For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, గర్భిణీ స్త్రీలు పాటించవలసిన చిట్కాలు !

|

మీరు ఆరోగ్యవంతమైన గర్భధారణను కలిగి ఉండటం వల్ల - మీకు ఆరోగ్యవంతమైన శిశువును డెలివరీ అయ్యేలా సహాయం చేస్తుంది. మీరు ఆరోగ్యవంతమైన గర్భధారణకు కలిగి ఉండాలనుకుంటే, సురక్షితమైన పోషకాహారాలను తీసుకోవడంలో మీరు ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉండాలి. అయితే, ఈ గర్భధారణ సమయంలో మీ శరీరంలో కొన్ని హార్మోనుల విచ్చిన్నం కారణంగా, నివారించలేని గర్భ సంబంధమైన రుగ్మతలు మీకు కలగవచ్చు. వాటిలో వికారం, వాంతులు, గుండెల్లో మంట వంటి మొదలైనవి ఉన్నాయి.

అయితే, హెల్త్ కేర్ ప్రొవైడర్ అందించిన సలహాల మేరకు - మీరు వేటిని తినాలి ? గర్భధారణ సమయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి, మీకు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వాలంటే, మీ జీవనశైలి ఆరోగ్యంగా ఉండేటట్లుగా ఎలా మెరుగు పరుచుకోవాలి ? అనే విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధను తీసుకోవాలి.

Tips to have healthier babies

గర్భధారణ సమయంలో మీరు ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం :-

మీరు ఇప్పటికే గర్భవతిగా ఉంటే (లేదా) గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, మీ చుట్టూ ఉన్న శ్రేయోభిలాషుల నుండి మీరు అనేక రకాల సలహాలను పొందవచ్చు. అలాంటప్పుడు మీరు చేయవలసినది ఏమిటంటే, ప్రశాంతంగా ఉండటం & మీ శరీరానికి ముఖ్యమైనది ఏమిటో అర్థం చేసుకోవడం & గర్భసంబంధమైన పుస్తకంలో ఉండే ప్రాథమిక మార్గదర్శకాలను పాటించండి.

ఒకవేళ మీరు అనిశ్చితమైన పరిస్థితులను కలిగి ఉంటే, మీకు ఎదురైన సందేహాలను నివృత్తి చేసి - మంచి సలహాలను పొందడం కోసం డాక్టర్ను సంప్రదించడం చాలా మంచిది. మీ గర్భంలో ఉన్న శిశువును అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచి, పూర్తిగా ఆరోగ్యవంతంగా జన్మించగలదనే భరోసాను ఇవ్వగలగడంలో సహాయపడే కొన్ని ప్రాథమికమైన ప్రెగ్నెన్సీ చిట్కాలను గురించి తెలుసుకోవడాన్ని చదవండి.

• శిశు జననానికి ముందు వాడవలసిన విటమిన్ :-

• శిశు జననానికి ముందు వాడవలసిన విటమిన్ :-

మీరు గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు డాక్టర్ను సంప్రదించి ఉన్నట్లయితే ఫోలిక్ యాసిడ్, & ఐరన్ & కాల్షియం వంటి ప్రినేటల్ విటమిన్లను తప్పకుండా వాడమని సూచిస్తారు. ఇలా చేయడం వల్ల మీరు ఆ నెలలోనే గర్భం ధరిస్తే, ప్రెగ్నెన్సీ టెస్టులో మీరు సానుకూలమైన ఫలితాలను చూసే ముందు మీ బిడ్డ నాడీ వ్యవస్థ నిర్మాణమనేది ప్రారంభమవుతుంది. శిశు జననానికి ముందు వాడే విటమిన్ల వల్ల గర్భస్రావాన్ని, అధిక రక్తపోటు, ముందస్తు జనాలను వంటి ఇతర సమస్యలను నివారించవచ్చు.

• వ్యాయామం చేయడం :-

• వ్యాయామం చేయడం :-

ఒత్తిడి, బరువు నియంత్రణ, సరైన రక్తప్రసరణ, మీ మానసిక పరిస్థితిని మెరుగ్గా ఉంచుకోవడం వంటి అనేక అంశాలు మిమ్మల్ని చురుగ్గా ఉంచేటట్లుగా చేస్తాయి. గర్భధారణ సమయంలో మీరు పాటించవలసిన వ్యాయామ నియమాలలో గూర్చి మీకు ఖచ్చితంగా తెలియకపోతే, వ్యాయామ శిక్షణా తరగతులలో తప్పకుండా చేరండి. గర్భధారణ సమయంలో కనీసం 20 నిమిషాల నడక మిమ్మల్ని మరింత ఫిట్గా ఉంచుతుంది. యోగ & పిలాట్ వంటి వాటిని సాధన చేయడం వల్ల గర్భిణీ స్త్రీలు మెడికల్గా కూడా ఫిట్గా ఉంటారనేది నిపుణుల సలహా. తేలికపాటి వ్యాయామాలను సాధన చేయండి, శ్రమతో కూడిన వ్యాయామాలను అసలు చేయవద్దని కూడా నిపుణులు సూచిస్తున్నారు.

