గర్భిణీలకు ఈ 20 ఆహారాలు ఎంతో మేలు

By Y BHARATH KUMAR REDDY
Subscribe to Boldsky

ప్రతి స్త్రీ జీవితంలో గర్భదశ చాలా ముఖ్యమైన సమయం. ఈ సమయంలో వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అయితేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇక ఆహార విషయంలో చాలా సూచనలు పాటించాలి. గర్భిణీలు వారితో పాటు వారి కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కూడా చూసుకోవాలి. గర్భావధికాలంలో తల్లి ద్వారానే ఆహారం, ఆయువును బిడ్డ పొందుతుంది.పుట్టబోయే బిడ్డ ఎలాంటి లోపానికి గురికాకుండా ఉండేందకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అయితే గర్భిణీగా ఉన్నప్పుడు ఎలాంటి ఆహారం అవసరం? అనేది చాలామందికి సందేహంగా ఉంటుంది. వీలైనంత వరకు శక్తి, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దీని వల్ల శిశువు ఎదుగుదల బాగా ఉంటుది. పండ్లు, కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు, మాంసం ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి ఈ 20 ఆహారాలు గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. వీటి ద్వారా ప్రోటీన్లు అందుతాయి. శిశువు కణజాలాభివృద్దికి, రక్తం, మెదడుకి ప్రోటీన్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. అలాగే అమినో యాసిడ్స్‌ కూడా లభ్యమౌతాయి. మరి ఆ ఆహారాలు ఏమిటో చూద్దామా.

1. దానిమ్మపండు

1. దానిమ్మపండు

ఇందులో ఫోలేట్, పొటాషియం, విటమిన్ కే, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల దానిమ్మను నేరుగాగానీ, దాని జ్యూస్ నుగానీ నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తాగాలి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. గర్భిణీలకు దానిమ్మపండు ఎంతో మేలు చేస్తుంది. అలాగే దానిమ్మలో విటమిన్ ఎ, సి, ఇ, బి5, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. గర్భస్థ శిశువుల పెరుగుదలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణీ మహిళలు రోజూ ఒక గ్లాస్ దానిమ్మ రసం తీసుకుంటే ఎంతో మంచిది. దీని వల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు తప్పుతుంది.

2. నట్స్ ( గింజలు)

2. నట్స్ ( గింజలు)

బాదం, జీడిపప్పు, అక్రోట్లు, వేరుశెనగ, పిస్తాపప్పులులాంటివి చాలా మంచి ఆహారం. వీటిలో ఫ్యాట్స్, మాంసకృత్తులు, పీచుపదార్థాలు, విటమిన్లు , మినరల్స్ ఉంటాయి. వీటిని ఎక్కువగా కూడా తీసుకోవొచ్చు. మెగ్నీషియం బాందపప్పులో అధికంగా ఉంటుంది. వీటిని ప్రతి రోజూ ఎప్పుడైనా సరే గర్భిణీలు స్నాక్స్ లాగా తినొచ్చు.

3. ఎండిన నల్లద్రాక్ష

3. ఎండిన నల్లద్రాక్ష

ఎండిన నల్ల ద్రాక్ష పళ్లలో రక్తలో హిమోగ్లోబిన్ ను పెంపొందించడానికి ఎక్కువగా సహాయపడుతుంది. వీటిని రాత్రిపూట నానబెట్టండి. ఉదయం పూట పరగడుపున తినండి. వీటిని తీసుకోవడం వల్ల మీరు హైడ్రేటెడ్ గా ఉంటారు. మీ శరీరానికి అవసరైమ నీరు ఉండేందుకు ఎండిన నల్లద్రాక్ష బాగా సాయం చేస్తుంది. అలాగే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు నల్లద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది.

4. బీట్రూట్

4. బీట్రూట్

బీట్రూట్ వల్ల కూడా గర్భిణీలకు చాలా ప్రయోజనాలున్నాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గర్భిణీల్లో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుంది. శరీరానికి అవసరమైన ఐరన్ ను అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే జాయింట్స్ పెయిన్, వాపులను ఇది తగ్గిస్తుంది.

