For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్ లైన్ లో మీ పిల్లల ఫోటోలు వాడబడే గగుర్పొడిచే విధానాలు

మీరేదన్నా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ఉన్నట్లయితే, అందులో చేసే పనుల్లో ఎక్కువ మరియు పెద్దది ఫోటోలను షేర్ చేయటం. మీరు మీ మిత్రులు వారి అందమైన పాపాయిల ఫోటోలను షేర్ చేయటం చూసే ఉంటారు.ఈ సైట్ల ద్వారా మీరు క

By Deepthi T A S
|

ఇంటర్నెట్ మరియు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల వాడకం పెరిగిపోయిన ఈ కాలంలో, జీవితం చాలా వరకు సులువు మరియు సురక్షితం అయిపోయింది. చాలా సందర్భాల్లో ఆత్మహత్యలు సరైన సమయంలో నివారించబడ్డాయి, నేరాలు బయటపడ్డాయి మరియు అదృశ్యమైన మనుషులు దొరికారు, ఇవన్నీ ఇంటర్నెట్ వలన జరిగాయి.

ఈ కొన్ని కేసులే కాదు, చాలా రకాలుగా ఇంటర్నెట్ మరియు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు మనల్ని అనేక సమస్యల నుంచి బయటపడేసాయి. కానీ అదే తప్పు వ్యక్తి చేతిలో పడితే, ఊహించలేని భయంకర ఫలితాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీరేదన్నా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో ఉన్నట్లయితే, అందులో చేసే పనుల్లో ఎక్కువ మరియు పెద్దది ఫోటోలను షేర్ చేయటం. మీరు మీ మిత్రులు వారి అందమైన పాపాయిల ఫోటోలను షేర్ చేయటం చూసే ఉంటారు.

different ways that your child's photos can be used online

ఈ సైట్ల ద్వారా మీరు కూడా మీ బేబీ ఫోటోలను మీ కుటుంబానికి, స్నేహితులతో పంచుకోవటం ఇష్టపడతారు కదా! కానీ ఈ రకంగా మీ బేబీని గొప్పగా చూపించుకోటం మీ బిడ్డని అపాయకర ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్లు అవుతుందని మీకు తెలుసా?

తల్లి లేదా తండ్రిగా మీ బిడ్డను సురక్షితంగా ఉంచటం మీ మొదటి మరియు ముఖ్య బాధ్యత. మీ బిడ్డ ఫోటోలను ఆన్ లైన్ లో షేర్ చేయటం వలన మీరు మీ బిడ్డని డిజిటల్ కిడ్నాపింగ్, అసభ్యతకి, హింస మరియు ఇంకా చెప్పాలంటే పిల్లల పోర్నోగ్రఫీ అవకాశాల బారిన పడేస్తున్నారు.

ఈరోజు, మనం ఆన్ లైన్ లో మీరు షేర్ చేసే అమాయకమైన ఫోటోలను వెధవ మనస్తత్వం ఉన్నవారు ఎలా వాడుకుంటారో తెలుసుకుండాం. అలాగే మీరు ఏ రకం ఫోటోలు అస్సలు పెట్టకూడదో, పెట్టినవి కూడా తప్పు చేతుల్లోకి వెళ్ళకుండా ఎలా సురక్షితం చేయాలో నేర్చుకుందాం.

మీ బిడ్డ ఫోటోలు తప్పుగా వాడుకోబడే విధానాలు

డిజిటల్ అపహరణ లేదా ఆన్ లైన్ రోల్ ప్లేయింగ్

డిజిటల్ అపహరణ లేదా ఆన్ లైన్ రోల్ ప్లేయింగ్

ఇంటర్నెట్ ను ఎప్పుడూ సాధారణ లేదా రోజువారీ నిజప్రపంచం నుంచి దూరంగా పారిపోయే ఒక ప్రదేశంగా భావిస్తారు. చాలామందికి నిజజీవిత సమస్యల నుంచి ఇంటర్నెట్ ఉపశమనం అందిస్తుంది. కానీ కొంతమంది మానసిక స్థితి సరిగాలేని వారు నిజ జీవితంలో దొరకని అండ మరియు ప్రేమను ఇంటర్నెట్ లో పొందటానికి నకిలీ జీవితం, కుటుంబం, కథలు అన్నీ సృష్టించుకుంటారు. కొంతమంది ఇలా కేవలం నవ్వుకోటానికి చేస్తారు.

