For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బేరిపండు (పియర్స్) వల్ల కలిగే 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు !

పియర్స్ పెళుసైనదిగా ఉంటూ, దాని లోపల ఉన్న గుజ్జు తీపిని కలిగి చాలా రుచికరంగా ఉంటుంది. వీటిలో ఉన్న ప్రత్యేక పోషక లక్షణాల వల్ల ఉత్తరార్థ గోళార్థంలో ఉన్న ప్రజల యొక్క మన్ననలను పొందింది.

|

పియర్స్ పెళుసైనదిగా ఉంటూ, దాని లోపల ఉన్న గుజ్జు తీపిని కలిగి చాలా రుచికరంగా ఉంటుంది. వీటిలో ఉన్న ప్రత్యేక పోషక లక్షణాల వల్ల ఉత్తరార్థ గోళార్థంలో ఉన్న ప్రజల యొక్క మన్ననలను పొందింది. పియర్స్లో చాలా రకాలు ఉన్నాయి, అందులో అత్యంత సాధారణమైనవి "ఆసియాన్ పియర్స్". ఆసియాన్ పియర్స్ పెళుసైన నిర్మాణంతో, దృఢమైనదిగా ఉంటూ, ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి.

ఇవి మనకు అసంఖ్యాకమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇవి మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను సరఫరా చేయడం ద్వారా, దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. పియర్స్లో ఎక్కువ ఫైబర్ను కలిగి ఉండటం వల్ల అది కొలెస్ట్రాలను కూడా బాగా తగ్గిస్తుంది.

వీటిలో ఫైటో-న్యూట్రియంట్స్ కలిగి ఉండటం వల్ల అవి క్యాన్సర్ వ్యతిరేక పాలీఫెనోల్స్ గానూ పనిచేస్తుంది, అలాగే ఇవి యాంటీ ఏజింగ్ ఫ్లేవానాయిడ్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్లావానాయిడ్ల గానూ ఉండటం వల్ల మలబద్ధకం, అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ మరియు మూత్రపిండాలలో ఉన్న రాళ్లను కలిగించేవిగా ఉంటాయి.

పియర్స్ కూడా చాలా విలువైన ఔషధ ప్రయోజనాలకు కలిగి ఉండటమే కాకుండా, వివిధ విటమిన్లు మరియు మినరల్స్ను కలిగి ఉంటాయి, వీటిలో కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, B కాంప్లెక్స్ విటమిన్లను, పొటాషియం, విటమిన్-C మరియు విటమిన్-K లు ఉన్నాయి.

పియర్స్ వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.

1. ఫైబర్ అధికంగా ఉంటుంది :

1. ఫైబర్ అధికంగా ఉంటుంది :

బేరిపండు (పియర్స్) లో అధికమైన ఫైబర్తో నింపబడి ఉండడం వల్ల, రోజువారీ అవసరమయ్యే 25-30 గ్రాముల ఫైబర్ను మీకు అందిస్తుంది. ఫైబర్ అనేది సులభంగా జీర్ణమయ్యే కేలరీలను కలిగి ఉంటుంది మరియు రక్తంలో ఆరోగ్యకరమైన చక్కెర స్థాయిలను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఈ ఫైబర్ మన శరీర వ్యవస్థలో ఉన్న వ్యర్థాలను బయటకు తొలగించడానికి సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది, అలాగే పాయువు మరియు జీర్ణకోశం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

2. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది :

2. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది :

పియర్స్లో ఉన్న ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్ధకం, అతిసారం మరియు వదులుగా అయ్యే విరోచనాల అవకాశాలను తగ్గిస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియలో రోజువారీ అవసరమయ్యే ఫైబర్ను 18 శాతం వరకూ అందిస్తున్నందున, ఇది జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది. పియర్స్ అనేది పెద్దప్రేగులో స్వేచ్ఛా రాశులుగా తిరిగే హానికరమైన ఏజెంట్లను మరియు క్యాన్సర్గా ఏజెంట్లను నిర్బంధించడం ద్వారా శరీర అవయవాలకు నష్టం వాటిల్లకుండా రక్షిస్తుంది.

3. బరువు తగ్గడానికి సహాయపడుతుంది :

3. బరువు తగ్గడానికి సహాయపడుతుంది :

తక్కువ క్యాలరీలను కలిగిన పండ్లలో పియర్స్ ఒకటి. ఇది సహజమైన చక్కెరను కలిగి ఉంటుంది. ఒక్క పియర్లో 100 కేలరీలను కలిగి ఉంటాయి, ఇది బరువు కోల్పోయేలా చేయడానికి సరిపోతుంది. మీరు బరువు కోల్పోయే ప్రయత్నాలను గానీ చేస్తే, మీ ఆహారంలో పియర్స్ ఒక భాగంగా తీసుకోండి, ఎందుకంటే ఇది మీ శరీరాన్ని ఫైబర్తోనూ మరియు శక్తితోనూ పూర్తిగా నింపుతుంది. ఫైబర్తో మీ కడుపును పూర్తిగా నింపడం వల్ల మీకు ఎక్కువ ఆకలి అనిపించదు.

4. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది :

4. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది :

పియర్స్ విటమిన్-సి కలిగి, ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండటం వల్ల, స్వేచ్ఛగా వివరిస్తూ ఇతర అవయవాలకు నష్టాన్ని కలుగజేసే రాడికల్ పై పోరాడుతుంది మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. DNA ను సంరక్షించడంలోనూ, ఆరోగ్యవంతమైన జీవక్రియ కోసం, కణజాలాన్ని మరమత్తు చేయడం మరియు కణ ఉత్పరివర్తనను ఆపడం కోసం విటమిన్-సి అనేది అత్యంత ఆవశ్యకమైనది. ఇది యాంటీ ఏజింగ్ ప్రభావ లక్షణాలను కలిగి ఉంటుంది మరియు మీలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

5. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది :

5. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది :

పియర్స్ గుండెవ్యాధుల ప్రమాదపు రేటును తగ్గించే శక్తివంతమైన సామర్ధ్యమును కలిగి ఉంటుంది. పియర్స్లో ఉండే యాంటీఆక్సిడెంట్ ఫైటోకెమికల్స్ హృదయ వ్యాధులను, గుండెపోటు, స్ట్రోక్స్ వంటి ప్రమాదాలను తగ్గిస్తాయి. ఇది మీ ధమనులను ఎల్లప్పుడు క్లియర్గా ఉంచడంలో సహాయపడుతుంది, వాపులను మరియు అధిక స్థాయి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

6. డయాబెటిస్ను ఎదుర్కొంటుంది :

6. డయాబెటిస్ను ఎదుర్కొంటుంది :

పియర్లలో ఫ్రక్టోజ్ రూపంలో సహజమైన చక్కెరలను కలిగి ఉంటాయి మరియు గ్లైసెమిక్ యొక్క సూచికను తక్కువలో ఉంచుతుంది. డయాబెటిస్తో బాధపడుతున్న వ్యక్తులు ఏ భయం లేకుండా ఈ పండ్లను తినవచ్చు. వీటిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, ఇది మధుమేహమును నిరోధించడంలోనూ మరియు నివారించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.

7. ఆరోగ్యవంతమైన ఎముకల కోసం :

7. ఆరోగ్యవంతమైన ఎముకల కోసం :

పియర్స్ విటమిన్ K మరియు బోరాన్లను కలిగిన అద్భుతమైన మూలము. మీరు విటమిన్ K లోపంతో బాధపడుతున్నట్లయితే, మీకు ఎముకల-సంబంధించిన రుగ్మతలు సంభవించవచ్చు. విటమిన్-K అనేది ఫాస్పరస్, మెగ్నీషియం మరియు కాల్షియం వంటి ఇతర ఖనిజాలతో కలసి పని చెయ్యటం వల్ల ఎముకల విచ్ఛిన్నమును మరియు బోలు ఎముకల వ్యాధిని నిరోధిస్తుంది.

8. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది :

8. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది :

పియర్స్లో ఐరన్ మరియు కాపర్లను అధిక మొత్తంలో కలిగి ఉన్నందున రక్తహీనతను నిరోధించవచ్చు. ఐరన్, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజము; కాపర్ అనేది శరీరము చేత కావలసినంత ఐరన్ను గ్రహించి - శరీరం యొక్క ముఖ్యమైన అవయవాలు దానిని సరఫరా చెయ్యటంలో సహాయపడుతుంది, అందువలన రక్త-ప్రవాహమును అభివృద్ధి చేస్తూ, రక్తప్రసరణను నియంత్రిస్తుంది.

9. వాపులను తగ్గిస్తుంది :

9. వాపులను తగ్గిస్తుంది :

పియర్స్, శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లను మరియు ఫ్లేవనాయిడ్లు కలిగి ఉంటాయి. కీళ్ళనొప్పులు, గౌట్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు ఇతర ఆరోగ్య పరిస్థితుల ప్రతికూల లక్షణాలను తగ్గించడంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాన్ని కలిగి కావలసిన చికిత్సను అందిస్తుంది. అంతేకాకుండా, పియర్స్లో ఉండే ఆంథోసనియాన్లు కూడా వాపును తగ్గించడంలో బాగా సహాయపడతాయి.

10. త్వరగా స్వస్థతను చేకూరుస్తుంది :

10. త్వరగా స్వస్థతను చేకూరుస్తుంది :

పియర్స్లో, విటమిన్ సి మరియు ఆస్కార్బిక్ యాసిడ్లను కలిగి ఉండటం వల్ల - శరీరానికి స్వస్థత చేకూర్చే కొత్త కణజాలం సమీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. పియర్స్లో ఉన్న ఆస్కార్బిక్ ఆమ్లం యొక్క అధిక స్థాయిలు పాడైపోయిన రక్త నాళాలను సరిచేస్తాయి, ఆ విధంగా ఇది గుండె మీద ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు గుండె వ్యాధులను ముప్పును నిరోధిస్తుంది.

English summary

10 Amazing Nutrition Facts About Pears

Pears are sweet, crispy and delicious fruits which are juicy on the inside. Pears are widely popular in the whole of northern hemisphere due to their unique nutrient qualities. There are many kinds of pears, the most common ones are Asian pears. Asian pears have a crispy texture and a firm consistency and are green in colour.
Desktop Bottom Promotion