For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి తల్లీ తన కొడుకుకి ఖచ్చితంగా నేర్పించాల్సిన విషయాలు..!!

By Swathi
|

పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అయ్యే కొద్దీ.. ఆడపిల్లలు తల్లి దగ్గర క్లోజ్ గా ఉంటారని, అబ్బాయిలు తండ్రులకు దగ్గరవుతారని.. భావిస్తారు. చాలామంది ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తారు. కానీ..అబ్బాయిలు తండ్రి అలవాట్లను, అభిప్రాయాలను అనుసరించినా.. తల్లి చెప్పే మాటలనే ఎక్కువగా వింటారట.

పిల్లల పెంపకం బాధ్యత ఎక్కువగా తల్లికే ఉంటుంది. అందుకే.. వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పిల్లలు. పెరిగే అబ్బాయిలు, పెరిగే అమ్మాయిలు.. కాస్త భిన్నంగా ఉంటారు. ఆలోచనలు, పద్ధతి, ఆభిప్రాయాలు, ప్రవర్తన అబ్బాయిలకు, అబ్బాయిలకు తేడాగా ఉంటుంది.

చాలామంది అబ్బాయిలు 5 ఏళ్ల నుంచే.. చాలా మొండిగా, చెప్పినమాట వినకుండా ప్రవర్తిస్తారు. చాలా యాక్టివ్ గా ఉంటారు. కాబట్టి కొడుకుల తల్లులు ఖచ్చితంగా.. వాళ్లకు కొన్ని అలవాట్లు నేర్పించాలి. పెరిగే మగపిల్లలకు ఖచ్చితంగా.. కొన్ని విషయాలు నేర్పించాలి. జెండర్, ఏజ్ ముఖ్యపాత్ర పోషిస్తాయి.

కాబట్టి తల్లిగా అబ్బాయిలకు 18 ఏళ్లు రాకముందే.. కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్పించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

వంటగది కేవలం అమ్మాయిలకే కాదు

వంటగది కేవలం అమ్మాయిలకే కాదు

ప్రతి తల్లి తన కొడుకుకి ఖచ్చితంగా అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ సమానమే నేర్పించాలి. దీనివల్ల వంట, ఇంటి పని.. కేవలం అమ్మాయిలకు మాత్రమే పరిమితం కాదని తెలపాలి.

కుకింగ్ స్కిల్స్

కుకింగ్ స్కిల్స్

మీ అబ్బాయి 12 ఏళ్లు దాటిన వెంటనే.. బేసిక్ కుకింగ్ స్కిల్స్ నేర్పించాలి. వంట చేయడం అనేది ప్రతి ఒక్కరికీ అవసరం కాబట్టి.. దానిపై అవగాహన పెంచాలి.

శారీరక హింస

శారీరక హింస

ఎలాంటి పరిస్థితిలోనైనా.. శారీరకంగా హింసించడం చాలా పెద్ద నేరమని.. తల్లి ఖచ్చితంగా కొడుకుకి నేర్పించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ.. హింసాత్మకంగా వ్యవహరించరాదని చెప్పాలి.

మహిళలను గౌరవించడం

మహిళలను గౌరవించడం

అమ్మాయిలను గౌవరించడం చాలా ముఖ్యమని.. ప్రతి తల్లీ తన కొడుకుకి నేర్పించాలి. మహిళలంటే గౌరవం ఉండాలని, మహిళలైనా, మగవాళ్లైనా సమానంగా విలువ ఇవ్వాలని వివరించాలి.

ఎమోషనల్ గా ఉండాలి

ఎమోషనల్ గా ఉండాలి

సాధారణంగా అబ్బాయిలు ఏడ్చినప్పుడు, ఎమోషనల్ గా ఫీలయినప్పుడు తల్లిదండ్రులు.. తిడుతూ ఉంటారు. అబ్బాయిలు ఇంత సెన్సిటివ్ గా ఉండకూడదు అని.. కానీ.. ఇది జీవితంలో మానసిక వ్యాధులకు కారణమవుతాయి. ఎమోషనల్ ఉన్నప్పుడు ఏడ్వడంలో తప్పు లేదని.. బాధను బయటపెట్టేయాలని చెప్పాలి.

దయ యొక్క ప్రాధాన్యత

దయ యొక్క ప్రాధాన్యత

చాలా సందర్భాల్లో అబ్బాయిలు.. చాలా దూకుడు స్వభావం కలిగి ఉంటారు. కానీ.. ఇతరుల పట్ల జాలి, దయ కలిగి ఉండటం ఎంత ముఖ్యమో వివరించాలి.

లైఫ్ స్కిల్స్

లైఫ్ స్కిల్స్

వంటచేయడంతో పాటు.. లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించాలి. వస్తువులతో ఎలా పనిచేయాలి, ఇంటి పనులు, ఫస్ట్ ఎయిడ్ వంటి విషయాల్లో కూడా వాళ్లకు అవగాహన ఉండాలని.. తల్లి కొడుకుకి ఖచ్చితంగా నేర్పించాలి.

English summary

7 Important Things Every Mother Should Teach Her Son, Before Age 18!

7 Important Things Every Mother Should Teach Her Son, Before Age 18! Many people are under the opinion that, as they grow up, sons become closer to their fathers and daughters relate to their mothers more.
Story first published:Friday, August 5, 2016, 11:24 [IST]
Desktop Bottom Promotion