For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నన్సీకి ముందు ఆడవాళ్లు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ??

By Swathi
|

మీరు బేబీ కోసం ప్లాన్ చేస్తున్నారా ? వన్ ఇయర్ లో బుజ్జి పాపాయికి తల్లి కావాలని భావిస్తున్నారా ? అయితే.. మీ అలవాట్లలో ఖచ్చితంగా మార్పులు తీసుకురావాలి. కొన్ని రకాల హెల్త్ ఛేంజెస్ తో హెల్తీ ప్రెగ్నెన్సీ పొందవచ్చు. ప్రెగ్నెన్సీకి 6 నెలల ముందు మీ సిస్టమ్ ని అంతా క్లీన్ చేసుకుని, హెల్తీగా మార్చుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు.

బన్ తయారు కావాలంటే.. ఓవెన్ రెడీగా ఉండాలి అన్న సామెత విన్నారా ? అంటే.. ఓవెన్ హీట్ అయినప్పుడే.. బన్ తయారవుతుంది అని అర్థం. అలాగే.. మహిళ శరీరం హెల్తీగా, పూర్తీగా రెడీ అయినప్పుడు బిడ్డను కనడం, హెల్తీ ప్రెగ్నన్సీ పొందడం సాధ్యమవుతుందని వివరిస్తుంది.

అలాగే మహిళ ఆరోగ్యంగా ఉండటం చాలా కష్టమైన పని. ముఖ్యంగా గర్భం పొందడానికి ముందు, పొందిన తర్వాత.. బిడ్డకు జన్మనిచ్చే వరకు.. ఆమె ఆరోగ్యం ఛాలెంజింగ్ గా ఉంటుంది. రకరకాల మార్పులను తట్టుకునే శక్తిని కలిగి ఉండాలి. కనీసం గర్భం పొందడానికి కూడా ఆమె శరీరం చాలా ఆరోగ్యంగా ఉండటం అవసరం.

అన్ హెల్తీ లైఫ్ స్టైల్ కారణంగా.. ఇటీవల మహిళల్లో ఇన్ఫెర్టిలిటీ సమస్య పెరిగింది. కాబట్టి.. మానసికంగా, శారీరకంగా.. ప్రెగ్నెన్సీకి ముందు మహిళలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రెగ్నెన్సీ బాధ్యతకు సిద్ధంగా ఉండాలి. అలాగే శరీరాన్ని కూడా ప్రెగ్నన్సీకి ముందు స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేయాలి. అందుకే.. ప్రెగ్నన్సీకి ముందు మహిళలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూద్దాం..

హెల్తీ డైట్

హెల్తీ డైట్

అన్ హెల్తీ ఫుడ్ లో ఎక్కువ ఫ్యాట్, షుగర్ ఉంటాయి. ఇవి ఇన్ఫెర్టిలిటీ ఛాన్సెస్ పెంచుతాయి. కాబట్టి.. పోషకాహారం తినడానికి ప్రయత్నించాలి. కెమికల్స్ లేని ఆర్గానిక్ ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయాలి.

కోలన్ క్లెన్సింగ్

కోలన్ క్లెన్సింగ్

పేగులు శుభ్రంగా, హెల్తీగా ఉండటం చాలా అవసరం. బేబీ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు.. ప్రొబయోటిక్ ఫుడ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. వాటితో పాటు వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి.

ఫోలిక్ యాసిడ్

ఫోలిక్ యాసిడ్

ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ని డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం మొదలుపెట్టాలి. కన్సీవ్ అవడానికి ముందే.. వీటిని వాడటం వల్ల.. హెల్తీ ప్రెగ్నన్సీ పొందడం సాధ్యం అవుతుంది.

యోగా

యోగా

కొన్ని రకాల యోగా భంగిమలు హెల్తీ ప్రెగ్నన్సీకి సహాయపడతాయి. డబుల్ పీజియన్, బటర్ ఫ్లై, హిప్ సర్క్యులేషన్ వంటి యోగాసనాలవల్ల రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కి రక్త ప్రసరణ బాగా అందుతుంది. దీనివల్ల ఫెర్టిలిటీ రేట్ మెరుగుపడుతుంది.

ఒత్తిడి లేకుండా

ఒత్తిడి లేకుండా

ఒత్తిడి అనేది ఇన్ఫెర్టిలిటీకి ముఖ్య కారణం. అబార్షన్లకు కూడా ఒత్తిడి కారణమవుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒత్తిడి లేకుండా గడపండి. దీనికోసం ధ్యానం చేస్తూ ఉండాలి. అలాగే పాజిటివ్ గా ఉండాలి.

ఆక్యుపంక్చర్ ప్రయత్నించండి

ఆక్యుపంక్చర్ ప్రయత్నించండి

రెగ్యులర్ గా ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండటం వల్ల కన్సీవ్ అయ్యే ఛాన్స్ లు పెరుగుతాయి. అలాగే.. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సెక్స్

సెక్స్

ఫెర్టిలిటీకి అవసరమయ్యే హార్మోన్స్ సెక్స్ కారణంగా రిలీజ్ అవుతాయి. కాబట్టి సెక్స్ లో పాల్గొనడం మరిచిపోకండి. కన్సీవ్ అవడానికి ఇది మొదటి స్టెప్.

వెయిట్

వెయిట్

కన్సీవ్ అవడానికి ముందు అధిక బరువు, తక్కువ బరువు రెండూ ప్రాబ్లమే. కాబట్టి.. మీ హైట్ కి తగ్గట్టు ఎంత వెయిట్ ఉండాలో ఒకసారి డాక్టర్ ని సంప్రదించి తెలుసుకుని.. అదే బరువు మెయింటేన్ చేయడం చాలా అవసరం.

ఫిట్

ఫిట్

ఒకవేళ మీరు ఉండాల్సినంత బరువే ఉన్నప్పటికీ.. ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. ప్రెగ్నెన్సీలో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. కాబట్టి మీ శరీరం చాలా హెల్తీగా, ఫిట్ గా ఉండాలి.

కాఫీ

కాఫీ

ప్రెగ్నెన్సీకి ముందు, ప్రెగ్నెన్సీ సమయంలో.. కాఫీ చాలా సీరియస్ ఎఫెక్ట్ తీసుకొస్తుంది. హెల్తీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకునేవాళ్లు.. లిమిట్ గా కాఫీ తీసుకోవడం చాలా మంచిది. సోడాలకు కూడా దూరంగా ఉండటం చాలా అవసరం.

స్మోకింగ్, డ్రింకింగ్

స్మోకింగ్, డ్రింకింగ్

ప్రెగ్నెన్సీకి ముందు స్మోకింగ్, డ్రింకింగ్ చేసే ఆడవాళ్లకు కన్సీవ్ అవడానికి 20 శాతం తక్కువ ఛాన్స్ ఉంటుంది.

డాక్టర్ సలహా

డాక్టర్ సలహా

ప్రెగ్నెన్సీకి ముందు.. కపుల్స్ ముందుగా డాక్టర్ ని సంప్రదించాలి. తమ హెల్త్ కండీషన్ ఎలా ఉంది.. ఎలాంటి మార్పులు అవసరమని తెలుసుకోవడం చాలా అవసరం.

English summary

How To Prepare Your Body For Pregnancy?

How To Prepare Your Body For Pregnancy? Well, you may have heard of the popular saying about getting pregnant, "the bun in the oven".
Story first published:Friday, July 22, 2016, 15:47 [IST]
Desktop Bottom Promotion