చిన్నారులు విడిగా తమకు కేటాయించిన బెడ్ పైనే నిద్రించాలా?

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

ఈ అంశంపై వివిధ అభిప్రాయలు వ్యక్తమవుతూనే ఉంటాయి. ఒక్కొక్కరూ ఒక్కొక్క అభిప్రాయం వ్యక్తపరుస్తారు. అయితే, వారి అనుభవంపై ఆయా వ్యక్తుల అభిప్రాయం ఆధారపడి ఉంటుందని మనం గుర్తించాలి. తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి ఉపయోగకరంగా ఉండేదానిపైనే సరైన పరిష్కారం ఆధారపడి ఉంటుంది. చిన్నారులను వేరే బెడ్ పైన పడుకోబెట్టేందుకు అనేక రకాల ఆప్షన్స్ ను ప్రయత్నించవచ్చు.

తల్లిదండ్రుల బెడ్ పక్కనే మరొక బెడ్ ను ఏర్పాటు చేయడం, తల్లిదండ్రుల బెడ్ పక్కనే చిన్నారుల ఉయ్యాలను ఏర్పాటు చేయడం లేదా చిన్నారులను వేరే గదిలో నిద్రపుచ్చడమనేవి వివిధ రకాల ఆప్షన్స్.

అయితే, ప్రతిఒక్కరూ తమ చిన్నారికి ఉత్తమమైనది అందించాలనే కోరుకుంటారు. పిల్లలు నిద్రించే విధానం కూడా వారి ఎదుగుదలకు అమితంగా ఉపయోగపడుతుంది. అందుకే చిన్నారులను విడిగా నిద్రపుచ్చాలనే నిర్ణయాన్ని తల్లిదండ్రులకి వదిలేయాలి. అయితే, చిన్నారులకు విడిగా నిద్రపోవటం పూర్తిగా అలవాటయ్యే వరకు తల్లిదండ్రులు కాస్తంత సహనాన్ని పాటించాలి. అంచెలంచెలుగా ముందుకు వెళుతూ ఆశించిన ఫలితాన్ని పొందాలి.

సిడ్స్ (SIDS):

సిడ్స్ (SIDS):

సడెన్ ఇంఫాట్ డెత్ సిండ్రోమ్ అనే ఈ కండిషన్ ని దృష్టిలో పెట్టుకుని చిన్నారిని విడిగా నిద్రించేలా ప్రోత్సహించడం మంచిది. తమ తల్లిదండ్రుల పక్కన నిద్రించే చిన్నారులలో ఈ సమస్య అధికంగా కనిపిస్తున్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమస్యకు అనేక రకాల అంశాలు దారితీస్తాయి. మీరు వాడే దుప్పట్లు కారణమవవచ్చు లేదా కొన్నిసార్లు కేవలం మీ చేయి కూడా ఈ ప్రాణాంతక స్థితికి దారితీయవచ్చు.

ఉపశమనం పొందుతారు:

ఉపశమనం పొందుతారు:

చిన్నారులను విడిగా వారి బెడ్ పై వారిని పడుకోబెట్టడం ద్వారా వారు స్వంతంగా ఉపశమనం పొందే స్థితికి చేరుకుంటారు. తల్లిదండ్రుల పక్కన నిద్రించే చిన్నారులు తాము నిద్రించేందుకై తల్లిదండ్రుల నుంచి మద్దతుని ఆశిస్తారు. విడిగా నిద్రించే చిన్నారులు స్వయంగా నిద్రించడం అలవాటు చేసుకుంటారు. అందువలన, చిన్నారులకు విడిగా నిద్రించే అలవాటు చేయడం ద్వారా తల్లిదండ్రులు అనవసర శ్రమకు గురవనవసరం లేదు. తద్వారా, తల్లిదండ్రులకి కూడా సరైన విశ్రాంతి లభిస్తుంది. మరుసటి రోజు ఉత్సాహంగా తమ చిన్నారుల గురించి మరింత శ్రద్దని చూపించగలుగుతారు.

ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది:

ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది:

పిల్లలు విడిగా నిద్రపోవటం వలన కలిగే ముఖ్యమైన ప్రయోజనమిది. వారికి విడిగా నిద్రించే అలవాటయ్యే కొద్దీ వారు త్వరగా గాఢ నిద్రలోకి జారుకుంటారు. తద్వారా, వారిలో ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. వారిని నిద్రపుచ్చడానికి మీరు అనేక ప్రయత్నాలు చేయనవసరం లేదు. అయితే, అన్ని విధాలా సేఫ్టీ మెజర్స్ ని తీసుకున్న తరువాతే వారికి ఒంటరిగా నిద్రించే అలవాటును చేయండి.

సాన్నిహిత్యం తగ్గుతుంది

సాన్నిహిత్యం తగ్గుతుంది

మీ చిన్నారికి విడిగా తన బెడ్ పై ఒంటరిగా నిద్రించే అలవాటు కలిగితే మీకు అలాగే మీ చిన్నారికి మధ్యనున్న సాన్నిహిత్యం దెబ్బతింటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పగటి పూట వారితో ఎక్కువ సమయం గడిపేలా ప్రణాళిక వేసుకోండి. అదే సమయంలో, చిన్నారి ఎదుగుదల దశలో విడిగా నిద్రించడం అవసరమన్న విషయాన్ని గుర్తించండి.

భార్యభర్తల బాంధవ్యం మెరుగవుతుంది

భార్యభర్తల బాంధవ్యం మెరుగవుతుంది

తల్లిదండ్రులతో పాటే చిన్నారి అదే బెడ్ పై నిద్రిస్తే తల్లిదండ్రులకు ప్రయివేట్ సమయం దొరకదు. అందువలన, చిన్నారికి విడిగా నిద్రించే అలవాటును చేయడం ద్వారా భార్యాభర్తలు ఒకరితో ఒకరు సాన్నిహిత్యంగా ఉండే అవకాశం లభిస్తుంది. తద్వారా వారి బాంధవ్యం మెరుగవుతుంది. చిన్నారికి అయిదు నుంచి ఆరు నెలలు వచ్చేసరికి వారికి కేటాయించిన బెడ్ పై వారు నిద్రించే ఏర్పాటు చేయాలి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, చిన్నారులకు విడిగా నిద్రించే అలవాటు చేయడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకి మీరు బాటలు వేసిన వారవుతారు. వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారికి స్వతంత్రంగా ఆలోచించడం అలవాటవుతుంది.

పిల్లలు విడిగా తమ బెడ్ లో పడుకోవడం వలన అనేక ప్రయోజనాలు అలాగే అసౌకర్యాలు కూడా కలవు. మీ చిన్నారిని విడిగా నిద్రపుచ్చాలి అనే నిర్ణయాన్ని తీసుకునే ముందు వీటిని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయండి. వారికి ఒంటరిగా నిద్రించే అలవాటును కల్పించే ముందు వారి వయసును కూడా దృష్టిలో పెట్టుకోవడం మంచిది.

చిన్నారి విడిగా తన బెడ్ పై ఎందుకు నిద్రించాలి ఈ కారణాల ద్వారా తెలుసుకోవచ్చు...

English summary

Why babies should sleep in their own bed

This is a matter of debate where all have different opinions. But, the best solution for this depends on what works out best for the parents and the kids. There are different options that one can try out – either have the child sleep with the parents or use a cradle near the parent’s bed or use a separate room for the child.