For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భదారణ సమయంలో ఆందోళన తగ్గించే సింపుల్ టిప్స్

By Swathi
|

కన్సీవ్ అయిన తర్వాత ఆనందంగా ఉన్నప్పటికీ శరీరంలో జరిగే మార్పులు, మానసికంగా ఎదురయ్యే సమస్యలు.. కాబోయే తల్లులకు చాలా ఇబ్బందికరంగా మారతాయి. తొమ్మిది నెలలు.. రకరకాల అనారోగ్య సమస్యలు, రకరకాల ఎమోషన్స్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. వాటన్నింటికీ హెల్తీగా ఎదుర్కోవడం చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది.

చాలా సాధారణంగా ఎదురయ్యే సమస్యల్లో ఆందోళన ఒకటి. కడుపులోని బిడ్డ ఆరోగ్యం, వాళ్లను ఈ ప్రపంచానికి తీసుకొచ్చే సమయంలో.. చాలా ఆందోళనకు గురవుతారు. చాలా వరకు గర్భిణీ స్త్రీలందరూ మానసిక ఒత్తిడికి లోనవుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల దుష్ర్పభావాలు ఎదురయ్యే అవకాశాలున్నాయంటున్నారు.

ముఖ్యంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. హార్మోనల్ చేంజెస్ వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గర్భధారణ సమయంలో ఆందోళన మంచిది కాదు. దీనివల్ల అబార్షన్, ప్రీమెచ్యూర్ బర్త్ అయ్యే చాన్స్ లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురయ్యే ఆందోళన తగ్గించుకునే సింపుల్ టిప్స్ మీకోసం..

లక్షణాలు

లక్షణాలు

గర్భధారణ సమయంలో మీరు ఆందోళనకు గురవుతున్నారని గుర్తించిన వెంటనే.. మీ భాగస్వామికి లేదా కుటుంబ సభ్యులకు చెప్పాలి. దీనివల్ల వాళ్లు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని ఆందోళన నుంచి బయటపడేలా చేస్తారు.

డైరీ

డైరీ

మీకు వస్తున్న ఆలోచనలను డైరీలో రాసుకోండి. మీ ఫీలింగ్స్ ని డైరీలో రాయడం వల్ల.. చాలా రిలాక్స్ గా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

వ్యాయామం

వ్యాయామం

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుంది. అయితే వ్యాయామానికి ముందు డాక్టర్ ని సంప్రదించాలి. వ్యాయామం వల్ల హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి. ఎండోర్ఫిన్స్ రిలీజ్ అయి.. మీ మూడ్ ని ఇంప్రూవ్ చేస్తాయి.

బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు

బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు

బ్రీతింగ్ టెక్నిక్స్, యోగా, ధ్యానం చేయడం వల్ల చాలా రిలాక్స్ గా ఉంటుంది. దీనికి కనీసం 30 నిమిషాలు ప్రతిరోజూ కేటాయించాలి. బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ ల వల్ల కండరాలు, నరాలు రిలాక్స్ అవుతాయి.

రెస్ట్

రెస్ట్

సెకండ్ ట్రైమ్ స్టర్ తర్వాత విశ్రాంతి చాలా అవసరం. మీ బెల్లీ సైజ్ పెరుగుతుంది కాబట్టి.. మీ బేబీ హెల్తీగా ఉండాలంటే.. ఎనర్జీ చాలా కావాలి. సరిగ్గా విశ్రాంతి తీసుకోకపోతే.. అలసట, ఆందోళన తగ్గుతుంది.

అలవాట్లు

అలవాట్లు

ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని అలవాట్లు.. ఉదాహరణకు డ్రాయింగ్, పెయింటింగ్, సింగింగ్ వంటి అలవాట్లు చాలా రిలాక్సేషన్ ని ఇస్తాయి. ఇలాంటి అలవాట్లు రోజూ ఫాలో అయితే.. ఆందోళన తగ్గుతుంది.

నిపుణుల సలహా

నిపుణుల సలహా

ఆందోళన మరీ ఎక్కువ అయితే డాక్టర్ల సలహా తీసుకోండి. డిప్రెషన్, ఆందోళన నుంచి బయటపడటానికి వాళ్ల సలహా ప్రకారం నడుచుకోండి.

English summary

7 Tips To Control Anxiety During Pregnancy

7 Tips To Control Anxiety During Pregnancy. In addition, anxiety and stress during pregnancy can also lead to premature births and miscarriages, in extreme cases.
Story first published: Thursday, June 2, 2016, 9:59 [IST]
Desktop Bottom Promotion