• మెర్క్యురీతో నిండిన చేపలను తినవద్దు :-

• మెర్క్యురీతో నిండిన చేపలను తినవద్దు :-

చేపలు అధిక పోషకాలను కలిగి ఉన్నప్పటికీ, కొన్ని మాత్రం మెర్క్యూరీ (పాదరసంము) ను కలిగి వుంటాయి. చాపల రూపంలో నిక్షిప్తమై ఉన్న మెర్క్యురీని గర్భస్త తల్లి తినేటప్పుడు, అది నేరుగా గర్భంలో ఉన్న శిశువు చేరుకుని ఆరోగ్య సంబంధమైన సమస్యలను కలుగజేయవచ్చు. ఈ మెర్క్యూరీ నేరుగా హార్మోన్లు & నరాల సంబంధ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావాన్ని కలుగజేస్తూ పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది.

ఇంటి పనులు :-

ఇంటి పనులు :-

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు, బాత్రూమ్లను శుభ్రం చేయడం వంటి కొన్ని ఇంటి పనులు చాలా ప్రమాదకరము. ఇంటి శుభ్రత కోసం వాడే క్లీనింగ్ ఏజెంట్లలో విషపూరితమైన రసాయనాలు కలిగి ఉంటాయి, అలాంటివాటిని వినియోగించేటప్పుడు దాని వాసనను పీల్చడం వల్ల మీ కడుపులో ఉన్న శిశువుకు హానికరంగా మారుతుంది. అలాగే, మీరు భారీ వస్తువులను ఎత్తడం (లేదా) ఎక్కువగా బ్యాక్టీరియాను కలిగి ఉండే మీ పెంపుడు జంతువులను శుభ్రం చేసేటప్పుడు, మీకు మీ కడుపులో ఉన్న శిశువుకు అది చాలా ప్రమాదకరమవుతుంది. కాబట్టి, మీరు హానికరమైన రసాయనాల ఉపయోగానికి దూరంగా ఉండటం చాలా మంచిది. యార్డ్ వంటి ప్రదేశాల్లో పనిచేస్తున్నప్పుడు మీ చేతులకు గ్లోవ్స్ ధరించడం మంచిది. అంతేకాకుండా, నిచ్చెనల సాయంతో పైకి ఎక్కడం వంటి ప్రయత్నాలు చేయవద్దు. పెంపుడు పిల్లుల శరీరంపై ఉన్న పరాన్నజీవులు హానికరమైన వ్యాధులకు కారణం కాబట్టి, వాటిని శుభ్రం చేసేందుకు ఇతరుల సహాయాన్ని తీసుకోండి.

మీరు క్రింది లక్షణాలను కలిగి ఉన్నప్పుడు, త్వరగా డాక్టర్ను సంప్రదించడం మంచిది:-

మీరు క్రింది లక్షణాలను కలిగి ఉన్నప్పుడు, త్వరగా డాక్టర్ను సంప్రదించడం మంచిది:-

• మీరు తీవ్రమైన గుండె దడను కలిగి ఉన్నప్పుడు

• వికారంతో కూడిన వాంతులు ఎక్కువగా ఉన్నప్పుడు

• శ్వాస తీసుకోలేనప్పుడు

• తరచుగా మైకము (మూర్ఛ) ఎదురైనప్పుడు

• శరీరంలో తీవ్రమైన నొప్పులు ఎదురవుతున్నప్పుడు

• సుమారు 20 నిమిషాల వ్యవధిలో సంభవించే సంకోచాలు

• పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిర్లు నయంకానప్పుడు

• ఎడెమా వ్యాధి తీవ్రత వల్ల మీరు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు

• గర్భంలో శిశువు కదలికలు లేనప్పుడు

• యోని నుంచి ద్రవరూపంలో నీరు కారడం

ఇటువంటి పరిస్థితుల్లో మీరు తప్పకుండా డాక్టర్ను సంప్రదించాలి.

ఆహారం ఎక్కువగా తీసుకోండి :-

ఆహారం ఎక్కువగా తీసుకోండి :-

మీ గర్భంలో ఉన్న శిశువు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదగాలంటే మీరు సమతుల్యమైన ఆహారమును తీసుకోవడం తప్పనిసరి. మీ రోజువారి ఆహారంలో 5 రకాల పండ్లు & కూరగాయలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ధాన్యానికి సంబంధించిన పిండి పదార్థాలను ఎక్కువ తినడం వల్ల, మీరు ఫైబర్ను పుష్కలంగా పొందవచ్చు. మీ ఆహారంలో గుడ్లు, మాంసం, నట్స్, పప్పులు & బీన్స్ రూపంలో ప్రొటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయని నిర్ధారించుకొని వాటన్నింటిని ఎక్కువగా వినియోగించండి. డైరీ ఉత్పత్తుల కింద పాలు, పెరుగు, జున్ను వంటివి ఉపయోగపడతాయి. చేపలలో తప్ప, మిగతా ఆహార ఉత్పత్తులయిన ఆకుపచ్చని ఆకుకూరలు, గింజలు, నట్స్, సోయా ఉత్పత్తులలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గొప్ప వనరులుగా ఉంటాయి. అంతేకాకుండా మీకు మీరే హైడ్రేట్గా ఉండేలా చూసుకోండి. అందుకుగాను మీరు రోజుకి 8 గ్లాసుల నీరుని తాగాలి.

