For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అర్జున్ రాంపాల్ గర్ల్ ఫ్రెండ్ గాబ్రియెల్లా డెలివరీ అయిన నెలలోపే బరువు తగ్గి ఆ ఫొటోలను షేర్ చేసింది

|

అర్జున్ రాంపాల్, అతని గర్ల్ ఫ్రెండ్ గత నెల జులై 18న ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పుట్టిన బిడ్డ ఫొటోలను సైతం సోషల్ మీడియాలో వారు షేర్ చేసుకుని అందరి ఆశీస్సులు పొందిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అవన్నీ ఒక ఎత్తయితే సరిగ్గా నెల రోజులు సమయం గడవక ముందే గాబ్రియెల్లా మరో రికార్డు నెలకొల్పింది. సరిగ్గా 11 రోజుల తర్వాత తన బరువు చాలా వరకు తగ్గినట్లు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫొటోలను పోస్ట్ చేసి.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు గాబ్రియెల్లా అంటే ఎవరో చాలా మందికి తెలియదు. ఇంతకీ గాబ్రియెల్లా ఎవరంటే కింగ్ నాగార్జున తీసిన "ఊపిరి" సినిమాలో ఓ సినిమాలో తళుక్కున మెరిసి వెళ్లిపోతుంది. అంతకుముందు ఆమె అర్జున్ రాంపాల్ తో సహజీవనం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే.. మరోవైపు అర్జున్ రాంపాల్ తన భార్యకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. దీంతో గాబ్రియెల్లాని పెళ్లి చేసుకోలేకపోయాడని పలువురు చర్చించుకుంటున్నారు.

గాబ్రియెల్లా డెలివరీ అయిన తర్వాత కూడా నిత్యం వ్యాయామం చేస్తూనే ఉండేది. ఆమె గర్భధారణ సమయంలో కూడా తన వ్యాయామాలను విడిచిపెట్టలేదని ఆ వివరాలన్నింటినీ తన అభిమానులతో పంచుకుంది. ఇంకా ఇన్ స్టాగ్రామ్ లో మరిన్ని విషయాలను జతపరిచింది. అందులో ఏముందంటే.. " నేను మూడు వారాల క్రితం నా అందమైన అబ్బాయికి (సుమారు నాలుగున్నర కిలోల బరువు గల) జన్మనిచ్చాను. గర్భం దాల్చిన 9వ నెలలో నేను 21 కిలోలు తగ్గాలని నిర్ణయించుకున్నాను. అది అంత సులభం కాదని తెలుసు. అందుకే నేను కోరుకున్నది తిన్నాను. చాలా మితంగా తిన్నాను. అనంతరం విశ్రాంతి తీసుకోమని నా శరీరం నాకు చెప్పింది" అని వివరించింది.

మరో కథలో ఏముందంటే.. ఆమె ఎలా ఉందో, ఎంత శ్రద్ధ చూపిస్తుందనే దానిపై ఆమె ఏ మాత్రమూ బాధపడటం లేదని పేర్కొంది. " నాకు నార్మల్ డెలివరీ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. శరీరం ఒక అద్భుతమైన విషయం. నేను నా జీవితాన్ని ఈ ప్రపంచంలోకి తీసుకెళ్లాను. అలాగే సంరక్షణ కోసం తక్కువగా వెతుకుతున్నాను. 21 కిలోలు ఎక్కువే కాని నేను అనుకున్న దానికన్నా మంచి అనుభూతిని పొందలేదు" అని వివరించింది.

అంతేకాదు కొందరికి సలహాలు కూడా ఇచ్చింది. ప్రెగ్నెన్సీ సమయంలో బాగా తినడం, ప్రతిసారీ చికిత్స ద్వారా చెక్ చేయించుకుంటే గర్భధారణకు సహాయ పడుతుందని తెలిపింది. ప్రినేటల్ యోగా చేయడం వల్ల చాలా బలంగా ఉండడానికి సహాయపడుతుందని పేర్కొంది. ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉన్నారని గుర్తుంచుకోండి.. అన్ని మంచి పనులు చేయడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి మీ శరీరం మీ మనసుతో ఓపిక పట్టండి" అని ఆమె తెలిపింది.

English summary

Arjun Rampal's Girlfriend Gabriella Demetriades Shares Post Pregnancy Weight Loss Picture

Arjun Rampal and his girlfriend are all familiar with the birth of a baby boy on July 18 last month. The baby photos of the newborn will be remembered by everyone on social media. Gabriella set another record before it was time for exactly a month and a half. Recently posted new photos on Instagram showing that she has lost a lot of weight after 11 days. Everyone was overwhelmed by the surprise.