ప్రెగ్నెన్సీ సమయంలో బ్రొకోలి తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

గర్భిణీలు తీసుకునే ఆహారం తల్లి, బిడ్డ ఆరోగ్యం మీద ప్రధాణ పాత్రపోషిస్తుంది.కాబట్టి పూర్తి పోషకాలున్న ఆహారాలను ఎక్కువగా ఎంపిక చేసుకోవాలి. అయితే రోజూ రెగ్యులర్ గా తినే ఆహారాలు కాకుండా డిఫెరెంట్ ఫుడ్స్ ను కూడా ఎంపిక చేసుకోవచ్చు. అలాంటి వాటిలో బ్రొకోలి ఒకటి. బ్రొకోలీ గర్భిణీలకు చాలా ఆరోగ్యకరమైనది.

బ్రొకోలీ క్రూసిఫెరస్ వెజిటేబుల్ ఇది బ్రాసికా కుటుంబానికి చెందినది. దీన్ని ఎక్కువగా ఇటలీలో తింటుంటారు. బ్రొకోలీలో న్యూట్రీషియన్స్, యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటో కెమికల్స్ అధికంగా ఉన్నాయి. ఇది పుట్టబోయే బిడ్డకు కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. బ్రొకోలిని ఉడికించి లేదా పచ్చిగా కూడా తినవచ్చు

గర్భిణీలు ఈ గ్రీన్ వెజిటేబుల్ బ్రొకోలిని రెగ్యులర్ డైట్ లో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

1. అనీమియా నివారిస్తుంది:

1. అనీమియా నివారిస్తుంది:

బ్రొకోలీలో ఐరన్ అధికంగా ఉంటుంది. బ్రొకోలి తినడం వల్ల గర్భిణీలో హీమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. అనీమియా రిస్క్ తగ్గుతుంది

2. ఎముకలు బలంగా మారుతాయి :

2. ఎముకలు బలంగా మారుతాయి :

గర్భాధారణ సమయంలో బలహీనమైన ఎముకల కారణంగా ఓస్టిరియోఫోసిస్ కు కారణమవుతుంది. బ్రొకోలీలో క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, మరియు ఫాస్పరస్ లు అధికంగా ఉన్నాయి. బ్రొకోలీ తినడం వల్ల ఇవన్నీ గర్భిణీ పొందడం వల్ల బోన్ హెల్త్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది ఓస్టిరియో ఫోసిస్ రిస్క్ తగ్గిస్తుంది.

3. హెల్తీ ప్రెగ్నెన్సీ :

3. హెల్తీ ప్రెగ్నెన్సీ :

బ్రొకోలీలో ఫొల్లెట్ అధికంగా ఉంటుంది. ఇది నరాల లోపాలను నివారిస్తుంది. ముఖంగా బేబీలో స్పైన్ బిఫిడ ను నివారిస్తుంది. బ్రొకోలీ తినడం వల్ల తల్లి, బిడ్డలో స్సైనల్ కార్డ్ హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది.

4. యూవి రేస్ నుండి చర్మానికి రక్షణ కల్సిస్తుంది:

4. యూవి రేస్ నుండి చర్మానికి రక్షణ కల్సిస్తుంది:

రీసెర్చ్ ప్రకారం బ్రొకోలీలో గ్లూకార్ఫినిన్ మరియు సల్ఫార్పిన్ అధికంగా ఉండటం వల్ల స్కిన్ ఇన్ఫమేషన్ తగ్గుతుంది.సన్ డ్యామేజ్ నివారిస్తుంది. యూవీ కిరణాల రేడియేషన్ నుండి ప్రెగ్నెన్సీ స్కిన్ ను కాపాడుతుంది. బ్రొకోలీలో విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ ఎ, విటమిన్ కె, ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ ఫొల్లెట్ అధికంగా ఉన్నాయి. రెగ్యులర్ డైట్ లో బ్రొకోలీ చేర్చుకోవడం వల్ల చర్మం సౌందర్య మెరుగౌతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.వివిధ రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది.

5. ఇమ్యూనిటి పెంచుతుంది:

5. ఇమ్యూనిటి పెంచుతుంది:

బ్రొకోలీలో విటమిన్ సి , బీటా కెరోటిన్ , సెలీనియం, జింక్, కాపర్, ఫాస్పరస్, మరియు ఇతర విటమిన్స్ , మినిరల్స్ అధికంగా ఉంటాయి. దీన్ని ప్రెగ్నెన్సీ బూస్టర్ గా తీసుకుంటారు. దీన్ని బేబీ ప్రొటక్షన్ కు ఉపయోగిస్తుంటారు. ఇమ్యూనిటి పవర్ పెంచుతుంది. ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది

6. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

6. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

బ్రొకోలీలో ఉండే బీటా కెరోటిన్ కంటెంట్ మాస్కులర్ డీజనరేషన్ నివారిస్తుంది. కళ్ళను సురక్షితంగా ఉంచుతుంది. బ్రొకోలీలో ఉండే జియాక్సిథిన్ , విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్ , విటమిన్ సి, విటమిన్ ఇ మరియు ఫాస్పరస్ లు కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గర్భాధారణ సమయంలో రేడియేషన్ కారణంగా కళ్ళుద డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. బ్రొకోలిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కాంటరాక్ట్స్ మరియు ఇతర కళ్లకు సంబంధించిన సమస్యలను నివారిస్తుంది.

7. క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

7. క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

బ్రొకోలీ ఫైటో కెమికల్స్ ను నివారిస్తుంది. ఇందులో స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. గర్భధారణ సమయంలో డైట్ రిచ్ లో బ్రొకోలీ చేర్చుకోవడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్స్ కోలన్, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

8. డయాబెటిస్ ను రెగ్యులేట్ చేస్తుంది:

8. డయాబెటిస్ ను రెగ్యులేట్ చేస్తుంది:

గర్భిణీల్లో జస్టేషనల్ డయాబెటిస్ సహజం. బ్రొకోలీని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ ను రెగ్యులేట్ చేస్తుంది. బ్రొకోలీలో ఇన్ సోలుబుల్, సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది..ఇది ఇన్సులిన్ లెవల్స్ ను నివారిస్తుందిజ బ్రొకోలీలో షుగర్ కంటెంట్ తక్కువ

9. మలబద్దకాన్ని నివారిస్తుంది:

9. మలబద్దకాన్ని నివారిస్తుంది:

బ్రొకోలీలో సోలబుల్, ఇన్ సోలబుల్ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల , శరీరంలో వాటర్ కంటెంట్ నింపుతుంది. హెల్తీ బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది. కాబట్టి, బ్రొకోలీ రెగ్యులర్ గా తినడం వల్ల గర్భాధారణ సమయంలో వచ్చే మలబద్దక సమస్యను నివారిస్తుంది.

English summary

9 Amazing Benefits Of Eating Broccoli During Pregnancy

Broccoli is a cruciferous vegetable from the Brassica family. Itoriginally belongs to Italy and became popular in the 17th or 18thcentury. Broccoli is full of nutrients, antioxidants, andphytochemicals. It offers numerous benefits to you and your unborn baby.You can either consume raw broccoli or cook and eat it.
Story first published: Monday, February 13, 2017, 15:00 [IST]
Subscribe Newsletter