For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల వంధ్యత్వాన్నినయం చేయటానికి వెజిటేబుల్స్

By Lakshmi Perumalla
|

పురుషుల వంధ్యత్వానికి పట్టణ యువతలో పెరుగుతున్న ధోరణి,కొంత మనుగడ నిర్లక్ష్యంగా ఉండుట, ఒత్తిడితో కూడిన అనారోగ్య జీవనశైలి మొదలైనవి కారణాలుగా ఉన్నాయి. సంతానోత్పత్తి విషయానికి వస్తే పురుషులకు అనారోగ్య జీవనశైలి అనేది మరింత కష్టాలను పెంచుతుంది. అక్రమ ఆహారం మరియు అనియత పనిగంటల వలన ఒత్తిడి చేరి వారి మొత్తం ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావం ఉంటుంది. ఈ పోటీ వాతావరణంలో చాలా మంది పురుషులు నేరుగా భాగస్వామితో వారి సంతానోత్పత్తి మరియు ప్రదర్శన ప్రభావితం చేసే ప్రాథమిక ఆరోగ్యంను విస్మరిస్తున్నారు.

వంధ్యత్వంను ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు సమతులాహారం తీసుకోవడము ద్వారా నివారించవచ్చు. రెగ్యులర్ గా శారీరక వ్యాయామం చేయుట వలన మీ జీవితం మరియు ఆరోగ్యం మీద సానుకూల ప్రభావం ఉంటుంది. అంతేకాక జీవక్రియను పెంచేందుకు తోడ్పడుతుంది. వంధ్యత్వం అనేది ఎక్కువగా ధూమపానం అలవాట్ల వలన కలుగుతుంది. ధూమపానం కారణంగా నపుంసకత్వం మరియు పనితీరు ఆందోళన కలిగిస్తుంది. అతిగా మద్యపానం సేవించినా కూడా వంధ్యత్వం వస్తుంది. కొన్నిసార్లు అనారోగ్యకరమైన ఆహారం వల్ల స్పెర్మ్ మరియు దాని నాణ్యతపై ప్రభావం ఉంటుంది.

జింక్ వంటి మినరల్స్ మరియు విటమిన్ C సమృద్ధిగా ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం ద్వారా సంతానోత్పత్తి మరియు పనితీరు పెరుగుతుంది. నాణ్యత గల స్పెర్మ్ ఉత్పత్తికి మరియు వీర్యకణాల సంఖ్య పెంచడానికి విటమిన్లు A,C మరియు E మరియు ఫోలిక్ ఆమ్లం సహాయపడతాయి. ఈ విటమిన్లు మరియు పోషకాలు ఆకుకూరలు,నారింజ,టొమాటోలు, బీన్స్ మొదలగున వాటిలో పుష్కలంగా ఉంటాయి. ఈ వేజ్జిస్ ఎప్పటికప్పుడు ఒక భారీ స్థాయిలో వంధ్యత్వానికి తగ్గించటానికి మంచి పరిమాణంలో సహాయపడతాయి.

ఆకు పచ్చని ఆకుకూరలు

ఆకు పచ్చని ఆకుకూరలు

ఆకు పచ్చని ఆకుకూరలను మీ మంచి ఆరోగ్యం కోసం అవసరమైన పోషకాలు, విటమిన్లు మరియు ఖనిజాలతో నిండిపోయిన పోషక పవర్ హౌస్ అని చెప్పవచ్చు. కాలే,స్విస్ చార్డ్,పాలకూర,ఆవ ఆకులు మొదలైన ఆకు పచ్చని ఆకుకూరలలో సంతానోత్పత్తి మరియు వీర్యం నాణ్యత పెంచడానికి అవసరమైన పోషకాలు సమృద్దిగా ఉన్నాయి.

క్యారెట్లు

క్యారెట్లు

క్యారెట్లు దృష్టి కోసం మాత్రమే కాకుండా,వీర్యం నాణ్యతను పెంచడం ద్వారా పురుషుల్లో సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. హార్వర్డ్ ప్రజా ఆరోగ్య విశ్వవిద్యాలయం స్కూల్ పరిశోధకులు క్యారెట్లు తీసుకోవటం వలన గుడ్డు వైపుకు వీర్యకణాలు ఈత కొట్టే సామర్థ్యంపై గొప్ప ప్రభావాన్ని కనుగొన్నారు.