ఆరోగ్యవంతమైన శరీర బరువును కలిగి ఉండండి :-

ఆరోగ్యవంతమైన శరీర బరువును కలిగి ఉండండి :-

అధిక బరువుతో ఉన్న గర్భిణీ స్త్రీలు, శిశు జనన ప్రక్రియలో ఏర్పడే అనేక సమస్యల తీవ్రతను ఎక్కువగా కలిగి ఉంటారు, అలాంటి వారికి ఎమర్జెన్సీ C-సెక్షన్ అవసరమవుతుంది. గర్భస్థ స్త్రీలు అధిక బరువును కలిగి ఉండటం వల్ల - వాళ్ల పిల్లల చిన్నతనం నుంచే అలర్జీలు, ఊబకాయం, ఉబ్బసం వంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అవన్నీ కలిపి భవిష్యత్తులో గుండె జబ్బులకు దారి తీయగలవు.

• డి-స్ట్రెస్ :-

• డి-స్ట్రెస్ :-

గర్భధారణ సమయంలో ఒత్తిడిని ఎదురు కావడం వల్ల, వారి పిల్లలలో ఆందోళన, డిప్రెషన్, ఊబకాయం వంటి అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో యోగా - ధ్యానం వంటి కౌన్సెలింగ్ల ద్వారా మీలో ఉన్న ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేసుకోండి.

• పరిశుభ్రమైన ఆహారం :-

• పరిశుభ్రమైన ఆహారం :-

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకునే ఆహారం, పరిశుభ్రంగా ఉండటమనేది అత్యంత ప్రాముఖ్యమైనది. లిస్టిరియా బాక్టీరియా, లిస్టెరోసిస్ అని పిలువబడే ఒక ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది, దాని ప్రభావం వల్ల గర్భస్రావం, మృత శిశువు జననం (లేదా) శిశువు జన్మించిన తరువాత తీవ్రమైన అనారోగ్యమును కలిగి ఉండటం వంటి పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి గర్భిణీలు, లిస్టిరియాను కలిగి ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేమిటంటే,

• పాశ్చురైజ్డ్ కానీ పాలను తాగకూడదు

• మార్కెట్లలో వివిధ రూపాలలో లభ్యమయ్యే జున్నులను తినకూడదు

• ఫాస్ట్ ఫుడ్ వంటకాలను తినకూడదు

• సాల్మొనెల్ల బాక్టీరియా కూడా కడుపు ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది. కాబట్టి, ఈ క్రింది తెలిపిన ఆహారాలను తినడం వల్ల, అవి విషాహారంగా మారే పరిస్థితులకు దారితీస్తుంది కాబట్టి, షెల్ఫిష్ను చేపలను & ఇతర మాంసాలను పచ్చిగా గాని, వండకుండా గాని తినకూడదు.

పైన చెప్పిన విషయాలనే కాకుండా,

పైన చెప్పిన విషయాలనే కాకుండా,

పైన చెప్పిన విషయాలనే కాకుండా, ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మ నివ్వాలి అనుకుంటే గర్భవతులు కొన్ని ముఖ్యమైన సలహాలను తప్పక పాటించాలి. మద్యపానం వల్ల, మీ శిశువు రక్తంలో అది ఎంత మోతాదులో చేరుతుందో కచ్చితంగా చెప్పలేము కాబట్టి మీరు పూర్తిగా మద్యపానాన్ని నిషేదించాలి. అంతేకాకుండా ధూమపానం చేయడం వల్ల మీ శిశువు అకాల జననానికి (లేదా) తక్కువ బరువుతో కూడిన జననాలకు దారితీస్తుంది. కెఫీన్ వినియోగం గర్భస్రావ ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి, వీటి వినియోగానికి చాలా దూరంగా ఉండాలి. చిట్టచివరిగా మీకు తెలియపరిచే విషయమేమంటే, మీరు తగిన విశ్రాంతిని తీసుకుంటూ, మీ శరీరానికి అవసరమైనంత నిద్రను కలిగి ఉండటానికి ప్రయత్నించండి.

English summary

Tips to have healthier babies

If you are pregnant or trying to conceive, having certain foods and taking the best care of yourself can help you have a healthy baby. Consuming prenatal vitamins such as folic acid, iron and calcium tablets are advised. Keeping your weight under control, staying away from stress, etc. are some of the factors that can help.
Story first published: Saturday, May 12, 2018, 18:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more