5. ఖర్జూర

5. ఖర్జూర

ఎండిన ఖర్జూర పండ్ల వల్ల శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలేట్ లు అందుతాయి. అలాగే శరీరానికి అవసరమైన ఫైబర్ ను ఇవి అందిస్తాయి. మలబద్ధకం సమస్య పరిష్కారం అవుతుంది. గర్భందాల్చిన 36 వ వారం నుంచి రోజుకు ఆరు ఖర్జూరాలు తినొచ్చు.

6. అరటి

6. అరటి

గర్భిణీలు అరటి పండ్లు తినడం మంచిదే. వీటిలో క్యాల్షియం, పొటాషియం, ఇతర న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. బిడ్డకు బ్రెయిన్, నాడీవ్యవస్థ, వెన్నెముక ఏర్పడటానికి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. అలగే అరటి రక్తహీనతను తగ్గిస్తుంది. అరటిపండ్లలో ఐరన్ ఎక్కువుగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో హీమోగ్లోబిన్ పెరుగుతుంది. రక్తహీనత సమస్య ఉండదు. మలబద్దకం సమస్యను నివారిస్తుంది. వీటిలో క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడుటకు సహాయపడుతుంది . ఇందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది.

7. ఆరెంజ్

7. ఆరెంజ్

ఆరెంజ్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ పండు 90% నీరు కలిగి ఉంటుంది. అందువల్ల బాడీ ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండేందుకు ఈ పండు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే గర్భిణీలు ఎక్కువగా కడుపులో వికారంగా ఉండడం, వాంతులతో ఇబ్బందులుపడుతుంటారు. ఈ సమస్య ఈ పండ్లను తినడం వల్ల పరిష్కారం అవుతుంది. వీటిలో ఫైబర్, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇవి కూడా గర్భిణీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

8. ఫిగ్స్ లేదా అత్తిపండ్లు

8. ఫిగ్స్ లేదా అత్తిపండ్లు

ఫిగ్స్ లేదా అత్తిపండ్లు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి కడుపులోని బిడ్డ చిగుళ్లు, దంతాల అభివృద్ధికి బాగా సహాయపడతాయి. అంతేకాంకుండా వీటిలో జింక్ అధికంగా ఉంటుంది. డీఎన్ ఏ ఫార్ములేషన్, కణజాల పెరుగుదలకు జింక్ ఎంతో అవసరం.వీటిలో క్యాల్షియం కూడా అధికంగా ఉంటుంది. ఒక కప్పు ఎండు అత్తిపండ్లతో పాలతో సమానంగా క్యాల్షియం లభిస్తుంది. పైగా వీటిల్లో పీచు కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగని వీటిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వీటిలో చక్కెర, కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి.

9. సాల్మన్ చేపలు

9. సాల్మన్ చేపలు

సాల్మన్ చేపల్లో విటమిన్ డీ అధికంగా ఉంటుంది. ఒమేగా-3 ఫాటీ యాసిడ్ లు అదికంగా ఉంటాయి. వారంలో రెండు లేదా మూడుసార్లు సాల్మన్ చేపలను తీసుకుంటే బిడ్డకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఇది గర్భంలో శిశువు కళ్లు, మెదడు అభివృద్ధి చెందేందుకు సహాయపతుంది. అందువల్ల గర్భిణీలు సాల్మన్ చేపలను ఎక్కువగా తీసుకోవాలి.

10. గుడ్డు

10. గుడ్డు

గర్భంలోని శిశువు బ్రెయిన్ హెల్త్ కు గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. గుడ్డులో అమైనో ఆమ్లాలు ఎక్కుగా ఉంటాయి. కొన్ని ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లు ఉంటాయి. అయితే గుడ్డులో ఉండే సాల్మొనెల్ల రసాయనాన్ని తొలగించేందుకు గుడ్డును కచ్చితంగా ఉడికించాలి. ఆ తర్వాతే తినాలి. గుడ్లో ఉండే ప్రోటీన్లు కూడా శరీరానికి ఎంతో మేలు

చేస్తాయి.

