For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలలో గ్యాస్ లేదా గ్యాస్టిక్ సమస్యను నివారించడానికి 7 ఎఫెక్టివ్ టిప్స్ ..!

గర్భిణీలలో గ్యాస్ట్రిక్ సమస్య సహజం. ప్రతి గర్భిణీ ఈసమస్యను ఎదుర్కుంటుంది. కాబట్టి, దీని గురించి భయపడాల్సి పనిలేదు. గ్యాస్ట్రిక్ సమస్యతో పాటు,ప్రేగుల్లో నొప్పి, క్రాంపింగ్, పొట్ట ఉదరంలో నొప్పి ఉంటుంది

By Super Admin
|

గ్యాస్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యను సాధారణ వ్యక్తులు మాత్రమే కాదు, గర్భిణీలలో కూడా ఎక్కువగా ఉంటుంది. గర్భిణీల శరీరంలో జరిగి మార్పుల వల్ల , హార్మోనుల ప్రభావం వల్ల సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. గర్భం పొందిన తర్వాత నెలల నిండే కొద్ది, గ్యాస్, కడుపుబ్బరం, బ్లీచింగ్, త్రేన్సులు, పొట్టలో అసౌకర్యం వంటి లక్షణాలు కనబడుతాయి . అసౌకర్యంగా ఉండటం మాత్రమే కాదు, గ్యాస్ సమస్య అసహ్యంగాకూడా ఉంటుంది.

గర్భధారణ సమయంలో గ్యాస్టిక్ నార్మల్ సమస్యా..?

గర్భిణీలలో గ్యాస్ట్రిక్ సమస్య సహజం. ప్రతి గర్భిణీ ఈసమస్యను ఎదుర్కుంటుంది. కాబట్టి, దీని గురించి భయపడాల్సి పనిలేదు . గ్యాస్ట్రిక్ సమస్యతో పాటు, ప్రేగుల్లో నొప్పి, క్రాంపింగ్ , పొట్ట ఉదరంలో నొప్పి వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ను కలవాలి

అలాగే, గ్యాస్టిక్ లేదా గ్యాస్ సమస్యతో పాటు, డయోరియా లేదా మోషన్ లో బ్లడ్ పడటం గమనించినట్లైతే, ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి. మిగిలిన లక్షణాలన్నీ కూడా గర్భిణీలల్లో సహజంగా తీసుకున్నా, డయోరియా, బ్లడ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం తల్లి ఆరోగ్యానికి చాలా మంచిది.

గర్భిణీల్లో గ్యాస్ కు కారణాలేంటి:

గర్భధారణ సమయంలో గర్భిణీల్లో గ్యాస్ కు కారణం , గర్భధారణ సమయంలో గర్భిణీలో అనేక హార్మోనుల మార్పుల వల్ల గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ గ్యాస్ ను ఎక్కువగా పెంచుతుంది.

7 Effective Tips To Get Relief From 'Gas Problem' During Pregnancy

ఈ హార్మోనులు గ్యాస్ట్రోనోమికల్ ట్రాక్ లో మజిల్ టిష్యులను తొలగించడం వల్ల జీర్ణశక్తి తగ్గి, పొట్టలో గ్యాస్ పెరుగుతుంది.ఇంకా పొట్టలే బేబీ పెరిగే కొద్ది, ఆ బరువు డైజెస్టివ్ ట్రాక్ట్ మీద పడటం వల్ల జీర్ణశక్తి మీద ప్రభావం చూపుతుంది . ప్రసవం దగ్గర పడే కొద్ది యూట్రస్ పొట్టపైభాగం వైపు పెరగడం వల్ల గర్భిణీలో ఎప్పుడూ గ్యాస్ సమస్యతో బాధపడుతుంటారు .

గర్భిణీలు గ్యాస్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యను నివారించుకోవడం ఎలా?

గర్భధారణ సమయంలో గ్యాస్ సమస్య సహజం, దీన్ని నుండి ఎవరూ తప్పించుకోలేరు. అలాగని పూర్తిగా నయం చేసుకోలేరు. అయితే ఈక్రింది సూచించిన కొన్ని సింపుల్ టిప్స్ ను ఫాలో అవ్వడం వల్ల గ్యాస్ నుండి కొంత రిలీఫ్ పొందవచ్చు..

