For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలకు హాని కలిగించే ఈ 10 ఫుడ్స్ కు ఖచ్చితంగా నో చెప్పాల్సిందే..!!

|

ఒక మహిళ యొక్క జీవితంలో మాతృత్వం అనేది ఒక పరిపూర్ణ రూపం అని చెప్పవచ్చు. గర్భధారణలో కొత్తగా తల్లైన వారిలో ఆహారం, ఆరోగ్యం పట్ల అనేక అపోహాలు ఉంటాయి. గర్భం పొందినవారిలో సంతోషాలు వెల్లివిసరడంతో పాటు, ఒక మధురమై అనుభూతి పొందుతారు. అలాగే కొన్నిగర్భధారణ కాలంలో పూర్తయ్యే నాటికి ఒక కొన్ని సందర్భవాల్లో విసుగు కలగడం, ఆందోళకు గురి అవ్వడం జరగడం సహజం.

గర్భధారణ సమయంలో స్త్రీ సరైన రీతిలో ఆహారం తిని క్రమంగా బరువు పెరగాలి. ఆరోగ్యం కొరకు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కొరకు కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో ప్రత్యేకంగా చేర్చుకుంటే, అదే డైట్ నుండి కొన్ని ఆహారాలను ఆరోగ్యానికి హానికలిగించేవి తొలగించాల్సి ఉంటుంది. మహిళ గర్భం పొందిన తర్వాత కొన్ని ఆహారాలు శరీరానికి వేడి కలిగిస్తే, మరికొన్ని ఆహారాలు చలవ చేస్తాయి . ఒక గ్లాస్ ఆమ్ పన్నా, పచ్చి మామిడికాయ డ్రింక్, శరీరంలో వేడి తగ్గిస్తుంది. అదే విధంగా, శరీరంలో వేడిని కంట్రోల్ చేసే ఆహారాలను తీసుకోవడం చాలా అవసరం.

కాబట్టి, మహిళ కొత్తగా తల్లైన తర్వాత గైనకాలజిస్ట్ ను సంప్రదించి ఎలాంటి ఆహారాలను తినాలి, ఎలాంటి ఆహారాలను తినడకూడదని అడిగి తెలుసుకోవడం మంచిది. అంతకు ముందే కొన్ని బేసిక్ ఫుడ్ ఐటమ్స్ ను లిస్ట్ అవుట్ చేసి, ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది. వీటిని రెగ్యులర్ డైట్ నుండి తొలగించుకోవడం మంచిది. ఈ క్రింది లిస్ట్ లో ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల తల్లి, బిడ్డకు సురక్షితం. గర్భం పొందిన తర్వాత తల్లి ఖచ్చితంగా తినకూడని 10 ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి

 సరిగా ఉండకని గుడ్లు:

సరిగా ఉండకని గుడ్లు:

గర్భధారణ సమయంలో గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గర్భిణీకి అవసరమయ్యే ప్రోటీనులను అందిస్తుంది. అయితే సరిగా ఉడకని గుడ్డును తినడం వల్ల సాల్మనెల్లా ఇన్ఫెక్షన్స్, ఆహారం వల్ల ఫీవర్, వికారం, వాంతులు, స్టొమక్ క్రాంప్స్ వంటి సమస్యలు ఏర్పడుతాయి. దాంతో బిడ్డకు కూడా హాని కలుగుతుంది.

అన్ ప్యాచ్యుర్డ్ మిల్క్ మరియు మిల్క్ ప్రొడక్ట్స్ :

అన్ ప్యాచ్యుర్డ్ మిల్క్ మరియు మిల్క్ ప్రొడక్ట్స్ :

బాగా కాచి చల్లార్చిన పాలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే కాల్షియం పుష్కలంగా అందుతుంది. అన్ శ్యాచురేటెడ్ మిల్క్ లేదా మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కు దారిస్తుంది..అందుకు కారణం గర్భిణీల్లో ఇమ్యూనిటిల్ లెవల్స్ తక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ బిడ్డకు కూడా పాకుతుంది.

సరిగా ఉడికించని సీఫుడ్స్ :

సరిగా ఉడికించని సీఫుడ్స్ :

సీఫుడ్స్ ను సరిగా ఉడికించకుండా, వండకుండా తీసుకోవడం వల్ల కొన్ని రకాల ప్యారాసిస్టిక్ వ్యాధుల భారీన పడాల్సి వస్తుంది. ఫీటల్ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ప్రభావం చూపుతుంది. చేపల్లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బేబీ బ్రెయిన్ డెవలప్ మెంటకు మరియు ఫీటల్ డెవలప్ మెంట్ కు సహాయపడుతుంది. కాబట్టి, మితంగా తీసుకోవాలి. బాగా ఉడికించి తీసుకోవాలి. లేదంటే వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి.