ఇలాంటివారే మీ బేబీల ఫోటోలను దొంగిలించి, వారి పిల్లలలాగా చూపించుకుంటారు. మీ బేబీకి శారీరకంగా ఏ కష్టం కలగదు కానీ, ప్రపంచంలో ఎక్కడో ఇంకోవైపు ఉన్నవారు ఇంత సులభంగా మీ పాపాయి ఫోటోలను వాడుకోగలుగుతున్నారనే ఆలోచనే కనీసం మీకు కష్టం కలిగిస్తుంది.

ఛిన్నపిల్లల పోర్నోగ్రఫీ

ఛిన్నపిల్లల పోర్నోగ్రఫీ

మీరు మీ కుటుంబం, స్నేహితులు చూసి, పాపాయి ఎంత ముద్దుగా ఉందో అనుకోవాలని బేబీ యొక్క చాలా అమాయకమైన ఫోటో ఆన్ లైన్లో పెడతారు. కానీ ఈ ఫోటో, ఫోటోషాప్ చేసి, చిన్నపిల్లలతో సెక్స్ గురించి ఆలోచించే ఉన్మాదుల చేతుల్లో పడవచ్చు. ఫోటో షాప్ చేయకపోయినా ఈ ఫోటోలను తప్పుడు రాతలతోపాటుగా కలిపి, అలాంటి చిన్నపిల్లల పోర్నోగ్రఫీకి చెందిన సైట్లలో షేర్ చేయబడవచ్చు.

ప్రకటనలు

ప్రకటనలు

ప్రకటనల్లో వచ్చే అందమైన, బొద్దుగా, ముద్దుగా ఉండే పసిపిల్లలంటే మనందరికీ ఇష్టమే కదా? ఇలాంటి వారి ఫోటోలు తీయడమో, లేదా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లనుంచి దొంగిలించటమో, అది కూడా తల్లిదండ్రుల సమ్మతి లేకుండా, ఎలా ఉంటుంది? భయం వేసే ఆలోచనే అయినా నిజం అదే.

ఇంటర్నెట్ నుంచి పిల్లల ఫోటోలను తీసుకుని ప్రకటనల కోసం వాడుకునే ప్రబుద్ధులు చాలామందే ఆన్ లైన్లో ఉన్నారు. వారు ప్రపంచంలో ఎక్కడో దూరంగా నివసిస్తున్న బేబీ ఫోటోను తీసుకుంటారు. వారు ఆ ఫోటోలను వార్తాపత్రికల్లో, మరో దేశంలో హోర్డింగ్ లపై కూడా వాడుకుంటారు, తల్లిదండ్రులకి ఎన్నటికీ ఆ విషయం కూడా తెలీదు.

నకిలీ ఫ్రొఫైల్స్ సృష్టించడం

నకిలీ ఫ్రొఫైల్స్ సృష్టించడం

ఏ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ తీసుకున్నా వందలాది నకిలీ ప్రొఫైల్స్ ఉంటాయి. అవి ఎందుకున్నాయో కారణాలు ఒక్కో ప్రొఫైల్ కి మారుతుండవచ్చు కానీ వీరు ఫోటోలను దొంగిలించి తమ ప్రొఫైల్ చిత్రాలుగా పెట్టుకోవటమో లేదా, వారి వాల్ పై పోస్ట్ చేసుకోటమో చేస్తారు. మీ బిడ్డ ఫోటో కూడా మనం ఇప్పుడు మాట్లాడుతుండగానే ఎవరో నకిలీ ఫ్రొఫైల్ కి ఫ్రొఫైల్ చిత్రంగా మారి ఉండవచ్చు.

