For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు ఎండు ద్రాక్ష తినడం వల్ల పొందే గొప్ప ప్రయోజనాలు

|

మహిళలు గర్భం పొందితే తీసుకొనే ఆహారం విషయంలో కొన్ని హద్దులు పెడుతుంటారు. ప్రత్యేకంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతారు. గర్భిణీ స్త్రీలు తీసుకొనే ఆహారాలు తల్లి మరియు కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యానికి ఉపయోగకరమైనవిగా ఉండాలి. గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డకు హానికలిగించే బొప్పాయి మరియు పైనాపిల్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.

మరి ఎండు ద్రాక్ష గర్భిస్గ్రీలకు ఏవిధంగా ఉపయోగపడుతుంది ? గర్భిణీ స్త్రీలు ఎండు ద్రాక్షతినడం వల్ల వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని మీకు ఈ రోజు తెలియజేస్తున్నాము.

ముఖ్యంగా గర్భిణీ మహిళలు ఎక్కువ న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండే సరైన ఆహారంను ఎక్కువగా తీసుకోవాలి. న్యూట్రీషియన్స్ అధికంగా ఉండే ఆహారాల్లో ఖర్జూరం, ఆప్రికాట్స్, నట్స్ మరియు ఎండు ద్రాక్షవంటి డ్రై ఫ్రూట్స్ గర్భిణీలకు చాలా ప్రయోజనాలను అందిస్తాయి .

ఎండు ద్రాక్షలో పొటాషియ, క్యాల్షియం, మరియు మెగ్నీషియం అధికంగా ఉన్నాయి . అంతే కాదు వీటిలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ మరియు మినరల్స్ అధికంగా ఉన్నాయి. ఎండు ద్రాక్షలో న్యూట్రీషియన్ విలువలు గర్భిణీకి మరియు పొట్టలో పెరుగుతున్నశిశువుకు కూడా చాలా ఆరోగ్యకరమైనవి.

గర్భిణీ స్త్రీలు ఎండు ద్రాక్షతినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ....

1. దంత సంరక్షణ:

1. దంత సంరక్షణ:

కొంత మంది గర్భిణీ మహిళల్లో దంతాల నుండి రక్తస్రావం జరుగుతుంటుంది మరియు దంతక్షయానికి లోనవుతుంటారు. ఎండు ద్రాక్షలో ఓలియోనిక్ యాసిడ్ ఉండటం వల్ల ఇది దంతక్షయాన్ని, చిగుళ్ళ నుండి రక్తస్రావాన్ని, దంత సమస్యలను నివారిస్తుంది.

2. మలబద్దకాన్నినివారిస్తుంది:

2. మలబద్దకాన్నినివారిస్తుంది:

గర్భిస్త్రీ తరచూ మలబద్దక సమస్యను ఎదుర్కొంటుంది. ఎండు ద్రాక్షలో ఉండే ఫైబర్ ఈ సమస్యను చాలా సులభంగా నివారిస్తుంది.

3. అనీమియా:

3. అనీమియా:

గర్భిణీ స్త్రీలలో రక్తహీనత చాలా సాధారణమైన సమస్య. అందుకు గర్భిణీ స్త్రీలు ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవల్సి ఉంటుంది. ఎండు ద్రాక్షలో ఐరన్ మరియు విటమిన్ బికాంప్లెక్స్ లు అధికంగా ఉంటాయి. మరియు ఎండు ద్రాక్షలో ఇతర మినిరల్స్ కూడా ఉండటం వల్ల ఇది హీమోగ్లీబిన్ స్థాయిని పెంచుతుంది.

4. యాసిడ్ రిఫ్లెక్షన్స్ నివారిస్తుంది:

4. యాసిడ్ రిఫ్లెక్షన్స్ నివారిస్తుంది:

గర్భిణీ స్త్రీలో ఇది ఒక సాధారణ సమస్య . పొట్టలో పిండం క్రమంగా పెరగడం వల్ల మరియు జీర్ణక్రియ వేగంగా లేదా చురకుగా ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ కంటెంట్ జీర్ణవాహికలోకి వెళ్లడం వల్ల హార్ట్ బర్న్ కు కారణం అవుతుంది . ఈ సమస్యను నివారించడానికి ఎండు ద్రాక్షలో ఉండే పొటాసియం మరియు మెగ్నీషియం అధికంగా ఉండి యాసిడ్ రిఫ్లెక్షన్ నివారిస్తుంది.

5. ఎనర్జీని అందిస్తుంది:

5. ఎనర్జీని అందిస్తుంది:

గర్భధారణ సమయంలో ఎనర్జీ ఎక్కువ అవసరం అవుతుంది . పొట్టలో పెరిగే బేబీ వల్ల తల్లి స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకు తల్లి తీసుకొనే ఆహారాలో న్యూట్రీషియన్స్ పెంచాలి. ఎండు ద్రాక్షలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల షుగర్ లెవల్స్ ను తక్షణం పెంచుకోవడానికి ఇవి ఒక బెస్ట్ స్నాక్ గా తీసుకోవచ్చు.

6. మార్నింగ్ సిక్ నెస్:

6. మార్నింగ్ సిక్ నెస్:

చాలా మంది గర్భిణీ స్త్రీలలో వికారం, వాంతులు సహజం ఈ సమస్యను నివారించడానికి ఎండు ద్రాక్ష గ్రేట్ గా సహాయపడుతుంది . ఇవి మంచి రుచిని కలిగి ఉండటం మాత్రమే కాదు. గర్భధారణ సమయంలో స్టొమక్ అప్ సెట్ ను నివారిస్తుంది.

7. కంటి చూపును మెరుగుపరుస్తుంది:

7. కంటి చూపును మెరుగుపరుస్తుంది:

ఎండు ద్రాక్షలో ఉండే న్యూట్రీషియన్స్ వల్ల పొట్టలో పెరిగే శిశువు యొక్క కంటిచూపును మెరుగుపరుస్తుంది . వీటిలో విటిమిన్స్ అధికంగా ఉండటం వల్ల వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది.

8. బోన్ స్ట్రక్చర్ క్రమంగా :

8. బోన్ స్ట్రక్చర్ క్రమంగా :

ఎండు ద్రాక్షలో క్యాల్సియం అధికంగా ఉండటం వల్ల ఇది బేబీలో ఎముకలు ఏర్పడుటకు గ్రేట్ గా సహాయపడుతుంది . ఎండు ద్రాక్ష రెగ్యులర్ గా తినడం వల్ల కొత్తగా పుట్టే పిల్లల్లో హెల్తీ అండ్ స్ట్రాంగ్ బోన్స్ ఏర్పడుతాయి.

9. క్యాన్సర్ నివారిస్తుంది:

9. క్యాన్సర్ నివారిస్తుంది:

ఎండు ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది క్యాన్సర్ కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ ను శరీరం నుండి తొలగిస్తుంది.

10. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

10. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

ఎండు ద్రాక్ష గర్భిస్త్రీలలో ఆకలిని పెంచుతుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి మలబద్దకాన్ని నివారిస్తుంది.

English summary

10 Benefits Of Raisins In Pregnancy

You must know the foods that are healthy for you and your foetus. At the same time there are some harmful foods during pregnancy that must be avoided such as papaya and pine apple.
Story first published: Monday, April 13, 2015, 15:26 [IST]
Desktop Bottom Promotion