For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ మహిళలు మునగకాయ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు ..!

గర్భిణీలు మునగకాయ తినడం సురక్షితమా కాదా అన్నసందేహం కూడా ఉంటుంది . ఎందుకంటే ఇది శరీరంలో వేడి పుట్టిస్తుంది కాబట్టి, తల్లి బిడ్డకు సురక్షితమా కాదా అని ఆలోచించేవారు చాలా మందే ఉంటారు . ఈ సందేహం మీకు కూడా

By Super Admin
|

ఆరోగ్యకరమైన కూరగాయల్లో మునగకాయ లేదా మునక్కాడ ఒకటి. మునక్కాడతో తయారుచేసే సాంబార్, సూప్, కర్రీ, వేపుడు ఏవైనా సరే అద్భుతమైన రుచి కలిగి ఉంటాయి . మహిళలు గర్భంతో ఉన్నప్పుడు, ఆహారాల మీద కోరికలను కంట్రోల్ చేసుకోలేరు . ఎప్పుడూ తినని ఆహారాల మీద కూడా కోరికలు కలుగుతాయి. మునకాడల ములుసు, సూప్ వంటి వాటి మీద మనస్సు పారేసుకోవచ్చు.

అయితే గర్భిణీలు మునగకాయ తినడం సురక్షితమా కాదా అన్నసందేహం కూడా ఉంటుంది . ఎందుకంటే ఇది శరీరంలో వేడి పుట్టిస్తుంది కాబట్టి, తల్లి బిడ్డకు సురక్షితమా కాదా అని ఆలోచించేవారు చాలా మందే ఉంటారు . ఈ సందేహం మీకు కూడా ఉందా..? ఐతే ఆలస్యం చేయకుండా మునక్కాయ గురించి తెలుసుకుందాం...

మునగకాయ, మునగాకు బాగా పాపులరైన గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, వీటిలో అనేక ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల వీటిని పురాతన కాలం నుండి వంటల్లో ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నారు. అనేక ఔషధ గుణాలు ఉండటం వల్లే సాధారణ వ్యక్తులతో పాటు, గర్భిణీలు కూడా వీటిని తీసుకోవచ్చని పోషకాహర నిపుణులు సూచిస్తున్నారు .

8 Health Benefits Of Drumstick In Pregnancy

అయితే శరీరంలో వేడికలిగించే స్వభావం ఉండటం వల్ల మితంగా తీసుకోవడం మంచిది. అలాగే ఏ కూరగాయలైనా వండటానికి ముందు శుభ్రం కడిగి తరవ్ాత ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి హానికరమైన పారాసైట్స్ , బ్యాక్టీరియా, క్రిమిసంహారక మందుల ప్రభావం ఉండదు. ఇవి గర్భిణీలకు హాని కలిగిస్తాయి కాబట్టి, వండటానికి ముందు బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఉపయోగించాలి.

మునక్కాడలో అనేక ఆరోగ్య ప్రయోజనాలుండటం వల్ల వీటిని గర్భిలు తినడం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో వారికి కావల్సిన క్యాల్షియం పుష్కలంగా అందుతుంది. బాడీ ఫిట్ గా ఉంటుంది. వీటితో పాటు గర్భిణీలు మునక్కాయ తినడం వల్ల పొందే మరికొన్ని కామన్ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం...

1. సుఖ ప్రసవం:

1. సుఖ ప్రసవం:

ప్రసవం సురక్షితం చేస్తుంది: మునక్కాయను గర్భిణీల రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది యుటేరియన్ కాంట్రాక్షన్ మెకానిజం సపోర్ట్ చే్తుంది. ప్రసవంలో నొప్పులను తగ్గించి సుఖ ప్రసవానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ప్రసవం తర్వాత , ప్రసవానికి ముందు రక్తస్రావం కాకుండా నివారిస్తుంది.

