For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భవతికి నిద్రాహారాలు లోపిస్తే...!

By B N Sharma
|

Insomnia During Pregnancy
గర్భం ధరించటంతో మహిళకు హార్మోన్లపరంగా, మానసికంగా, శారీరకంగా పెద్ద మార్పులు వస్తాయి. తరచుగా వచ్చే ఈ మార్పుల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో నిద్ర లేమి లేదా ఇన్ సోమానియా అనే వ్యాధి ఒకటి. గర్భం పెరుగుతూవుంటే, శరీరం బరువు అధికమవుతుంది. ఈ బరువును మోయటంలో మహిళ అలసిపోతుంది. గర్భవతికి వచ్చే నిద్ర లేమి సమస్యకు ఇది ఒక కారణంగా చెపుతారు.

ఇతర కారణాలు పరిశీలిస్తే, హార్మోన్ల మార్పు, ఒత్తిడి, ఆందోళన, అసౌకరంగా వున్న శరీర పరిస్ధితి. గర్భం పెరుగుతూ వుంటే మహిళ ఆరోగ్యంగా వుండటానికి తగినంత నిద్ర, ఆహారం అవసరం.

నిద్రలేమి సమస్య తీరాలంటే....
1. సెరోటోనిన్ అధికంగా వుండే ఆహార పదార్ధాలు పెరుగు, పాలు, సోయా మిల్క్ వంటివి తీసుకోవాలి.

2. ఒత్తిడి తగ్గి శరీరం రిలాక్స్ అవాలంటే అరోమా ధిరపీ తీసుకోవాలి. లేదా ఆహ్లాదాన్నిచ్చే సెంటెడ్ కేండిల్స్, ఆరోమా నూనెలు మొదలైనవి వాడాలి.

3. బిగిసిన కండరాలను రిలాక్స్ చేసేటందుకుగాను ఒక శిక్షకుని సమక్షంలో తేలికపాటి వ్యాయామాలు, వాటి తర్వాత చక్కని ధ్యానం చేస్తే నిద్ర బాగా పడుతుంది.

4. తరచుగా సమస్యలకు వైద్యుడిని సంప్రదించడం, ప్రెగ్నెన్సీ గురించిన పూర్తి అవగాహన నెలలు పెరుగుతున్న కొద్ది వచ్చే ఒత్తిఢిని తగ్గిస్తాయి. ఈ చర్యలు గర్భవతి విశ్రాంతిగా నిద్ర పోయేటందుకు పనిచేస్తాయి.

సమస్యలు ఎన్ని వున్నప్పటికి మహిళకు గర్భం ధరించటమనేది ఒక జీవితకాల వరంగా భావించాలి. దీనిని కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ ఆనందించాలి.

English summary

Insomnia During Pregnancy | నిద్రను దూరం చేసే అధిక ఒత్తిడి!

As the due date comes near, a pregnant lady goes under constant mental tension. As a result, she faces tense nervous system and lack of sleep leading to insomnia. If you are well informed about the whole process of pregnancy, your tension can be a bit less, as it will prepare you for what is coming up. Consulting a doctor for every problem is important.
Story first published:Saturday, October 22, 2011, 12:49 [IST]
Desktop Bottom Promotion