For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెల్లుల్లి ఈ 9 రకాలుగా మీ పిల్లలకు ప్రయోజనకారిగా ఉంటుంది

|

తమ పిల్లలకు ఏ మాత్రం అస్వస్థత చేసినా చాలా మంది తల్లిదండ్రులు యాంటీ బయాటిక్స్ పై ఆధారపడతారు. యాంటీ బయాటిక్స్ ని ఎక్కువగా వాడటం మంచిది కాదని తెలిసినా తల్లిదండ్రులు తమ పిల్లల అస్వస్థతను నయం చేసేందుకు వాటిపైనే ఎక్కువగా ఆధారపడి పరోక్షంగా తమ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఎక్కువన్న సంగతి పెద్దలు మనకు చెప్తూనే ఉన్నారు. పిల్లల డైట్ లో వెల్లుల్లిని భాగం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.

ముఖ్యంగా, జలుబుతోనైనా లేకుంటే ఏదైనా శ్వాసకు సంబంధించిన సమస్యతోనైనా మీ చిన్నారి ఇబ్బంది పడుతూ ఉంటే మీరు వెల్లుల్లిని చిన్నారి డైట్ లో భాగం చేయడం తప్పనిసరి.

9 Ways How Garlic Benefits Your Kids

మెడిసినల్ హెర్బ్ గా వెల్లుల్లి పాత్ర

కొన్ని దశాబ్దాల క్రితం నుంచి వెల్లుల్లిని మెడిసినల్ వాల్యూస్ కలిగిన హెర్బ్ గా గుర్తిస్తున్నారు. వెల్లుల్లి సాగు 3000 ఏళ్ళ క్రితమే ప్రారంభమయింది. ఘాటైన వాసనకు అలాగే ప్రత్యేకమైన రుచికి వెల్లుల్లి అనేది ప్రాచుర్యం చెందింది. వెల్లుల్లి లో అలిసిన్ అనే కాంపౌండ్ లభ్యమవుతుంది. ఈ కాంపౌండ్ వలనే వెల్లుల్లి లో ఔషధ గుణాలు లభ్యమవుతున్నాయి. విపరీతమైన హెల్త్ బెనిఫిట్స్ అందించే వెల్లుల్లికి తప్పకుండా మీ చిన్నారి డైట్ లో స్థానం ఇవ్వాలి. పిల్లలకే కాదు పెద్దలకు కూడా వెల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

పిల్లలకు వెల్లుల్లిని అందించడం వలన కలిగే ప్రయోజనాలు

1. చెవి పోటును తగ్గిస్తుంది:

1. చెవి పోటును తగ్గిస్తుంది:

పిల్లలు సాధారణంగా చెవిపోటు సమస్యతో ఇబ్బందిపడుతూ ఉంటారు. వెల్లుల్లి సహజసిద్ధమైన యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఫంగల్ అలాగే యాంటీ వైరల్ ప్రాపర్టీలు కలవు. ఇవి చిన్నారులలో చెవి పోటు సమస్యను సమూలంగా తగ్గిస్తుంది. వెల్లుల్లి నూనెను ఆలివ్ నూనెతో కలిపి ఈ మిశ్రమాన్ని మీ చిన్నారి చెవిపోటును తగ్గించేందుకు వాడాలి. ఈ రెమెడీ ఇన్స్టెంట్ పెయిన్ రిలీవర్ గా పనిచేస్తుంది.

2. ఇంటస్టినల్ సమస్యలను తొలగిస్తుంది

2. ఇంటస్టినల్ సమస్యలను తొలగిస్తుంది

కొన్నిసార్లు పిల్లలు తీసుకునే ఆహారపదార్థాలపై మనకు కంట్రోల్ అంతంత మాత్రమే ఉంటుంది. వారు స్కూల్ లో చిరుతిండ్లు ఏం తింటున్నారో మనకు తెలియదు. కాబట్టి, కొన్ని రకాల ఆహారాల వలన వారికి స్టమక్ ఇన్ఫెక్షన్స్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. డీసెంట్రీ, డయారియా లేదా కొలిటీస్ వంటి డైజెస్టివ్ ప్రాబ్లెమ్స్ బారిన మీ చిన్నారులు పడితే వెల్లుల్లిని వారి డైట్ లో భాగంగా చేయండి.