మెమ్ లు

మెమ్ లు

మీరు మీ బిడ్డ ఫోటో ఏదో హాస్యకరంగా, ఫన్నీగా ఉందని పోస్ట్ చేస్తారు. కానీ మీకు తెలుసా ఈ చిత్రం సులభంగా మెమ్ లా మారిపోయి ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుందని? ఒకసారి అది వైరల్ అయ్యాక, ఇంక ఎవరూ ఆపలేరు. దాన్ని చాలామంది యూజర్లు చాలాసార్లు షేర్ చేస్తారు, దీనివల్ల మీరు పూర్తిగా ఇంటర్నెట్ నుంచి దాన్ని ఎప్పటికీ తీయలేరు. మీ అనుమతి లేకుండా మీ చిత్రాన్నే మెమ్ లాగా మార్చటం మీ వ్యక్తిగత విషయాల్లోకి, హక్కుల్లోకి చొరబడే పెద్ద తప్పు అవుతుంది.

మీ బేబీ ఫోటోలను తప్పుగా వాడుకోకుండా చేయటానికి మీరు సురక్షితంగా ఏం చేయగలరు?

ఫోటోలను ప్రైవేట్ గా ఉంచే ఆప్షన్ ను ఎంచుకోండి

ఫోటోలను ప్రైవేట్ గా ఉంచే ఆప్షన్ ను ఎంచుకోండి

మీ లేదా మీ బిడ్డ ఫోటోలను మీరు తరచుగా ఆన్ లైన్ లో పోస్ట్ చేసేవారైతే, మీ ప్రొఫైల్ ప్రయివేట్ గా తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ఇలా చేయటం వలన కేవలం ఎంపిక చేయబడ్డవారు మాత్రమే అంటే మీ కుటుంబం , మిత్రులే మీ ప్రొఫైల్ ను చూడగలరు.

మీ బిడ్డ ఫోటోలను చూడగలిగేవారిపై ఒక కన్నేసి ఉంచండి

మీ బిడ్డ ఫోటోలను చూడగలిగేవారిపై ఒక కన్నేసి ఉంచండి

కొన్ని సైట్లు మీ ఫోటోలను ఎవరు బృందంగా చూడగలరో ఎంచుకునే ఆప్షన్లు అందిస్తాయి. ప్రతి ఫోటోకి ఇలా చూడగలిగే వారి బృందాన్ని ఎంచుకోవచ్చు. ఈ ఫెసిలిటీని వాడుకుని మీ బేబీ ఫోటోలు కేవలం మీ కుటుంబం, మిత్రులకే కన్పించేలా చేయండి.

వాటర్ మార్క్ ను వాడండి

వాటర్ మార్క్ ను వాడండి

మీరు ఆన్ లైన్లో పెట్టే ఫోటోలపై వాటర్ మార్క్ పెట్టండి. దీని వల్ల మీ ఫోటో కేవలం మీకే చెందుతుంది మరియు దాన్ని ఎవరూ దొంగిలించలేరు, తప్పుగా వాడలేరు. వాటర్ మార్క్ ను తొలగించటం కూడా కష్టమైన పని. అందుకని సులభంగా ఎవరూ చిత్రాలను దొంగిలించరు.

మీరుండే లొకేషన్ వివరాలు షేర్ చేయకండి

మీరుండే లొకేషన్ వివరాలు షేర్ చేయకండి

మీ బిడ్డ ఫోటోను పెట్టేటప్పుడు మీ లొకేషన్ ను రాయవద్దు. మీ సెల్ ఫోన్ లో మీరుండే లొకేషన్ ను ఆటోమేటిగ్గా పసిగట్టే సెట్టింగ్ కూడా ఆపేయండి. ఆన్ లైన్ లో మీ లొకేషన్ తెలిసేలా పెట్టడం వలన, తప్పుడు మనుషులకి మీరెక్కడున్నారో తెలిసి, కిడ్నాప్ వంటి తీవ్ర సమస్యలకి దారి తీయవచ్చు.

తక్కువ క్లారిటీతో ఉన్న ఫోటోలు పెట్టండి

తక్కువ క్లారిటీతో ఉన్న ఫోటోలు పెట్టండి

మీ పాపాయి ఫోటోలు ఆన్ లైన్లో పెట్టేటప్పుడు, అవెప్పుడు తక్కువ క్లారిటీతో ఉండేలా చూసుకోండి. దానివల్ల అలాంటి ఫోటోలను పెద్దది చేయటం మరియు ప్రకటనల్లో వాడుకోవటం కష్టమవుతుంది.

