For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : గర్భిణీలు ఖచ్చితంగా తినాల్సిన 15 న్యూట్రీషియస్ ఫ్రూట్స్ ..!!

గర్భిణీలు ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు, విటమిన్స్ బేబీ డెవలప్ మెంట్ కు అవసరం అవుతాయి. పుట్టబోయే బిడ్డకు స్టాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. పండ్లలో ఉండే విటమి

|

మహిళ గర్భం పొందిన తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా గర్భిణీ తీసుకునే డైట్ లో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేట్లు చేసుకోవాలి. ఇది రెగ్యులర్ మీల్స్ లో ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల గర్బిణీ ఆరోగ్యానికి కావల్సిన విటమిన్స్, మినిరల్స్, ఫైబర్లు పుష్కలంగా అందుతాయి. పుట్టబోయే బిడ్డకు కూడా ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి.

గర్భిణీలు ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు, విటమిన్స్ బేబీ డెవలప్ మెంట్ కు అవసరం అవుతాయి. పుట్టబోయే బిడ్డకు స్టాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. పండ్లలో ఉండే విటమిన్ సి పుట్టబోయే బిడ్డలో దంతాలు, బోన్స్ ఏర్పడటానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్ పుట్టబోయే బిడ్డలో లోపాలను నివారిస్తాయి.

గర్భిణీ స్త్రీలు సీతాఫలం తింటే పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ..!!

పండ్లలో ఉండే ఫౌబర్ కంటెంట్ గర్భిణీల్లో వచ్చే మలబద్దకం మరియు హెమరాయిడ్స్ సమస్యను నివారిస్తుంది. కాబట్టి గర్భిణీలు ఖచ్చితంగా తినాల్సిన కొన్ని హెల్తీ ఫ్రూట్స్ ఈ క్రింది లిస్ట్ ద్వారా తెలపడం జరిగింది. వీటిలోని ప్రతి న్యూట్రీషియన్ , విటమిన్స్, మినిరల్స్ తల్లిబిడ్డకు సహాయపడుతాయి. మరి అలాంటి ఫ్రూట్స్ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం...

ఆప్రికాట్స్ :

ఆప్రికాట్స్ :

ఆప్రికాట్స్ ను ఫ్రెష్ గా తినవచ్చు. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ , బీటా కెరోటిన్, ఫాస్పరస్, సిలికాన్, కాల్షియం, ఐరన్, పొటాషియంలు అధికంగా ఉన్నాయి. ఇంకా వీటిలో ఉండే సూపర్ న్యూట్రీషియన్స్ బేబీ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతాయి.వీటిలో ఉండే ఐరన్ కంటెంట్ అనీమియా నివారిస్తుంది.

చెర్రీస్ :

చెర్రీస్ :

చెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీలకు తప్పనిసరిగా అవసరమయ్యేది,. గర్భినీలలో కామన్ కోల్డ్ , రాషెస్ వంటి సాధారణ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చెర్రీస్ ను రెగ్యులర్ గా తినడం వల్ల బ్లడ్ సప్లై మెరుగుపడుతుంది. చెర్రీస్ లో ఉండే మెలటోనిన్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ న్యూబార్న్ బేబీలో సెల్స్ గ్రోత్ ను ప్రోత్సమిస్తుంది. అలాగే మెలటోనిన్ గర్భిణీకి మంచి నిద్రపట్టడానికి మరియు స్ట్రెస్ తగ్గించడానికి సహాయపడుతుంది.

 ద్రాక్ష:

ద్రాక్ష:

గర్భిణీలకు హెల్తీ స్నాక్ వంటిది గ్రేప్స్. గ్రేప్స్ లో న్యూట్రీషియన్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఫాల్బోఫిన్, గాలిక్ యాసిడ్, సిలిసిక్ యాసిడ్, పెక్టిన్, మెగ్నీసియం, క్యాల్షియం, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మిరియు విటమిన్ బి1, బి2, బి6, బి12, ఎ, సి, పి, పిపి, కెలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ముఖ్యమైన ఎంజైమ్స్ కూడా అధికంగా ఉండటం వల్ల ఇవి గర్భిణీలకు గ్రేట్ గా సమాయపడుతాయి .

జామపండ్లు :

జామపండ్లు :

ఇది ఒక మంచి ట్రోఫికల్ ఫ్రూట్ గర్భిణీలు ఖచ్చితంగా తినాల్సిన ఇమ్యూన్ బూస్టింగ్ ఫ్రూట్ . బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంచుతుంది. గర్భిణీలకు అవసరమయ్యే విటమిన్ సి, విటమిన్ ఇ, ఐసో ఫ్లెవనాయిడ్స్, కెరోటినాయిడ్స్ మరియు ఫాలీఫినాల్స్ ఇమ్యూన్ సిప్టమ్ ను బలోపేతం చేస్తాయి. బేబీలో సెంట్రల్ నెర్వెస్ సిస్టమ్ ను మెరుగుపరుస్తాయి.

 కివి ఫ్రూట్స్ :

కివి ఫ్రూట్స్ :

కివి ఫ్రూట్స్ పచ్చిగా ఉన్నప్పుడే టేస్ట్ గా ఉంటాయి. వీటిలో మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, డైటరీ ఫైబర్స్ అధికంగా ఉంటాయి. కివి పండ్లలో రెస్పరేటరీ సిప్టమ్ హీలింగ్ పవర్ అధికంగా ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు, వీజింగ్ వంటి సమస్యలను నివారిస్తాయి. వీటిలో ఉండే ఫాస్పరస్ బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది. ఐరన్ త్వరగా గ్రహిస్తుంది.