వెల్లుల్లి అనే హెర్బ్ ఇంటస్టైన్ లో ఉండే హానికర బాక్టీరియాను నశింపచేస్తుంది. అంతేకాక, వెల్లుల్లి అనేది ఇంటస్టైన్ లో ఉండే ఉపయోగకర బాక్టీరియాపై ప్రతికూల ప్రభావం చూపదు. యాంటీ బయాటిక్స్ వాడితే ఉపయోగకర బాక్టీరియాపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. వెల్లుల్లి జ్యూస్ రూపంలో చిన్నారి డైట్ లో వెల్లుల్లిని జోడించడం ఉత్తమమైన మార్గం. ఇలా చేయడం ద్వారా, హానికర ఇంటెస్టినల్ వార్మ్స్ సమస్య నుంచి మీ పాపాయికి విముక్తి లభిస్తుంది.

3. హైపర్టెన్షన్ ను తగ్గిస్తుంది:

3. హైపర్టెన్షన్ ను తగ్గిస్తుంది:

చుట్టూ ఒత్తిళ్ల వలన చిన్నారులలో కూడా హైపర్టెన్షన్ సమస్య తలెత్తుతుంది. ఈ రోజుల్లో చిన్నారులలో కూడా హైపర్టెన్షన్ సమస్య అనేది సాధారణంగా మారింది. తల్లిదండ్రులుగా మీరు ఈ మల్టీ ఫంక్షనల్ హెర్బ్ ను మీ చిన్నారి డైట్ లో భాగంగా చేయాలి.

వెల్లుల్లిలో లభించే అలిసిన్ అనే కాంపౌండ్ హైపెర్టెన్షన్ వలన కలిగే ఇబ్బందులను తగ్గిస్తుంది. బ్లడ్ వెజిల్స్ ను ప్రశాంతపరుస్తుంది. పిల్లల్లో థ్రాంబోసిస్ కు గార్లిక్ అనేది అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. ప్లేటెలెట్స్ అగ్రిగేషన్ ను మినిమైజ్ చేసే సామర్థ్యం వెల్లుల్లిలో ఉండటం వలన ఇది సాధ్యపడుతుంది.

4. శ్వాసకోశ ఇబ్బందులను అరికడుతుంది:

4. శ్వాసకోశ ఇబ్బందులను అరికడుతుంది:

దగ్గూజలుబు పిల్లల్లో కనిపించే సాధారణ ఆరోగ్య సమస్య. పచ్చి వెల్లుల్లిని దగ్గూజలుబును తగ్గించేందుకు హోమ్ రెమెడీగా తీసుకుంటారు. జలుబుకు సంబంధించిన లక్షణాలను మీ చిన్నారితో మీరు గ్రహిస్తే కాస్త క్రష్ చేసిన తాజా వెల్లుల్లి రెబ్బలను వారికి అందించండి. జలుబు, దగ్గు లక్షణాలను తగ్గించేందుకు వెల్లుల్లి తోడ్పడుతుంది. కాబట్టి, మీ చిన్నారికి తక్షణ ఉపశమనం అందుతుంది.

5. ఐ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది:

5. ఐ ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది:

పిల్లల్లో ఐ ఇన్ఫెక్షన్స్ సమస్య సాధారణం. పిల్లలు ఆడుకునేటప్పుడు వివిధ రకాల కీటకాల బారిన పడతారు. అందువలన, స్వెల్లింగ్, రెడ్ నెస్ అలాగే జెనెరల్ ఇన్ఫెక్షన్స్ వలన కళ్ళు ఇబ్బంది పడతాయి. వెల్లుల్లిని వాడటం వలన ఈ సమస్యను అధిగమించవచ్చు.

వెల్లుల్లిలో విటమిన్ సి, సెలీనియం అలాగే క్వర్సెటైన్ అనే పోషకాలు కలవు. అయినా, వెల్లుల్లిని నేరుగా వాడే ముందు మీ వైద్యుల సలహాను తీసుకోండి. తద్వారా ఐ ఇన్ఫెక్షన్ ను తగ్గించుకోవటానికి వెల్లుల్లిని వాడే విధానాన్ని తెలుసుకోగలుగుతారు.

