Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఆహారం తినాలంటే అల్లరి చేస్తున్నారా?

1. పిల్లలు సరిగ్గా తినాలంటే, తల్లులు ముందస్తుగా వారి ధ్యాసను పక్కకు మరల్చాలి. బేబీకి ఇష్టమైన బొమ్మలు మీరు లేదా ఇంట్లోని ఇతర సభ్యులు చూపిస్తూ తినిపించేయండి. లేదా ఇంట్లోని టి.వి. లో ప్రోగ్రాములు చూపిస్తూ తినిపించండి. ఈ రకంగా పిల్లవాడు ఆహారం తినే సమస్యలను అధిగమించవచ్చు.
2. బేబీ ఆహారం సరిగా తీసుకోవడం లేదని లేదా తినకూడనివి తినేస్తున్నాడని మొదలైన ఫిర్యాదులను అతని ముందర ఇతరులకు చెప్పకండి. అలా చెపితే వారు అదే పని మరోమారు కావాలనే చేస్తారు.
3. మీరు చెప్పిన మాటను పిల్లలు వింటే, వారిని మెచ్చుకోండి. మీరు మెచ్చుకున్న పనులను వారు చేస్తారు. అది మంచిది కూడాను. ఇదే అంశాన్ని ఆహారం తినే విషయంలో కూడా పాటించండి. తినేటపుడు ఆహారాన్ని చిందరవందర చేసినా తింటూ వుంటే మంచిదే. ఏమీ అనకండి. బేబీ ఆనందిస్తూనే ఆహారాన్ని తినటాన్ని గమనించండి.
4. బేబీ చక్కగా ఆహారాన్ని తినేలా సహాయం చేయండి. టేబుల్ పై ప్లేట్లు పెట్టేటపుడే బేబీ ఆహారం పెట్టే సమయమని భావించేలా చేయాలి. ఇక ఆపై... క్రమేణా ఆహారం తీసుకోవాలంటే, చేతులు పరిశుభ్రంగా కడగాలని, చెంచా తీసుకుని దానితో కిందపడకుండా తినాలని మొదలగు అలవాట్లను నేర్పించండి.
5. పిల్లవాడు సరిగా భుజించిన తర్వాత 'ఇక చాలు" అంటే తిన్న స్ధలంనుండి పంపించేయండి. అయితే, పిల్లవాడు కనుక ఏదైనా తినవచ్చు అని భావించి ప్రధాన ఆహారాన్నినిరాకరించి జంక్ ఫుడ్ కోరితే అనుమతించకండి. భోజన సమయంలో సంపూర్ణ భోజనం చేయాలనే నియమాన్ని బిడ్డకు వివరించండి.



Click it and Unblock the Notifications
