For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు బీట్ రూట్ ఖచ్చితంగా తినడానికి ఫర్ఫెక్ట్ రీజన్స్

గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది కూడా. అంతే కాదు తల్లి, బిడ్డకు ఉపయోగపడే ఎన్నో రకాల న్యూట్రీషియన్స్ ప్రోటీన్స్ బీట్ రూట్ లో ఉన్నాయి.

By Lekhaka
|

రెడ్ బ్లడ్ బీట్ రూట్ కి ఇది ఒక మంచి సీజన్. బీట్ రూట్ ను చాలా తక్కువగా వినియోగిస్తారు. కారణం దాని ఆకారం, రంగు రుచి. అయితే, బీట్ రూట్ అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగినటువంటి హెల్తీ వెజిటేబుల్ ఇది. బీట్ రూట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాల పొందవచ్చు.

వీటిల్లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్‌రూట్‌ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది కూడా. అంతే కాదు తల్లి, బిడ్డకు ఉపయోగపడే ఎన్నో రకాల న్యూట్రీషియన్స్ ప్రోటీన్స్ బీట్ రూట్ లో ఉన్నాయి. మరి గర్భిణీలు బీట్ రూట్ తినడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ టిప్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

బర్త్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది :

బర్త్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది :

బీట్ రూట్ లో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది, ఇది బిడ్డ పెరుగుదలకు సహాయపడుతుంది. మరియు ఇది రెడ్ బ్లడ్ సెల్స్ పెరగడానికి సహాయపడుతుంది.

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

వ్యాధినిరోధకతను పెంచుతుంది:

గర్భిణీ స్త్రీలకు ఇమ్యూనిటి పవర్ ఎక్కువగా అవసరం అవుతుంది. అది బీట్ రూట్ నుండి అందుతుంది. వీట్ రూట్ లో పొటాసియం, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ అనే రకాల వ్యాధులను ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి అవసరమయ్యే ఇమ్యూనిటిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఓస్టిరియో ఫోసిస్ నివారిస్తుంది:

ఓస్టిరియో ఫోసిస్ నివారిస్తుంది:

గర్బిణీలు బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల ఓస్టిరియోఫోసిస్ సమస్యను నివారిస్తుంది. ఇందులో ఉండే క్యాల్షియం, మరియు సిలికా అందుకు గ్రేట్ గా సహాయపడుతాయి, గర్భిణీలు బీట్ రూట్ తినడం వల్ల దంతాలు, ఎముకలకు సంబంధించిన ఓస్టిరియో ఫోసిస్ ను నివారిస్తుంది.

మెటబాలిజం రేటు పెంచుతుంది:

మెటబాలిజం రేటు పెంచుతుంది:

బీట్ రూట్ లో పొటాసియం అధికంగా ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్, బ్యాలెన్స్ చేస్తుంది. మెటబాలిజం రేటు పెంచుతుంది. బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

జాయింట్ పెయిన్ వాపులను తగ్గిస్తుంది:

జాయింట్ పెయిన్ వాపులను తగ్గిస్తుంది:

బీట్ రూట్ లో ఉండే బీటానిన్ అనే కంటెంట్ పవర్ ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది. బీట్ రూట్ ను గర్భిణీలు తినడం వల్ల జాయింట్ పెయిన్ మరియు వాపులను తగ్గించుకోవచ్చు.

 బ్లడ్ ఫ్యూరిఫై చేస్తుంది:

బ్లడ్ ఫ్యూరిఫై చేస్తుంది:

ఈ న్యూట్రీషియన్ వెజిటేబుల్లో బ్లడ్ ఫ్యూరిఫై చేసే శక్తి కలిగి ఉంటుంది. ఇది పుట్టబోయే బిడ్డలో ఎలాంటి లోపాలు లేకుండా రక్షణ కల్పిస్తుంది. బీట్ రూట్ ఫిజికల్ స్టామినా పెంచుతుంది. డెలివరీ సమయంలో సహాయపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్, విటమిన్ ఎ, బి, సోలబుల్ ఫైబర్ మరియు ఫ్రోటీన్స్ అధికంగా ఉంటాయి. బ్లడ్ పెజర్ తగ్గిస్తుంది.

అనీమియా నివారిస్తుంది:

అనీమియా నివారిస్తుంది:

గర్భం పొందిన తర్వాత ప్రతి గర్భిణీ స్త్రీ కి ఐరన్ తప్పనిసరిగా అవసరమవుతుంది. గర్భధారణ సమయంలో చాలా అవసరం. రక్తంలో హీమోగ్లోబిన్ కౌంట్ పెంచడానికి సహాయపడుతుంది. గర్భిణీలు దీన్ని తినడం వల్ల రక్తంలో ఐరన్ కౌంట్ పెరుగుతుంది. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల అనీమియాకు గురికాకుండా ఉంటారు.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది:

బీట్ రూట్ లో ఉండే గ్లిజమిక్ ఇండెక్స్ కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. గర్భిణీలు బీట్ రూట్ తినడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ క్రమబద్దంగా ఉంటాయి.

ఫీటల్ డెవలప్ మెంట్ :

ఫీటల్ డెవలప్ మెంట్ :

బీట్ రూట్ లో విటమిన్ ఎ, ఇలు అధికంగా ఉండటం వల్ల, బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల ఫీటస్ డెవలప్ మెంట్ కు సహాయపడుతుంది.

జీర్ణ శక్తిని పెంచుతుంది:

జీర్ణ శక్తిని పెంచుతుంది:

గర్భినీలు బీట్ రూట్ తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తుంది. హెల్తీ బౌల్ మూమెంట్ ను మెరుగుపుస్తుంది. మలబద్దకం నివారిస్తుంది.

లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

బీట్ రూట్ లో బీటాసి అనే న్యూట్రీషియన్ ఉంటుంది. ఇది రక్తం మరియు కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ తొలగిస్తుంది. లివర్ ఆరోగ్యంగా ఉన్నట్లైతే, గర్భిణీ స్త్రీ బాడీ ఫిట్ గా మరియు హెల్తీగా ఉంటుంది. గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలు బరువు పెరుగుతుంటారు, బీట్ రూట్ తినడం వల్ల బరువును కంట్రోల్ చేసుకోవచ్చు.

బీట్ రూట్‌ను

బీట్ రూట్‌ను

బీట్ రూట్‌ను ఇతర వెజిటేబుల్స్ తో కలిపి, ముక్కలు గా కట్ చేసి లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం గర్భిణీలకు మంచి పద్దతి. బేక్ చేసి, ఇతర వెజిటేబుల్స్ తో రోస్ట్ చేసి తీసుకోవచ్చు. ఉడికించిన వెజిటేబుల్స్ తో స్నాక్ రూపంలో తీసుకోవచ్చు. జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.ఇతర వెజిటేబుల్స్ తో కలిపి, ముక్కలు గా కట్ చేసి లేదా సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం గర్భిణీలకు మంచి పద్దతి. బేక్ చేసి, ఇతర వెజిటేబుల్స్ తో రోస్ట్ చేసి తీసుకోవచ్చు. ఉడికించిన వెజిటేబుల్స్ తో స్నాక్ రూపంలో తీసుకోవచ్చు. జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.


English summary

12 Health Benefits Of Eating Beetroot During Pregnancy

Beetroot is sweet, healthy vegetable with many medicinal properties. It acts as blood purifier and natural detoxifier for the human body. You can eat it raw or cook it up and eat it along with other vegetables. Also, drinking beetroot juice daily helps revitalize your body.
Story first published: Friday, February 10, 2017, 18:36 [IST]
Desktop Bottom Promotion