11. యోగర్ట్

11. యోగర్ట్

ఒక కప్పు పెరుగు కూడా ఒక కప్పు పాలతో సమానం. చాలామంది గర్భిణీలు పెరుగు తీసుకుంటే లావవుతామని భ్రమపడుతుంటారు. ఇది ఒక అపోహ మాత్రమే. పెరుగును తగు మోతాదులో సేవించడం వల్ల తల్లికి, బిడ్డకు లాభమే. ఇక పాలలో కంటే పెరుగులోనే ఎక్కువ కాల్షియం ఉంటుంది. పెరుగు ప్రోటీన్లు, ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి. యోగర్ట్ ఒక పండు ఏవిధంగా ప్రోటీన్లు అందిస్తుందో ఆ విధమైన పోషకాలను అందిస్తుంది. అయితే గర్భిణీలు అధికంగా పెరుగు తీసుకోకూడదు. రోజుకు నాలుగు సేర్విన్గ్స్ (1200 mg) పెరుగు మాత్రమే తీసుకోవాలి.

12. బ్రొక్కోలి గ్రీన్, ఆకు కూరగాయలు

12. బ్రొక్కోలి గ్రీన్, ఆకు కూరగాయలు

బ్రొక్కోలి గ్రీన్ లీఫ్ కూరగాయలను తినమని డాక్టర్లు సూచిస్తుంటారు. గర్భస్రావం లేదంటే గర్భందాల్చిన మొదటి నెలలో ఏర్పడే సమస్యల పరిష్కారానికి ఇవి బాగా మేలు చేస్తాయి. అలాగే ఈ ఆహారాలు వెన్నుముక, మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా వీటిని తీసుకోవడం వల్ల పరిష్కారం అవుతాయి. ఆస్పరాగస్, బచ్చలికూర, బ్రోకలీ వంటి వాటిలో ఉండే ఫోలిక్ యాసిడ్స్ గర్భిణీలకు మేలు చేకూరుస్తాయి. బిడ్డ పుట్టుకలో ఏర్పడే సమస్యను ఇవి పరిష్కరిస్తాయి.

13. పప్పుధాన్యాలు

13. పప్పుధాన్యాలు

గర్భంలోని బిడ్డ నాడీ వ్యవస్థ, మెదడు అభివృద్ధికి ఫోలిక్ యాసిడ్ అవసరమవుతుంది. ఇది మాత్రమే వీటిని డెవలప్ చేయగలదు. ఇది పప్పుధాన్యాల్లో ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల గర్భిణీలు పలురకాల పప్పుధాన్యాలు తీసుకోవడం చాలా మంచిది. పేగులకు సంబంధించిన సమస్యలను కూడా పప్పుధాన్యాలు తీసుకోవడం వల్ల పరిష్కారం అవుతాయి.

14. బెల్ పెప్పర్స్

14. బెల్ పెప్పర్స్

బెల్ పెప్పర్స్ లో కూడా విటమిన్ సీ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో బీటా-కెరోటిన్ విటమిన్ బీ6 కూడా అధికంగా ఉంటుంది. మీరు తినే సలాడ్లు, పాస్తాల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగించేందుకు ప్రయత్నించండి. ఇది గర్భంలోని పిండం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో తోడ్పడుతుంది. అందువల్ల బెల్ పెప్పర్స్ ను గర్భిణీుల ఎక్కువగా తీసుకోవాలి.

