పోస్ట్ ప్రెగ్నెన్సీ కొవ్వును కరిగించుకునే విధానాలు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

గర్భిణీలకు కుటుంబంలోని అందరి నుండి ప్రేమాభిమానాలు అందుతాయి. భారతదేశంలో, ప్రేమాభిమానాలను ఆహారం రూపంతో అందిస్తారు. అందువలన, ప్రెగ్నన్సీ సమయంలో అదనపు బరువు సమస్య ఎదురవుతుంది. ప్రెగ్నన్సీ తరువాత అదనపు బరువును తగ్గించుకుని మళ్ళీ షేప్ లోకి రావాలని చాలా మంది మహిళలు కోరుకుంటారు.

అయితే, తిరిగి సాధారణ వెయిట్ కు చేరుకోవాలంటే కొంత సమయం పడుతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అదనపు కిలోలు తగ్గించుకునేందుకు సమయాన్ని కేటాయించాలి. అంకితభావంతో ప్రయత్నించాలి. వీలు కాదు అనే దృక్పథాన్ని పక్కన పెట్టాలి.

A Complete Guide To Lose Post-Pregnancy Fats

బేబీ ఫ్యాట్ ఏర్పడడానికి తొమ్మిది నెలల సమయం పట్టింది. అయితే, కేవలం 7 నుంచి 8 వారాలలో బేబీ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు. ప్రసవం తరువాత కూడా పొత్తికడుపులో ఫ్యాట్ పేరుకుని ఉన్నట్టుగానే మీకనిపిస్తే వివిధ మార్గాల ద్వారా ఈ ఫ్యాట్ ను కరిగించుకోవచ్చు.

ప్రసవం అయిన తరువాత కూడా చాలా మంది మహిళలు ఏడు లేదా ఎనిమిది నెలల గర్భిణీగా కనిపిస్తారు. పొట్ట గుండ్రంగా, పుష్టిగా అలాగే బెలూన్ లా కనిపిస్తుంది. ప్రసవం తరువాత కూడా మీ టమ్మీ పెద్దగా కనిపిస్తే ఎక్స్ట్రా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలను పాటించాలి.

ఈ కింద వివరించబడిన కొన్ని మార్గాలు సహజ పద్దతులలో బేబీ బెల్లీను తగ్గించేందుకు తోడ్పడతాయి. ప్రెగ్నెన్సీ తరువాత బెల్లీ ఫ్యాట్ ను ఎంతో సులువుగా తగ్గించుకోవచ్చు.

1. బ్రెస్ట్ ఫీడింగ్:

1. బ్రెస్ట్ ఫీడింగ్:

బ్రెస్ట్ ఫీడింగ్ మీ పాపాయికి మాత్రమే మంచిదని మీరనుకుంటే అది చాలా తప్పు. బ్రెస్ట్ ఫీడింగ్ వలన మీకు కూడా అపారమైన లాభాలు కలుగుతాయి. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది యుటెరస్ కాంట్రాక్షన్ ని పెంపొందించుతుంది. అందువలన, యుటెరస్ కుదించుకుపోవడం జరుగుతుంది. అలాగే, బ్రెస్ట్ ఫీడింగ్ వలన అదనపు కేలరీలు తగ్గుతాయి. మీ వైపు నుంచి ఎటువంటి కష్టం లేకుండానే కేలరీలు కరుగుతాయి.

రెస్ట్ తీసుకుంటున్న సమయంలో కూడా కేలరీలు కరుగుతాయి. గ్రేట్ కదా? శరీరంలోని పేరుకున్న అదనపు కొవ్వును తొలగించుకునేందుకు బ్రెస్ట్ ఫీడింగ్ తోడ్పడుతుంది. అయితే, బ్రెస్ట్ ఫీడింగ్ ను తగ్గించగానే కేలరీలను తగ్గించుకునేందుకు మీరు అదనంగా శ్రమ పెట్టాలి.

2. బెల్లీ వ్రాపింగ్:

2. బెల్లీ వ్రాపింగ్:

బెల్లీ వ్రాపింగ్ అనేది పాత కాలం పద్దతే అయినా కూడా ప్రెగ్నెన్సీ తరువాత బెల్లీ ఫ్యాట్ ను తొలగించుకునేందుకు అద్భుతంగా ఉపయోగపడే పద్దతి. అబ్డోమినల్ మజిల్స్ ను టోన్ చేసేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మెటర్నిటీ బెల్ట్స్ తో పాటు టక్స్ ని వాడటం ద్వారా పొత్తికడుపు కండరాలను కంప్రెస్ చేయవచ్చు. ఈ ప్రాసెస్ వలన యుటెరస్ తిరిగి సాధారణ షేప్ లోకి త్వరగా వచ్చే ఆస్కారం ఉంది. ప్రసవం తరువాత సాధారణంగా తలెత్తే నడుం నొప్పి లేదా పోశ్చర్ సమస్యల నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈ పద్దతి తోడ్పడుతుంది. సాధారణ కాటన్ వస్త్రాన్ని అంటే దుపట్టా లాంటి వస్త్రాన్ని ఉపయోగించుకుని ఈ బెల్లీ వ్రాప్ చిట్కాను పాటించవచ్చు.

3. ఎంప్టీ కేలరీలను అవాయిడ్ చేయండి :

3. ఎంప్టీ కేలరీలను అవాయిడ్ చేయండి :

కుకీస్, సోడా, క్యాండీస్, చాకోలెట్స్ లేదా చిప్స్ వంటి ఎంప్టీ కేలరీస్ ను అవాయిడ్ చేయండి. ఈ సమయంలో మీరు తీసుకునే కార్బోహైడ్రేట్స్ పై దృష్టి పెట్టండి. ఎందుకంటే, కార్బోహైడ్రేట్స్ షుగర్ గా మారి ఫ్యాట్ ఫ్రెండ్లీ ప్రాంతాల్లో సెటిల్ అవుతాయి. మీ డైట్ లో ఆరోగ్యకరమైన పదార్థాలే ఉండాలి. అదే సమయంలో ఫ్యాట్ తక్కువగా ఉండే డైరీ ప్రోడక్ట్స్ ను మీరు ప్రిఫర్ చేయాలి.

4. వ్యాయామం:

4. వ్యాయామం:

ప్రసవం తరువాత అదనపు శరీర బరువును తగ్గించుకునేందుకు తేలికపాటి వ్యాయామాన్ని మీ లైఫ్ స్టైల్ లో భాగంగా చేసుకోవాలి. జిమ్ లో వ్యాయామం చేయడం ఈ సమయంలో కాస్తంత కష్టతరమైన విషయమే. జిమ్ కై శ్రమను అలాగే సమయాన్ని కేటాయించాలి. ఈ సమయంలో కుదరకపోవచ్చు. కాబట్టి, వైద్యున్ని సంప్రదించిన తరువాత ఫ్రీ హ్యాండ్ అబ్డోమినల్ ఎక్సర్సైజేస్ ను ప్రయత్నించాలి. ప్రాణాయమాన్ని కూడా ప్రయత్నించాలి. ఇది బెల్లీ మజిల్స్ ను టోన్ చేయడానికి అమితంగా తోడ్పడుతుంది.

English summary

A Complete Guide To Lose Post-Pregnancy Fats

If you want to shed the extra weight that you gained post-pregnancy, all you need to do is follow these for 7-8 weeks: Breastfeeding, belly wrapping, avoiding empty calories, green tea, exercise, avoiding stress, adding spices like cinnamon, pepper, turmeric, long pepper, etc., to your diet and including cabbage in your diet.
Story first published: Tuesday, May 15, 2018, 18:00 [IST]