For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణులు తీసుకునే అధిక కొవ్వు ఉన్న ఆహారం, వారి పిల్లలకు చాలా ప్రమాదం

|

తల్లులు గర్భిణులుగా ఉన్న సమయంలో అధికంగా కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల, పుట్టిన పిల్లల్లో ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక వ్యాధుల భారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. జంతు అధ్యయనములో కనుగొన్న ప్రకారం, ఆశతో ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వచ్చే హెల్త్ సమస్యలు తల్లులు లోనే కాకుండా, వారి పిల్లల మెదడుకి, ఎండోక్రైన్ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకుని, శాఖల వారీగా దీర్ఘకాల శాశ్వతమైన మానసిక మార్పులకు దారితీస్తుంది.

High-Fat Diet May Affect Kids' Mental Health

"అభివృద్ధి చెందిన దేశాల్లో, అధిక కొవ్వు ఆహారాన్ని తీసుకోవడం వల్ల తల్లి నుంచి స్థూలకాయం వంటివి వ్యాపించేవిగా ఉంటూ, తర్వాత తరాల వారికి మానసిక ఆరోగ్య సమస్యలు తప్పవని", US లోని ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యునివర్సిటీ (OHSU) అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన 'ఎలినార్ సుల్లివన్' తెలిపారు.

మరింత, అధిక కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గర్భం అభివృద్ధి చెందేటప్పుడు న్యూరాన్లు సంబంధించిన సెరోటోనిన్, దాని న్యూరోట్రాన్స్మిటర్ అభివృద్ధిలో బలహీనపడుతుంది.

High-Fat Diet May Affect Kids' Mental Health

మరోవైపు, ఒక చిన్నారికి చిన్న వయసులోనే ఒక ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం వల్ల దాని ప్రభావం విఫలమైంది పరిశోధకులు తెలిపారు.

"ఈ విషయంలో తల్లుల మీద నింద వెయ్యడం సరికాదని, అధిక కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఎదురయ్యే ప్రమాదాల గూర్చి గర్భిణీ స్త్రీలకు, వారి ఫ్యామిలీస్ కి ముందుగా తెలియజేస్తూ సపోర్టు ఇవ్వడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రజల జీవనశైలి మీద, వారి ఆరోగ్యం, ఆహారం వంటి విధానాల పై అవగాహన కల్పించాలని" సుల్లివన్ సూచించారు.

ఎండోక్రినాలజీ జర్నల్ ఫ్రాంటియర్స్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, అధికంగా కొవ్వు పదార్థాలు తీసుకున్న పూర్వీకులపై చేసిన ప్రయోగాల ఆధారంగా ఇప్పుడు ఉన్న జనాభా, డైట్ ని కంట్రోల్ చెయ్యడం దాదాపు అసాధ్యమని తెలిపారు.

High-Fat Diet May Affect Kids' Mental Health

జపనీస్ కు చెందిన 65 ఆడ మకాక్స్, ఒకరు ఆహారం నియంత్రణ ఉన్న వారి గాను,ఇంకొకరు అధిక కొవ్వు ఉన్న ఆహారం తీసుకునే వారిగా, ఇలా 2 భాగాలుగా పరిశోధకులు విడదీశారు.

High-Fat Diet May Affect Kids' Mental Health

ఇప్పుడు వాటి 135 సంతానం మధ్య పోలిస్తే, ఆడ - మగ అన్న తేడా లేకుండా అందరూ కూడా, వారి తల్లులు గర్భిణులుగా ఉన్న సమయంలో అధిక కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వారిలో ఆందోళన, డిప్రెషన్ వంటివి - ఆహారం నియంత్రణ ఉన్న వారి కన్నా చాలా ఎక్కువ ఉందని నిరూపించారు.

English summary

High-Fat Diet May Affect Kids' Mental Health

High-Fat Diet May Affect Kids' Mental Health,Babies whose mothers consumed a high-fat diet during their pregnancy may be at an increased risk of developing mental health disorders such as anxiety and depression, a study has warned.
Story first published:Friday, January 19, 2018, 16:27 [IST]
Desktop Bottom Promotion