For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలలో స్ట్రెస్ మరియు డిప్రెషన్ తగ్గించే సింపుల్ టిప్స్

|

మహిళలు గర్భం పొందినప్పుడు శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అందుకు ముఖ్యకారణం హార్మోనులు. హార్మోనుల ప్రభావంతో గర్భిణీలు తరచూ అలజడి, ఆందోళన మరియు డిప్రెషన్ కు గురి అవుతుంటారు. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డ గురించి మరియు ఆమె ఆరోగ్యం గురించి తరచూ ఆందోళన చెందుతుంటాయి.

గర్భి పొందిన తర్వాత ఆమెకు అంతా కొత్తగా అనిపించడం. ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ లో మార్పుల వల్ల బేబీతో పాటు, తల్లిలో కూడా కొన్ని మార్పులు జరుగుతుంటాయి.

అయితే ఈ మార్పులనేటివి ఒక్కొక్కో గర్భిణీ స్త్రీలో ఒక్కో విధంగా ఉంటాయి. కొంత మందికి ప్రెగ్నెన్సీ సమయంలో సంతోషంగా ఉంటారు. ఇదంతా హార్మోనుల మీదే ఆధారపడి ఉంటుంది. శరీరంలో విడుదలయ్యే హార్మోనుల ప్రభావాన్ని బట్టి మూడ్ వివిధ రకాలుగా మారుతుంటుంది. కొంత మంది సంతోషంగా ఉంటే. కొంత మందిలో తరచూ మూడ్ మారుతుంటుంది. బాధగా మరియు డిప్రెషన్ కు గురి అవుతుంటారు.

గర్భధారణ సమయంలో చాలా మంది గర్భిణీలు డిప్రెషన్ కు గురి అవుతుంటారు . కాబట్టి, గర్భధారణ సమయంలో స్ట్రెస్ తగ్గించుకోవాలి. గర్భిణీ స్త్రీలు డిప్రెషన్ తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

గర్భధారణ సమయంలో భయానికి గురిచేసే ప్రెగ్నెన్సీ స్టోరీస్ వినకండి:

గర్భధారణ సమయంలో భయానికి గురిచేసే ప్రెగ్నెన్సీ స్టోరీస్ వినకండి:

గర్భాధారణ సమయంలో ఇతరు విషయంలో జరిగిన ఫైటింగ్స్, గర్భధారణ , ప్రసవంలో భయంకర విషయాలను ఎవరైన చెప్పడానికి ప్రయత్నిస్తే వాటిని వినకుండా అవాయిడ్ చేయాలి. ఇటువంటి విషయాలు ,గర్భిణీలో భయాన్ని నింపుతుంది మరియు నెగటివిటికి దారితీస్తుంది. కాబట్టి, గర్భిణీలు ఎప్పుడూ పాజిటివ్ విషయాలను తెలుసుకుంటూ, పాజిటివ్ గా ఆలోచిస్తూ, పాజిటివ్ గా ఉండాలి.

షాపింగ్

షాపింగ్

గర్భధారణ సమయంలో నెలల నిండే కొద్ది దుస్తుల సైజ్ మార్చుతుండాలి. పాత బట్టలను వేసుకోవడం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు షాపింగ్ చేయడం వల్ల మనస్సుకు కొంత రిలాక్సేసన్ మరియు సౌకర్యవంతమైన దుస్తులను ధరించవచ్చు .

 పాదాలను ఎత్తులో ఉంచుకోవాలి:

పాదాలను ఎత్తులో ఉంచుకోవాలి:

గర్భిణీ స్త్రీలలో తరచూ పాదాలు వాస్తుంటాయి. కాబట్టి, పాదాలను కొద్దిగా ఎత్తులో ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవడం వల్ల పాదాల వాపులను తగ్గించడంతో పాటు, స్ట్రెస్ తగ్గుతుంది. మరియు రిఫ్రెష్ అవుతుంది.

 గర్భధారణ సమయంలో అప్పుడప్పుడు కునుకు తియ్యాలి:

గర్భధారణ సమయంలో అప్పుడప్పుడు కునుకు తియ్యాలి:

కునుకు తియ్యడం వల్ల స్ట్రెస్ లేకుండా ఫీలవుతారు, మూడు మారుతుంది. రిలీఫ్ గా పీలవుతారు. ఇరిటేషన్ ఉండదు . భోజనం తిన్న తర్వాత చిన్నపాటి కునుకు తియ్యడం గర్భిణీ ఆరోగ్యానికి మంచిది.

 వాకింగ్:

వాకింగ్:

షాపింగ్ మాల్, పార్క్ వంటి ప్రదేశంలో చిన్న పాటి నడక ఆరోగ్యానికెంతో సురక్షితం . నడక వల్ల మూడ్ లో మార్పు వస్తుంది. మీకు నచ్చిన వ్యక్తులతో వాకింగ్ వెల్లడం మనస్సు రిలాక్స్ అవుతుంది. స్ట్రెస్ తగ్గుతుంది.

పిల్లలతో ఆడుకోవాలి:

పిల్లలతో ఆడుకోవాలి:

ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ చాలా యాక్సైటీగా ఉంటారు. గర్భధారణ సమయంలో డిప్రెషన్ తగ్గించుకోవడానికి పిల్లలతో కొంత సమయం గడం మంచి మార్గం . చిన్నపిల్లలు స్ట్రెస్ బూస్టర్స్.

స్ట్రెచ్చింగ్:

స్ట్రెచ్చింగ్:

గర్భిణీలు, హెవీగా కాకుండా, చిన్నపాటి స్ట్రెచెస్ మరియు వ్యాయామాలు చేయడం వల్ల రిలాక్స్డ్ గా ఫీలవుతారు. డాక్టర్ ను కలిగి గర్భధారణకు సంబంధించిన వ్యాయామాలను తెలుసుకోవాలి.

English summary

Best And Simple Tips To Avoid Stress And Depression In Pregnancy

Anxiety and depression during pregnancy are common things, as the new mother may have certain concerns regarding the baby's and her health. She may be a bit scared and confused, as it is all new for her. Pregnancy hormones also play a role in making a mom feel and behave out of the usual way.
Story first published: Wednesday, July 20, 2016, 10:51 [IST]
Desktop Bottom Promotion