For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబార్షన్ తో హాని లేదు!

By B N Sharma
|

Abortion Doesn't Put Women's Mental Health At Risk
తాజా పరిశోధన మేరకు మహిళల అబార్షన్ వారి మానసిక ఆరోగ్యంపై ఎట్టి చెడు ప్రభావం చూపదని తేలింది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ చేసిన సమగ్ర పరిశోధన మేరకు అబార్షన్లు మహిళల మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపటం లేదని వెల్లడైంది.

అయితే, గతంలోని పరిశోధనలు, అబార్షన్ కారణంగా మనోవేదన, ఆందోళనవంటి మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపాయి. అయితే, ప్రస్తుత పరిశోధనలో కోరుకున్న, కోరుకోని అబార్షన్లు ఎలావుంటాయనేది లేదా పేదరికం, మత్తుమందుల వాడకం వలన ఏర్పడిన అబార్షన్లుగా వర్గీకరణ చేయలేదని పరిశోధనా సంస్ధ తెలిపింది.

గర్భం అనవసరం అనుకునే మహిళలకు మాత్రం చేసే అబార్షన్లు వారిలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు కలిగించటంలేదని మాత్రం తెలిపింది. ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు చేయాల్సివుందని కూడా తెలిపింది. మహిళ వాంఛించకపోతే అబార్షన్లు రెండు లేదా మూడైనప్పటికి వారి మానసిక ఆరోగ్యంపై చెడు ఫలితాలు లేవని తెలిపింది. ఆశించని గర్భాలను మొదటి త్రైమాసికంలో తొలగించినప్పటికి సంబంధిత మహిళలలో ఎటువంటి దుష్ప్రభావాలు ఏర్పడలేదని అధ్యయన కర్త బ్రెండా మేజర్ తెలిపినట్లు టైమ్స్ పత్రిక పేర్కొంది.

English summary

Abortion Doesn't Put Women's Mental Health At Risk | అబార్షన్ తో హాని లేదు!

A comprehensive review of research, by the American Psychological Association (APA), showed no evidence that the majority of abortions cause psychiatric problems.
Story first published:Monday, October 31, 2011, 15:08 [IST]
Desktop Bottom Promotion