మీరు పోస్ట్ చేసే ఫోటోల పట్ల జాగ్రత్తగా ఉండండి

మీరు పోస్ట్ చేసే ఫోటోల పట్ల జాగ్రత్తగా ఉండండి

తమ లాభం కోసం వాడుకోటానికి ఎప్పుడూ సోషల్ నెట్ వర్క్ లలో ఫోటోలను వెతుకుతూనే ఉంటారు కొంతమంది. సాధారణంగా ఈ ఫోటోలలో బేబీ నేరుగా కెమెరా వంక చూడటమో లేదా పూర్తిగా బట్టల్లేకుండా ఉండటమో ఉన్నవాటిని ఎక్కువ దొంగిలిస్తారు.

కేవలం మీ బిడ్డతోనే ఉన్న ఫోటోలు పోస్ట్ చేయకండి

కేవలం మీ బిడ్డతోనే ఉన్న ఫోటోలు పోస్ట్ చేయకండి

ఫోటోలలో ఎప్పుడూ బిడ్డతో పాటు మీరో,మీ భాగస్వామి లేదా కుటుంబంలో నమ్మదగ్గ ఇతర సభ్యులో, మిత్రులో ఎప్పుడూ ఉండేలా చూసుకోండి. దీనివల్ల ఆన్ లైన్ వేటగాళ్ళు సులభంగా ఫోటోను వాడుకోలేరు.

గ్రూపు ఫోటోలు పెట్టేముందు ముందు ఎప్పుడూ అనుమతి అడగండి

గ్రూపు ఫోటోలు పెట్టేముందు ముందు ఎప్పుడూ అనుమతి అడగండి

మీ బిడ్డ బర్త్ డే ఫంక్షన్లో తీసిన గ్రూపు ఫోటో కావచ్చు లేదా స్కూలు ఫంక్షన్లో తీసినది కావచ్చు, మీరు ఇతర పిల్లలు కూడా కలిసున్న ఫోటో పెట్టాలనుకుంటే, వారి తల్లిదండ్రుల అనుమతి అడగటం మర్చిపోవద్దు. అనుమతి తీసుకునే పోస్ట్ చేయండి. వారు వారికి తెలీకుండా తమ పిల్లల ఫోటోలు ఎక్కడో పోస్ట్ కావడం ఇష్టపడకపోవచ్చు.

ఎలాంటి ఫోటోలు అస్సలు షేర్ చేయకూడదు?

బిడ్డకి పాలిస్తున్న ఫోటోలు

బిడ్డకి పాలిస్తున్న ఫోటోలు

తల్లిపాలివ్వడం చాలా మంచి విషయం, పైగా దాని ఫోటోలు మంచి సందేశాన్ని కూడా ఇస్తాయి. కానీ ఉన్మాదులకి, తర్కం లేని మనుషుల్లో తప్పు అర్థాలకి కూడా దారితీస్తాయి. ఇలాంటి ఫోటోలకి సాధారణంగా ఒక్కో సామాజిక వర్గం నుంచి రకరకాల దరిద్రపు కామెంట్లు వస్తుంటాయి. అంతేకాక, ఉన్మాదుల చేతిలో పడితే, పోర్నోగ్రఫీకి వాడుకునే అవకాశం కూడా ఉంది.

మీ బేబీ నగ్నంగా ఉండే ఫోటోలు

మీ బేబీ నగ్నంగా ఉండే ఫోటోలు

పాపాయి నగ్నంగా ఉన్న ఫోటోలు పోస్ట్ చేయటం మీకు అమాయకంగా అన్పించవచ్చు కానీ చిన్నపిల్లల సెక్స్ గురించి ఆలోచించే మానసిక రోగికి పోర్నోగ్రఫీలో ఉపయోగపడుతుంది.