ఆరెంజ్స్

ఆరెంజ్స్

బ్రైట్ రంగు కూరగాయలు మరియు పండ్లు చాలా ఆరోగ్యకరమైనవి మరియు పురుషుని సంతానోత్పత్తిని పెంచేందుకు ఉపయోగకరంగా ఉంటాయి. ప్రతి రంగు పండు లేదా కూరగాయలు ఒక నిర్దిష్ట ఆరోగ్య ప్రయోజనం కలిగి ఉంటాయి. అలాగే సంతానోత్పత్తి మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఆరెంజ్స్ లో సంతానోత్పత్తి పనితీరు మెరుగుపరిచటానికి యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి.

తృణధాన్యాలు

తృణధాన్యాలు

వైట్ రొట్టెలు లేదా వైట్ రైస్ వంటి వాటికీ బదులుగా తృణధాన్యాలను ఎంచుకోవడం ద్వారా మీ రక్తంలో చక్కెర మరియు మీ శరీరంలో ఇన్సులిన్ స్థాయిల మీద సానుకూల ప్రభావం ఉంటుంది.మీ ఇన్సులిన్ పనితీరు సరిగా ఉంటే,మీ హార్మోన్ స్థాయిలు సమతుల్యంగా ఉండడానికి అవకాశం ఉంది. అప్పుడు అది మీ సంతానోత్పత్తి మెరుగుదలకు సహాయపడుతుంది.

అవెకాడో మరియు బాదం

అవెకాడో మరియు బాదం

దీర్ఘకాలంలో మీకు సహాయం చేయటానికి మీ భోజనంలో అవకాడొలు మరియు బాదంలను జోడించండి. నిజానికి ఈ ఆహారాలలో కనిపించే కొవ్వులు మంచి కొవ్వులు,ట్రాన్స్ క్రొవ్వులు లేదా సంతృప్త కొవ్వులు వలె కాకుండా ఈ కొవ్వులు మోనోఅన్శాచ్యురేటెడ్ గా ఉంటాయి. అవి మీ శరీరంలో ఇన్సులిన్ స్థాయిల మీద సానుకూల ప్రభావం,తద్వారా హార్మోన్లు సంతులనం మరియు సంతానోత్పత్తి అవకాశాలను మెరుగుపరుస్తుంది.

బీన్స్ మరియు పాలకూర

బీన్స్ మరియు పాలకూర

బీన్స్ మరియు పాలకూరలో సంతానోత్పత్తికి అవసరమైన సహజ ఫోలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. పురుషుల వీర్యకణాలు మరియు సాంద్రత పెంచడానికి ఫోలిక్ ఆమ్లం అవసరం. ఫోలేట్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన ఫోలిక్ ఆమ్లం సహజ రూపంలో అందుతుంది.

మొలకెత్తిన కూరగాయలు మరియు చిక్కుళ్ళు

మొలకెత్తిన కూరగాయలు మరియు చిక్కుళ్ళు

పచ్చి కూరగాయలు మరియు మొలకెత్తిన పప్పుదినుసులలో 100 రెట్లు ఎంజైములు కలిగి ఉంటాయని అంచనా. వాటిలో సంతానోత్పత్తిని పెంచటానికి అవసరమైన యాంటియాక్సిడెంట్స్ మరియు ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది.

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీ ఒక రుచికరమైన పండ్లు. అలాగే విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. అంతేకాక పురుషుల్లో సంతానోత్పత్తి పెంచటానికి ఆవశ్యకమైనది. కొన్ని అధ్యయనాల ప్రకారం పురుషులలో సంతానోత్పత్తి మెరుగుపరచటానికి రోజుకు కనీసం 90mg విటమిన్ సి అవసరమని తెలిసింది.

Story first published: Friday, December 13, 2013, 11:56 [IST]
Desktop Bottom Promotion