలు అవసరం.

ఒత్తిడి :

ఒత్తిడి :

కుటుంబ పరిస్థితులు, శారీరిక శ్రమ, ఆఫీసు కార్యకలాపాలు, కాలుష్య కోరల ప్రపంచం, ఆర్థిక స్థితిగతులు మొదలైన అనేక అంశాల కారణంగా ఈ కాలములో ఒత్తిడి అనునది సర్వసాధారణమైన అంశముగా ఉన్నది. ఈ ఒత్తిడి శారీరిక మరియు మానసిక సమస్యలకు ప్రధాన కారణంగా ఉంటుంది. క్రమముగా మీ శిశువు శ్రేయస్సును నిర్ధారించే క్రమంలో ఒత్తిడినుండి దూరంగా ఉండేలా ప్రణాళికలు చేసుకోవడం ఉత్తమం.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.


English summary

Why are some babies born with low weight?

Sometimes newborn babies have low birth weight. One of the main reasons being the baby's premature birth. Low birth weight also happens when baby receives less oxygen than what is required. This will block the supply of adequate amounts of oxygen and other nutrients to the baby. Smoking during pregnancy can also cause low birth weight in babies.
Story first published:Wednesday, August 1, 2018, 16:35 [IST]
Desktop Bottom Promotion