For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యాన్నిచ్చే ఖర్జూరం..

గర్భం పొందిన మహిళల్లో వివిధ ఆహారాల మీద కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా గర్భం పొందాలని ప్లాన్ చేసుకునే వారిలో కూడా ఈ కోరికలు ఎక్కువగానే ఉంటాయి. ఇది నిజమైతే గర్భిణీలు, లేదా కాబోయే గర్భిణీలు ఎలాంటి ఆహారాలు

By Lekhaka
|

గర్భం పొందిన మహిళల్లో వివిధ ఆహారాల మీద కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా గర్భం పొందాలని ప్లాన్ చేసుకునే వారిలో కూడా ఈ కోరికలు ఎక్కువగానే ఉంటాయి. ఇది నిజమైతే గర్భిణీలు, లేదా కాబోయే గర్భిణీలు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలని తెలుసుకోవడం మంచిది. తల్ల , బిడ్డకు ఉపయోగపడే ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంపిక చేసుకోవడం మంచిది. అటువంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో డేట్స్(ఖర్జూరాలు)ఒకటి.

గర్భిణీ తీసుకునే ఆహారాల్లో ఖర్జూరం ఒకటి. గర్భధారణలో వీటిని తినడం వల్ల తల్లికి, బిడ్డకు అవసరమయ్యే న్యూట్రీషియన్స్ అధికంగా పొందుతారు . ఖర్జూరాలను తినడం మంచిదా , కాదా అని మీకు అపోహ ఉంటే డాక్టర్ ను కలిసి,ఆ తర్వాత తినండి. అలాగే ఖర్జూరాలను గర్భిణీలు తినేటప్పుడు వాటిలో అనుకూల , ప్రతికూల విషయాలను తెలుసుకుని ఉండటం మంచిది . దాంతో అవసరమైతేనె ఎంపిక చేసుకోవచ్చు.

గర్భధారణలో డేట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అని తెలుసుకోవడానికి ఈ క్రింది ఒక న్యూట్రీషియన్ చార్ట్ ను గమనించండి..

రోజూ 100గ్రాముల డేట్స్ తినడం వల్ల గర్భిణీ స్త్రీ పొందే న్యూట్రీషియన్ వాల్యూస్ :Energy 282 Kcal

ప్రోటీన్స్ 2.5 g

ఫైబర్ 8 g

ఫ్యాట్ 0.4 g

ఫొల్లెట్ 19 mu gs

ఐరన్ 1.09 mg

విటమిన్ కె 2.7 mu g

మెగ్నీషియం 43 mg

పొటాషియం 656 mg

గర్భిణీలు డేట్స్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని పరిశోధనల ద్వారా కూడా నిర్ధారించారు. వాటిలో న్యూట్రీషియన్స్ అధికంగా ఉండటం వల్ల తల్లి, బిడ్డకు సురక్షితమైనది. ఖర్జూరంలో ప్రోటీన్స్, ఫైబర్, మరియు విటమిన్స్ అధికంగా ఉన్నాయి. ఫ్యాట్ తక్కువ. వీటిలో సోలబుల్ మరియు ఇన్ సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంది. ఇది జీర్ణశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వీటిలో నేచురల్ షుగర్ అధికంగా ఉన్నాయి. పొటాషియం అధికంగా ఉంది, లోసోడియం, నాడీవ్యవస్థను క్రమబద్దం చేస్తుంది. ఖర్జూరం తినడం వల్ల గర్భిణీ పొందే ముఖ్యమైన ప్రయోజనాలు..

నేచురల్ షుగర్స్:

నేచురల్ షుగర్స్:

గర్భిణీ డేట్స్ తినడం వల్ల నేచురల్ షుగర్స్ త్వరగా ఎనర్జీని అందిస్తాయి.

 ప్రోటీన్:

ప్రోటీన్:

ప్రోటీన్స్ లో అమినోయాసిడ్స్ అధికంగా ఉంటాయి, బేబీ పెరుగుదలకు సహాపడుతుంది. బేబీకి ప్రోటీనులు ఎక్కువ అవసరమవుతాయి.

ఫైబర్:

ఫైబర్:

జీర్ణ శక్తిని పెంచే ఫైబర్ అధికంగా ఉంటుంది. దాంతో గర్బధారణ సమయంలో మలబద్దక సమస్యలను నివారించుకోవచ్చు.

ఫొల్లెట్:

ఫొల్లెట్:

డేట్స్ లో ఉండే ఫొల్లెట్, ఫోలిక్ యాసిడ్ శరీరంలో కొత్త కణాల ఏర్పాటుకు, అనీమియా నివారణకు సహాయపడుతాయి.

విటమిన్ కె:

విటమిన్ కె:

ఖర్జూరంలో ఉండే విటమిన్ కె బ్లడ్ క్లాంట్ కాకుండా, బోన్స్ స్ట్రాంగ్ గా ఉండేందుకు సహాయపడుతుంది. పిల్లలు విటమిక్ కె లోపంతో పుడుతుంటారు, కాబట్టి, గర్భిణీలకు ఇవి చాలా అత్యవసరం.

ఐరన్:

ఐరన్:

శరీరంలో జీవక్రియలన్నీ సరిగా పనిచేయాలంటే ఐరన్ అత్యవసరం.ఐరన్ ఆక్సిజన్ తయారుచేసి, రక్తకణాలన్నింటికి సరఫరాచేస్తుంది. అలాగే కొన్ని ఎంజైమ్ ల ఉత్పత్తికి సహాయపడుతుంది. దాంతో తల్లి బిడ్డలో అనీమియా సమస్య ఉండదు, వ్యాధినిరోధకశక్తి బలంగా ఉంటుంది.

పొటాషియం:

పొటాషియం:

శరీరానికి అత్యవసరమైన ఎలక్ట్రోలైట్ ఇది. ఇది బ్లడ్ ప్రెజర్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. . హార్ట్ హెల్త్ ను సహాయపడుతుంది, జీర్ణక్రియను మరియు మజిల్ ఫంక్షనింగ్ కు సహాయపడుతుంది.

 మెగ్నీషియం:

మెగ్నీషియం:

రక్త కణాలకు క్యాల్షియం, ఐరన్, పొటాషియంను సప్లై చేయడంలో మెగ్నీషియం గ్రేట్ గా సహాయపడుతుంది. హార్ట్ బీట్ ను నార్మల్ గా ఉంచుతుంది. దంతాలు, బోన్స్ బేబీలో గ్రోత్ కు సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది

English summary

8 Surprising Benefits Of Dates During Pregnancy

We have compiled an easy guide for you to decide whether it is good to consume dates during pregnancy or not.
Desktop Bottom Promotion