2. మార్నింగ్ సిక్ నెస్ తగ్గిస్తుంది:

2. మార్నింగ్ సిక్ నెస్ తగ్గిస్తుంది:

గర్భిణీలు ఉదయం లేవగానే వికారం, వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది. ఇటువంటి లక్షణాలను నివారించడంలో , రోజంగా ఫ్రెష్ గా యాక్టివ్ గా ఉండేట్లు చేయడంలో సహాయపడుతుంది. తలతిరుగుడు, మార్నింగ్ సిక్ నెస్ కు సంబంధించిన ఇతర లక్షణాలను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

3. బోన్స్ హెల్తీగా మార్చుతుంది:

3. బోన్స్ హెల్తీగా మార్చుతుంది:

మునగకాయలో ఉండే క్యాల్షియం, ఐరన్, విటమిన్ కంటెంట్ తల్లిలో ఎముకలను ఆరోగ్యంగా , స్ట్రాంగ్ గా ఉంచుతుంది. ఇంకా,మునక్కాడలు నేచురల్ బ్లడ్ ఫ్యూరిఫైయర్ గా పనిచేస్తుంది. మునక్కాడల ఆకులు కొద్దిగా తీసుకుని పేస్ట్ చేసి పాలలో కలిపి తాగడం వల్ల మరిన్ని గ్రేట్ బెనిఫిట్స్ పొందవచ్చు .

4. హానికరమైన ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

4. హానికరమైన ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

మునక్కడాల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి గొంతు, చర్మం, చెస్ట్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇంకా ఈ వెజిటేబుల్ ను ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు . మునగ ఆకుతో పాటు, పువ్వులను కూడా సూప్స్, ఫ్రైలో ఉపయోగించడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.

5. పొట్ట సమస్యలను నివారిస్తుంది:

5. పొట్ట సమస్యలను నివారిస్తుంది:

మునగాకులో ఉండే ఔషధ గుణాలు పొట్ట సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో వచ్చే డయోరియా, కలరా, డీసెంట్రీ , జాండీస్ వంటి సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

6. డయాబెటిస్ ను రెగ్యులేట్ చేస్తుంది:

6. డయాబెటిస్ ను రెగ్యులేట్ చేస్తుంది:

మునగాకు తినడం వల్ల గర్భిణీ స్త్రీలలో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది. కాబట్టి, గర్భిణీల డైట్ లో మునగాకు, మునక్కాడలు చేర్చుకోవచ్చు. డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే మునగాకును గర్భిణీలు తినడం వల్ల గాల్ బ్లాడర్ పనితీరును మెరగుపరుస్తుంది.

7. వ్యాధి నిరోధకత పెంచుతుంది:

7. వ్యాధి నిరోధకత పెంచుతుంది:

మునక్కాడలు, మునగాకులో విటమిన్ ఎలు పుష్కలంగా ఉన్నాయి. 100గ్రాముల ఫ్రెష్ లీవ్స్ లో 252 శాతం న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది. అంతే కాదు, మునగాకు చాలా ఎఫెక్టివ్ ఫ్యాట్ ను కరిగిస్తుంది. శరీరంలో సెల్స్, టిష్యుల డ్యామేజ్ ను నివారిస్తుంది. మ్యూకస్ మెంబరెన్స్ నివారిస్తుంది. కంటి చూపు మెరుగుపరుస్తుంది, స్కిన్ క్వాలిటి పెంచుతుంది. ఇమ్యూనిటి మెరుగుపరుస్తుంది.

8. హీమోగ్లోబిన్ కౌట్ పెంచుతుంది:

8. హీమోగ్లోబిన్ కౌట్ పెంచుతుంది:

మునగకాడలో ఉండే ఐరన్ కంటెంట్ హీమోగ్లోబిన్ కౌంట్ పెంచుతుంది. ఈ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ తినడం వల్ల అనీమియా మరియు ఇతర సమస్యలను తగ్గించుకోవచు. అలసటను నివారించుకోవచ్చు.

English summary

8 Health Benefits Of Drumstick In Pregnancy

Not many people can resist some yummy drumsticks or some delicious drumstick soup. And when you are pregnant, your uncontrollable food cravings might leave you salivating at the thought of drumstick soup. However, you need to know that you can safely eat drumsticks while you are expecting.
Story first published: Thursday, October 20, 2016, 15:21 [IST]
Desktop Bottom Promotion