హెర్బల్ టీ:

హెర్బల్ టీ:

హెర్బల్ ప్రొడక్ట్స్ లో ఫ్లాక్స్ సీడ్స్, పెప్పర్మింట్ చమోమెలీ, గ్రీన్ టీ తాగడం వల్ల బర్త్ వెయిట్ పెరుగుతుంది. దాంతో లోబర్త్ బేబీస్ పుట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి, హెర్బల్ టీలు తీసుకోవడానికి ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే మంచిది.

మెలకలు లేదా వెజిటేబుల్స్ :

మెలకలు లేదా వెజిటేబుల్స్ :

పచ్చి కూరలతో తయారుచేసిన వెజిటేబుల్స్ తో తయారుచేసిన సలాడ్స్ తినడంలో ఎలాంటి హాని జరగదు. అయితే వీటిని తీసుకోవడం పట్ల అవగాహన కలిగి ఉండాలి. పచ్చికూరలను తీసుకునే ముందు వాటిని పూర్తిగా శుభ్రం చేసి తీసుకోవాలి. లేదంటే వాటిని పండించడానికి ఉపయోగించిన రసాయానాలు, పెస్టిసైడ్స్ ఫీటస్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి, పచ్చి కూరలుకు, ఉడికించని, లేదా వండని ఆహారాల పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

చైనీస్ ఫుడ్స్:

చైనీస్ ఫుడ్స్:

తొమ్మిదో నెల ప్రెగ్నెన్సీ సమయంలో చైనీస్ ఫుడ్స్ కు దూరంగా ఉండటమే మంచిది. చైనీస్ ఫుడ్స్ లో సోడియం కంటెంట్ అధికంగా ఉంటుంది. మోనో సోడియం గ్లూటమేట్ కూడా అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీలో ప్రీక్లాప్సియా కు దారితీస్తుంది.

అలర్జీకి కారణమయ్యే ఆహారాలు:

అలర్జీకి కారణమయ్యే ఆహారాలు:

ప్రెగ్నెన్సీలో సమయంలో వివిధ ఆహారాలను వివిధ రకాల రుచులతో తినాలనే కోరికలుంటాయి. అయితే కొన్ని ఆహారాలు అలర్జీలకు కారణమవుతాయి. కాబట్టి, వీటికి దూరంగా ఉండటం వల్ల ఫీటస్ డెవలప్ మెంట్ లో ఎలాంటి రియాక్షన్స్ కానీ, ఇతర ఆరోగ్య సమస్యలు కానీ ఉండవు.

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్:

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్:

మహిళ గర్భంతో ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తీసుకోవడం లవ్ల బేబీ మెంటల్ అండ్ ఫీటల్ హెల్త్ మీద ప్రభావం చూపుతుంది. సోడా, సాప్ట్ డ్రింక్స్ లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ను కలిపి ఉంటారు కాబట్టి, వీటికి దూరంగా ఉండటమే మంచిది.

తేనె:

తేనె:

గర్భిణీలు తేనె తినడం వల్ల కడుపులో పెరిగే ఫీటస్ కు హాని ఎక్కువ అని చాలా పరిశోదనల ద్వారా వెల్లడి చేశారు. తేనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్యారాసిస్టిక్ డిసీజ్ తో బాధపడుతారని హెచ్చరిస్తున్నారు.

తినగా మిగిలిన ఆహారాలు:

తినగా మిగిలిన ఆహారాలు:

రాత్రి తినగా మిగిలిన ఆహారాలను ఫ్రిజ్ లో పెట్టినా కూడా గర్భిణీలు ఇలాంటి ఆమారాలకు దూరంగా ఉండాలి. లెఫ్ట్ ఓవర్స్ ఫుడ్స్ మీద ఏర్పడే బ్యాక్టీరియా తల్లి, బిడ్డలో గ్యాస్ట్రో ఇన్ టెన్సినల్ ఇన్ఫెక్షన్స్ కు కారణమవుతుంది.

English summary

10 foods that are a complete no-no during pregnancy

A lot of emphases is placed on a woman’s diet when she is pregnant. But less is talked about foods that she should stay away from during pregnancy. Some foods, although healthy, can do you and your baby harm in more than one way. So, here is the list of foods that you should beware of during your pregnancy
Story first published: Tuesday, November 8, 2016, 18:14 [IST]