15. అవోకాడో

15. అవోకాడో

ఫోలిక్ ఆమ్లం గర్భంలోని శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఫోలిక్ యాసిడ్ అవోకాడో పండులో అధికంగా ఉంటుంది. ఇందులో ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. ఇది గర్భిణీలలో ఉదయం సమయంలో ఏర్పడే సమస్యలను పరిష్కరిస్తుంది. దీన్ని ఎక్కువగా గర్భిణీలు తీసుకోవాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణంకావాడానికి కూడా ఈ పండు బాగా ఉపయోగపడుతుంది.

16. రెడ్ లీన్ మాంసం

16. రెడ్ లీన్ మాంసం

రెండ్ లీన్ మాంసంలో అత్యధిక మోతాదులో ప్రోటీన్లు ఉంటాయి. ఈ మాంసాన్ని వీలైనంత ఎక్కవగా గర్భిణీలు తీసుకోవాలి. దతీంతో గర్భంలో శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే పిండం అభివృద్ధికి ఇది సహాయపడుతుంది. ఈ మాంసంలో ఐరన్ అధికంగా ఉంటుంది. శిశువు మెదడుకు కావాల్సిన ఆక్సిజన్ అందించడానికి కూడా ఈ మాసం బాగా ఉపయోగపడుతుంది. పంది లేదా బీఫ్ వంటి లీన్ మాంసాన్ని వారంలో రెండుసార్లు గర్భిణీలు తీసుకోవాలి.

17. బెర్రీస్

17. బెర్రీస్

గర్భిణీకి, కడుపులోని శిశువుకు కావాల్సిన విటమిన్లు మినరల్స్ మొత్తం బెర్రీస్ లో ఉంటాయి. వీటిలో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే లక్షణాలను కలిగి ఉంటాయి. కొన్ని బెర్రీల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి. అందువల్ల గర్భిణీలు బెర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి.

18. చిలగడదుంపలు

18. చిలగడదుంపలు

చిలగడదుంపలు గర్భిణీుల ఎక్కువగా తినాలి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పీచు మోతాదు చాలా ఎక్కువ. అలాగే వీటిని తీసుకోవడం వల్ల గర్భిణీలకు విటమిన్ ఎ ఎక్కువగా అందుతుంది. బీటా-కరోటిన్ను కూడా వీటిలో ఉంటుంది. ఇది శరీరానికి అవసరైమే విటమిన్ ఏ అందిస్తుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు పరిష్కారం అవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా ఇది తగ్గిస్తుంది.

19. మామిడి

19. మామిడి

గర్భిణీలు ఎక్కువగా బరువు పెరిగే సమస్య లేదా కాళ్ల తిమ్మిరులతో బాధపడుతుంటారు. అయితే మామిడి పండును తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. మామిడిలోని మెగ్నీషియం తిమ్మిరి సమస్యను పరిష్కరిస్తుంది. అందువల్ల గర్భిణీలు మామిడిపండ్లను ఎక్కువగా తీసుకోవాలి.

20. నీరు

20. నీరు

డీహైడ్రెషన్ (నీటి నిర్జలీకరణ) అనేది ఎక్కువ సమస్యలను తీసుకొస్తుంది. గర్భధారణ సమయంలో మహిళలు సాధ్యమైనంత వరకు ఎక్కువగా నీటిని తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగకపోతే డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చు. శిశువుకు పోషకాహారాలు అందాలంటే గర్భిణీలు నీరు ఎక్కువగా తాగాలి. మామూలు మహిళలతో పోల్చుకుంటే రెండింతలు ఎక్కువగా గర్భిణీలు నీరు తాగితే మంచిది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  English summary

  20 Good Foods For Pregnant Ladies

  Food is one factor that determines a person. The type of food that a person eats routinely shapes up the body and its well-being subsequently. These foods may or may not be to the person's liking and there might not be any regulation in having them. For a normal life lead, this type of food intake is absolutely fine as long as there aren't any health issues. Sometimes, there comes a juncture in life when food must be given utmost importance to and one such phase is pregnancy. Some rules must be followed of what to eat and what not to eat for a healthy baby to be born.
  Story first published: Thursday, November 9, 2017, 14:36 [IST]
  దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more