6. స్కిన్ రాషెస్ ని తగ్గిస్తుంది:

6. స్కిన్ రాషెస్ ని తగ్గిస్తుంది:

వెల్లుల్లి స్కిన్ క్లీన్సర్ లా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీలు కలవు. వెల్లుల్లి వలన స్కిన్ రాషెస్ సమస్య పిల్లలను వేధించదు.

7. ఆస్త్మాను అరికడుతుంది:

7. ఆస్త్మాను అరికడుతుంది:

ఈ రోజుల్లో ఆస్త్మాతో ఇబ్బంది పడే చిన్నారుల సంఖ్య పెరుగుతూ ఉండటాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. ఉడికించిన వెల్లుల్లి అనేది పిల్లల్లో ఆస్త్మాను తగ్గించేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. పిల్లలు నిద్రపోయే ముందు గ్లాసుడు పాలలో ఉడికించిన మూడు వెల్లుల్లి రెబ్బలను జోడించి వారికివ్వాలి. ఈ పద్దతిని పాటిస్తే వారిలో ఆస్త్మా ఎటాక్స్ తగ్గుముఖం పడతాయి.

8. డైజెషన్ ను ప్రమోట్ చేస్తుంది:

8. డైజెషన్ ను ప్రమోట్ చేస్తుంది:

వెల్లుల్లిని మీ చిన్నారి డైట్ లో భాగంగా చేయడం ద్వారా డైజెస్టివ్ సమస్యలను పూర్తిగా నిర్మూలించగలుగుతారు. ప్రతి రోజూ వారికి వెల్లుల్లిని తప్పనిసరిగా అందివ్వాలి. వెల్లుల్లి అనేది పెద్ద మరియు చిన్న ప్రేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. గ్యాస్ట్రిక్ కెనాల్ ఇంఫ్లేమేషన్ ని కూడా వెల్లుల్లిని తగిన మోతాదులో గ్రహించడం ద్వారా అరికట్టవచ్చు.

9. ఇన్ఫెక్టెడ్ ఊండ్స్ ని తగ్గిస్తుంది:

9. ఇన్ఫెక్టెడ్ ఊండ్స్ ని తగ్గిస్తుంది:

వెల్లుల్లిలో యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీలు కలవు. పిల్లల్లో సాధారణంగా ఎదురయ్యే ఇన్ఫెక్టెడ్ ఊండ్స్ సమస్యను నిర్మూలించడంలో వెల్లుల్లి ఉపయోగకరంగా ఉంటుంది. వీటికి చికిత్సని అందించకపోతే తీవ్రమైన హెల్త్ ఇష్యూస్ తలెత్తే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్టెడ్ ఊండ్ పై డైల్యూట్ చేయబడిన వెల్లుల్లి రసాన్ని అద్దితే ఊండ్ పై ఉండే హానికర బాక్టీరియా అనేది నశింపబడుతుంది.

అయితే, వెల్లుల్లి రుచిని అలాగే వాసనని మీ చిన్నారి ఇష్టపడకపోవటం సహజమే. ఇందులో నున్న అనేక హెల్త్ బెనిఫిట్స్ ను దృష్టిలో పెట్టుకుని మీరు వెల్లుల్లిని రుచికరమైన డిషెస్ లో వాడి చిన్నారికి అందేలా శ్రద్ధ పెట్టండి. తద్వారా, వెల్లుల్లి వలన అనేక ఆరోగ్యప్రయోజనాలను చిన్నారి పొందగలుగుతుంది.

English summary

9 Ways How Garlic Benefits Your Kids

Of late parents prefer to give their children with herbs and ayurvedic medicines than English medicines, as most of the ingredients that are used in ayurveda are natural ingredients that generally do not cause any side effects. One such ingredient is garlic. Garlic cures ear pain, intestinal problems, and promotes digestion in kids.
Story first published: Monday, April 16, 2018, 13:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more