అనుకోకుండా బిడ్డ జననాంగాలను చూపే ఫోటోలు

అనుకోకుండా బిడ్డ జననాంగాలను చూపే ఫోటోలు

మీరు మీ పాప/బాబు పూర్తిగా బట్టలు వేసుకున్న ఫోటోలే పోస్ట్ చేసినా కూడా, ఒకసారి అనుకోకుండా ఏ వ్యక్తిగత అవయవాలు బయటపడట్లేదు కదా అని చెక్ చేసుకోండి. లోపలి దుస్తులు కన్పించినా సరే, ఆన్ లైన్ పోస్ట్ చేయవద్దు, ఎందుకంటే వీటిని కూడా సులభంగా అసభ్యంగా ఫోటోషాప్ చేసేయవచ్చు.

కౌమారదశను తెలిపే ఫోటోలు

కౌమారదశను తెలిపే ఫోటోలు

మన దేశంలో చాలా భాగాల్లో బిడ్డ కౌమారదశలోకి వచ్చారని తెలియచేసే చాలా రకాలుగా ఫంక్షన్లు, ఉత్సాహంగా జరుగుతాయి. ఆన్ లైన్ లో అలాంటి ఫోటోలు పోస్ట్ చేయటం వలన అనవసరంగా తప్పుడు మనుషుల దృష్టి మీ బిడ్డ వైపు మళ్ళుతుంది.

పిల్లల స్నానం లేదా స్విమ్మింగ్ ఫోటోలు అస్సలు పెట్టవద్దు

పిల్లల స్నానం లేదా స్విమ్మింగ్ ఫోటోలు అస్సలు పెట్టవద్దు

మీ పిల్లలు స్నానాలు చేసే ఫోటోలు అస్సలు పెట్టవద్దు. అది స్విమ్మింగ్ పోటీ అయినా సరే, వాటర్ థీమ్ పార్క్ లో తీసినవి అయినా సరే. మీ బిడ్డ తడి దుస్తుల్లో ఉన్న ఫోటోలు అస్సలు పెట్టవద్దు. తప్పనిసరైతే, వారికి ఒంటిపై టవల్ కప్పి అప్పుడు ఫోటో తీయండి.

ట్రయల్ రూంలో తీసే ఫోటోలు

ట్రయల్ రూంలో తీసే ఫోటోలు

కొత్తబట్టలు సరిపోయాయో లేదో చూడటానికి మీ పిల్లలతో కలిసి ట్రయల్ రూంలోకి మీరు వెళ్ళినపుడు, మీరు కొన్ని ఫోటోలు తీయాలనుకోవచ్చు. కానీ వాటిని ఆన్ లైన్లో ఎప్పుడూ పెట్టకండి.

 పడుకున్న పిల్లల ఫోటోలు

పడుకున్న పిల్లల ఫోటోలు

పడుకునే పాపాయిలు చాలా ముద్దుగా ఉంటారు, సందేహం లేదు. కానీ అలాంటి ఫోటోలు ఆన్ లైన్ లో పెట్టడం వలన వారిని అపాయంలో పడేసినవారు అవుతారు. ఈ ఫోటోలు సెక్స్ లో పాల్గొంటున్నట్టుగా ఫోటోషాప్ చేయబడతాయి.

టాయ్ లెట్ సమయపు ఫోటోలు

టాయ్ లెట్ సమయపు ఫోటోలు

మీ బేబీ ఆఖరికి ఎలాగో తనంతట తనే టాయ్ లెట్ కి వెళ్ళటం నేర్చుకున్నారని మీరు ఆనందించవచ్చు. కానీ టాయ్ లెట్ సమయపు ఫోటోను ఆన్ లైన్ లో ఎప్పుడూ పెట్టకండి. ఈ ఫోటో చిన్నపిల్లల పోర్నోగ్రాఫర్ల చేతుల్లో పడవచ్చు. అంతేకాక, ఈ ఫోటోలు మీ బిడ్డలు పెద్దయ్యాక వారు హింస ఎదుర్కోటానికి కారణమవుతాయి.

English summary

different ways that your child's photos can be used online | Ways in which your baby’s photos can be misused | What can you do to protect your child’s photos from being misused

If you are on a social networking site, where sharing of photos makes for a large part of the activities, you will see that many of your friends post pictures of their adorable children. But did you know that this seemingly harmless flaunting is opening your child to a world of dangers?
Desktop Bottom Promotion