ఆపిల్స్ :

ఆపిల్స్ :

యాపిల్స్ తినడం వల్ల వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. వ్యాధినిరోధకత పెరుగుతుంది. బేబీఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వీజింగ్, ఆస్త్మా, ఎగ్జిమా వంటి సమస్యలు పుట్టబోయే బిడ్డలో ఏమాత్రం ఉండవు. ఆపిల్స్ లో విటమిన్ ఎ, ఇ, డి మరియు జింక్ అధికంగా ఉంటుంది.

మామిడి పండ్లు :

మామిడి పండ్లు :

గర్భిణీలు మామిడిపండ్లను ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే మితంగా తీసుకోవడం మంచిది. వీటిలో విటమిన్ సి ఎక్కువ, జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచి మలబద్దకం, ఇతర ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

 బేరి పండ్లు :

బేరి పండ్లు :

గర్భిణీల రెగ్యులర్ డైట్ లో ఉండాల్సిన మరో పండు బేరిపండ్లు. అయితే వీటిని తినడానికి ముందు డాక్టర్ ను కలవడం మంచిది. బేరి పండ్లలో ఫొల్లెట్ అధికంగా ఉంటుంది. వీటిలోఉండే ఫోలిక్ యాసిడ్ తల్లి బిడ్డ ఇద్దరికీ గొప్పగా సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్ బర్త్ డిఫెక్ట్స్ ను నివారస్తుంది.

స్ట్రాబెర్రీస్ :

స్ట్రాబెర్రీస్ :

స్ట్రాబెర్రీస్ కూడా గర్భిణీలకు గ్రేట్ ఫుడ్ . స్ట్రాబెర్రీస్ ను రోజులో ఎప్పుడైనా తినవచ్చు. వీటిలో విటమిన్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఫొల్లెట్ కూడా ఎక్కువ. న్యూట్రీషియన్స్, మెగ్నీషియం, పొటాసియం, వంటివి బేబీ బోన్స్, టీత్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతాయి.

 వాటర్ మెలోన్ :

వాటర్ మెలోన్ :

వాటర్ మెలోన్ లో విటమిన్ ఎ, సి, బి6, మెగ్నీషియం, పొటాసియంలు అధికంగా ఉన్నాయి. ఇంకా మినిరల్స్, ఫైబర్, కూడా అధికంగా ఉండం వల్ల , మార్నింగ్ సిక్ నెస్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. హార్ట్ బర్న్, కాళ్ళు, చేతులు వాపులను తగ్గిస్తుంది. మజిల్ క్రాంప్స్ నివారిస్తుంది. హైడ్రేషన్ అందిస్తుంది.

 సపోటా:

సపోటా:

సపోటాలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్ ఎ, కార్బోహైడ్రేట్స్ మరియు ఎనర్జీ అధికంగా ఉంటాయి. ఇవి ల్యాక్టింగ్ మదర్స్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. సపోటాలో వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వికారం, వాంతులు, తలతిరగడం, ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వంటి సమస్యలను నివారిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుంది. డయోరియా వంటి సమస్యలను నివారిస్తుంది.

అరటి పండ్లు :

అరటి పండ్లు :

గర్భిణీలు తప్పకుండా తినాల్సిన ఆహారాల్లో అరటిపండ్లు ఒకటి. వీటిలో ఫొల్లెట్, విటమిన్ సి, బి6, మెగ్నీషియం, పొటాషియంలు ఎక్కువ. ఇవి నేచురల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ను నివారిస్తాయి. గర్భినీణీలో హెల్తీ ఫ్లూయిడ్స్ ను రీస్టోర్ చేసి బ్యాలెన్స్ చేస్తుంది.

సీతాఫలం:

సీతాఫలం:

గర్భిణీలు తినాల్సిన ఫ్రూట్స్ లో సీతాఫలం ఒకటి. ఇది సీజనల్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ లో విటమిన్ ఎ, సిలు అధికంగా ఉన్నాయి.జ ఇవి పుట్టబోయే బిడ్డలో చర్మం, జుట్టు, ఇతర బాడీ టిష్యుల ఏర్పాటుకు గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకం నివారిస్తుంది. లేబర్ పెయిన్ తగ్గిస్తుంది.

 దానిమ్మ:

దానిమ్మ:

గర్భిణీలకు ప్రక్రుతి ప్రసాధించిన వరాల్లో ఒకటి దానిమ్మ. దానిమ్మలో విటమిన్ సి, క్యాల్షియం, పొటాసియం, ఫొల్లెట్, ఐరన్, ప్రోటీన్, మరియు విటమిన్ సి అదికంగా ఉన్నాయి. అందుకే గర్భిణీలు వీటిని తప్పనిసరిగా తినాలి. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల తప్పకుండా అద్భుత ప్రయోజనాలను పొందుతారు.

బ్లూ బెర్రీస్ :

బ్లూ బెర్రీస్ :

గర్భిణీలు తినాల్సిన వాటిలో బ్లూ బెర్రీస్ కూడా ఒకటి. ఒక కప్పు బ్లూ బెర్రీస్ లో 114 మిల్లీగ్రాముల పొటాషియం బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది. బ్లూ బెర్రీస్ లో ఉండే విటమిన్ సి, ఫొల్లెట్, క్యాల్షియం, మరియు ఫైబర్ లు గర్భినీలకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

English summary

15 Nutritious Fruits To Eat During Pregnancy

Fruits are an important food group that you need to incorporate into your routine diet. Fruits provide you and your baby with important nutrients like beta carotene that helps in developing the tissue and cell development, while laying foundation for a stronger immune system.
Story first published: Tuesday, February 7, 2017, 14:38 [IST]
Desktop Bottom Promotion