For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శారీరక నొప్పులు 24 గంటల్లో మాయం?

By B N Sharma
|

Aromatic
మహిళ గర్భాన్ని ధరించిన మొదలు శారీరకంగా ఎన్నో అసౌకర్యాలకు గురవుతుంది. కొన్ని సమయాలలో వచ్చే సమస్యలు ఆమెకు ప్రాణాంతకంగా కూడా వుంటాయి. వాటిలో ఒకటి శారీరక నొప్పులు. ఈ నొప్పులను తగ్గించటానికి గాను వైద్యపరంగా మందులు కూడా వాడుతూంటారు. అయితే, ఈ నొప్పులు సహజంగా తగ్గించాలంటే సహజ విధానాలలో సుగంధ ద్రవ్యాల స్నానం ఒకటి. సుగంధ ద్రవ్యాల స్నానం అంటే అనేక రకాల వనమూలికలు, సుగంధ ద్రవ్యాలు, ఎసెన్సులు దీనిలో వాడతారు. దీనివల్ల శారీరక నొప్పులు తగ్గి ఎంతో హాయిగా వుంటుంది. ఒకటి లేదా రెండు స్నానాల తర్వాత సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. శరీరంలోని చెడు తొలగుతుంది. చెడు తరంగాలనుండి విముక్తి కలుగుతుంది. అవసరాలకనుగుణమైన సుగంధ ద్రవ్యాలను ఎంచుకుని ఉపయోగించాలి. దీనికై బాత్ టబ్ వాడవచ్చు లేదా మామూలుగా వాడే స్నాన పరికరాలు కూడా సరిపోతాయి.

ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు ఎంచుకోవచ్చు. వాటిని వేడినీరు ఉన్న పాత్రలో ఉంచాలి. అపుడు ఆ నీరు ద్రవ్యాలలోని సారాన్ని గ్రహిస్తాయి. స్నాన పరికరాలు శుభ్రంగా వుండాలి. స్నానానికి సబ్బు, షాంపూ ఉపయోగించి రోజూవలెనే స్నానం చేయాలి. తర్వాత వనమూలికలు కలిపిన వేడి నీటిని టబ్, లేదా బకెట్ లో వున్న నీటికి చేర్చాలి. ఆ నీటితో తలతోపాటు శరీరమంతా తడిసేలా స్నానం చేయాలి. టవలుతో ఒళ్ళు తుడుచుకోవద్దు. ఒక పరిశుభ్రమైన గుడ్డ ఒంటికి చుట్టుకోవాలి.

ఈ రకంగా ఒళ్ళు సహజంగా ఆరే పద్దతి ముఖ్యం. పొడుగైన వెంట్రుకలున్నవారు తల తడుపుకోకుండా గుడ్డతో కవర్ చేయాలి. తరువాత 24 గంటలు స్నానం చేయవద్దు. కనీసం 12 గంటలైనా ఆగాలి. ఆ తర్వాత అవసరమనుకుంటే పరిశుభ్రమైన నులివెచ్చని నీటితో మరోమారు స్నానం చేస్తే శారీరక నొప్పులు మటుమాయం అవుతాయి.

English summary

Get Rid of Postnatal Delivery Pains! | సుగంధ ద్రవ్యాల వైద్యం!

Labor pains do not end abruptly after the birth of your little one. The pains continue for quite sometime after the birth and these pains are called after pains.
Desktop Bottom Promotion