భోజనం:

భోజనం:

రోజులో రెండు సార్లు హెవీ మీల్స్ తీసుకునేటప్పుడు, రెండు సార్లు తీసుకునే ఆహారం నాలుగు సార్లుగా తినేవిధంగా మార్చుకోవాలి, ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా,కొద్దికొద్దిగా అయినా ఎక్కువ సార్లు తినాలి. రోజులో ఇలా నాలుగైదు సార్లు తినడం వల్ల డైజెస్టివ్ స్టిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటుంది.

ఆహారం అలాగే మింగకుండా నమిలి తినాలి:

ఆహారం అలాగే మింగకుండా నమిలి తినాలి:

ఆహారం తినే విధానం కూడా ముఖ్యమే, తినే ఆహారం బాగా నమిలి మింగడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద ప్రెజర్ తగ్గుతుంది. భోజనం చేసే సమయంలో మాట్లాడటం తగ్గించాలి. ఇలా చేయడం వల్ల ఆహారంతో పాటు గాలి పొట్టలోకి ఎక్కువ చేరకుండా ఉంటుంది. అలాగే భోజనం చేసే సమయంలో ఎక్కువ నీళ్ళు తాగకూడదు. భోజనానికి 10 నిముషాలు ముందు , భోజనం చేసిన 10 నిముషాల తర్వాత ఒక గ్లాసు నీళ్ళు తాగాలి.

 ఫుడ్ ను మెయింటైన్ చేయాలి:

ఫుడ్ ను మెయింటైన్ చేయాలి:

కొన్ని రకాల ఆహారాలు గ్యాస్ కు కారణమవుతాయి. రెగ్యులర్ గా తినే ఆహారాలే అయినా, గర్భిణీలో గ్యాస్ కు కారణమవుతాయి. కాబట్టి, ఇటువంటి ఆహారాలు తిన్నప్పుడు, 6 గంటలు తర్వాత గ్యాస్ సమస్య ఉన్నట్లైతే అటువంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది.

ప్రాబ్లమాటిక్ ఫుడ్స్ :

ప్రాబ్లమాటిక్ ఫుడ్స్ :

కొన్ని ఆహారాలు గ్యాస్ ను ఉత్పత్తి చేస్తాయి. అటువంటి ఆహారాలు మీద అవగాహన కలిగి ఉండాలి. బీన్స్, క్యాబేజ్, కాలీఫ్లవర్, పాలు, ఇతర డైరీ ప్రొడక్ట్స్ , బ్రొకోలీ, ఆపిల్స్ వంటివి గ్యాస్ట్రిక్ కు కారణమవుతాయి. వీటిని తిని గ్యాస్ సమస్య లేకుండా జీర్ణించుకునే శక్తి ఉన్నప్పుడు , నిర్భయంగా వీటిని తినొచ్చు.

నడక:

నడక:

గర్బధారణ సమయంలో ఇంటికే పరిమితం కాకుండా, కూర్చొని ఉండకూడదు. ఉదయం , సాయంత్రాల్లో చిన్న పాటి, నడక, కొన్ని సింపుల్ వ్యాయామాలు చేయడం చాలా అవసరం. ఇలా చేయడం వల్ల శరీరంలో జీర్ణ శక్తి పెరుగుతుంది .గ్యాస్ ను నివారిస్తుంది.

 గర్భిణీలకు యోగా సహాయపడుతుంది:

గర్భిణీలకు యోగా సహాయపడుతుంది:

యోగ పురతాన కాలం నుండి ఉండే ఒక శారీరక వ్యాయామం. యోగాలో ఉండే వివిధ రకాల భంగిమలు, శరీరంలో జీర్ణశక్తిని పెంచుతుంది. అయితే యోగా చేయాలనుకునే వారు నిపుణుల పర్యవేక్షణలో చేయడం మంచిది.

 మెడిసిన్స్, డ్రగ్స్ :

మెడిసిన్స్, డ్రగ్స్ :

గర్భిణీలు గ్యాస్ సమస్యను తగ్గించుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నించినా, సమస్య తగ్గకపోతే, డాక్టర్ లేదా హెల్త్ ప్రాక్టీసనర్ ను కలవాలి. వీరు మీ సమస్యను సున్నితంగా పరిష్కరించి , ఎఫెక్టివ్ రెమెడీస్ ను సూచిస్తారు .

English summary

7 Effective Tips To Get Relief From 'Gas Problem' During Pregnancy

The tendency of having gas problem increases when you are pregnant. You might often find yourself with the uneasy bloating, belching, burping along with miserable sensations in your stomach. Apart from being uncomfortable, it is embarrassing also.
Story first published: Thursday, October 20, 2016, 17:21 [IST]
Desktop Bottom Promotion