Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బిడ్డకు జన్మనివ్వటం...ఇక ఎంతో సుఖవంతం!

బిడ్డకు జన్మనివ్వటంలో నొప్పి కలుగుతుందనేది అనాదికాలం నుండి వస్తున్న వాదనే. కాని నేటి మానవుడు కనిపెట్టిన సైన్సు పరిజ్ఞానం ఈ అంశంలో మహిళలకు ఎంతో సౌఖ్యాన్ని కూడా కలిగిస్తోంది. ప్రసవ వేదనను పోగొట్టటానికి వివిధ రకాల వైద్యాలు అందుబాటులోకి వచ్చాయి. నొప్పులు లేకుండా బిడ్డకు జన్మనివ్వటం ఎలా?
1. ఎపిడ్యురల్: ఈ టెక్నిక్ ఆచరించాలంటే నొప్పి తెలియకుండా వుండగలందులకు లోకల్ ఎనస్తీషియా ఇస్తారు. ఈ పద్ధతి నేడు సాధారణమైపోయింది. ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తోంది. పెయిన్ అనేది మన మనోభావనే అనే అంశం ఆధారంగా ఈ పద్ధతి పని చేస్తోంది. డెలివరీ నొప్పులు వెనుకవైపు మొదలై బేబీ బయటకు రావటానికి తోయటంతో యోని ద్వారం వద్ద అధికమైపోతాయి. ఈ దశలో వెనుక భాగంలో కల నరాలు నొప్పి సంకేతాన్ని మీ బ్రెయిన్ కు పంపకుండా వుంటే ఏమవుతుంది? శరీర వెనుకభాగంలో ఒక గొట్టానన్ని అమర్చి అనస్తీషియా ద్రవాని్న దానిలోకి ఇంజెక్ట్ చేస్తే మీ శరీర వెనుక భాగం తిమ్మిరెక్కి బాధ తెలియదు. మీకు ఇక తెలిసేదల్లా బేబీ బయటకు వస్తున్న సమయంలోని ఒత్తిడి మాత్రమే. అయితే, ఈ పద్ధతిలో డెలివరీ తర్వాత వెన్ను నొప్పి వస్తుందనే వాదన కూడా లేకపోలేదు. కాని డెలివరీ తర్వాత వెన్ను నొప్పి రావటమనేది ఏ పద్ధతిలో డెలివరీ జరిగినా వస్తుందనేది వాస్తవంగా అంగీకరించారు.
2. నీటిలో జన్మనివ్వడం లేదా హైడ్రోధిరపీ: ఇటీవలి కాలంలో ఈ పద్ధతి వేగంగా అమలు అవుతోంది. డెలివరీ చేస్తున్న మహిళను తగినంత వేడిగల నీటిలో వుంచుతారు. ఈ వేడినీరు ఆమెకు నొప్పులనుండి ఉపశమనం ఇస్తుంది. ఈ పద్ధతిలోనే లాఫింగ్ గ్యాస్ లేదా సుగంధ ద్రవ్యాల వైద్యం వాడి తల్లికి ఊరట కలిగిస్తారు.
3. హిప్నోధిరపీ: పడే నొప్పి అంతా మానసికమైనదేనన్న భావన దీనికి ఆధారం. ఇటువంటపుడు, మహిళను హిప్నాటిజంకు గురి చేసి బాధను మరచిపోయేలా చేస్తారు. సెల్ఫ్ హిప్నోసిస్ చేసుకునేందుకు శిక్షణ నివ్వటానికిగాను ఆస్పత్రులు నైపుణ్యతగల హిప్నోటిస్టులను నిర్వహిస్తున్నారు. ఈ పద్ధతిలో మహిళకుగల నొప్పి అందోళన అసలే వుండదు. బిడ్డకు జన్మనివ్వటం అతి తేలిక. అయితే, ఏది ఏమైనప్పటికి మహిళ నొప్పులను పూర్తిగా మరపించే మార్గాలు ఇంకా అందుబాటుకి రాలేదు. పైన చెప్పినవన్నీ నొప్పులను గణనీయ స్ధాయిలో తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు మాత్రమేనని చెప్పక తప్పదు.



Click it and Unblock the Notifications