గర్భిణీలు రైస్ తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..!!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఉన్నా, ఇప్పుడిప్పుడే గర్భం పొందినా రైస్ తినడం సురక్షితమేనా? గర్భధారణలో రైస్ తినడం వల్ల తల్లి బిడ్డకు లాభమా లేదా నష్టమా? గర్భం పొందాలనుకునే వారు ప్లానింగ్ లో ఉన్నవారు రైస్ తినాలనుకున్నప్పుడు అందుకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఉన్న జనాభాలో చాలా మంది ఎక్కువ అన్నం తినడానికి ఇష్టపడుతారు. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ అన్నం ఎక్కువ తింటారని అంటుంటారు. అలాగే గర్భిణీల కూడా ఎక్కువగా అన్నం తినడానికి ఇష్టపడుతారు.

కొన్ని సందర్భాల్లో గర్భిణీలు రాఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు. ఇలాంటి పరిస్థితిలో అన్నం తినడం ఉత్తమం. గర్భధారణ సమయంలో గర్భిణీ అన్నం తినడం వల్ల కొన్ని కాంట్రవర్షియల్ సమస్యలు తలెత్తుతాయని అంటుంటారు. కాబట్టి, అలాంటి కాంట్రవర్సీలకు చెక్ పెట్టాలంటే గర్భిణీలు అన్నం తినడం వల్ల పొందే ప్రయోజనాలను తెలుసుకుందాం..

అన్నం తినడం వల్ల గర్భిణీలు పొందే అద్భుతమైన ప్రయోజనాలు

1. ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందుతారు:

1. ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందుతారు:

అన్నంలో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి వెంటనే కావల్సిన ఎనర్జీని అందిస్తుంది. కాబట్టి, గర్భిణీలకు తక్షణ ఎనర్జీని అందివ్వాలంటే అన్నం తినాల్సిందే అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

2. ఎముకలను స్ట్రాంగ్ గా మార్చుతుంది:

2. ఎముకలను స్ట్రాంగ్ గా మార్చుతుంది:

అన్నంలో విటమిన్స్ అధికంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ డి , రెబోఫ్లెవిన్ మరియు థైయమిన్ అధికం. అలాగే ఎక్కువ మినిరల్స్, క్యాల్షియం, ఐరన్, ఫైబర్ వంటివి అధికంగా ఉండటం వల్ల గర్భిణీలు అన్నం తినడం వల్ల స్ట్రాంగ్ బోన్స్, టీత్ ను పొందుతారు .

3. మలబద్దకం నివారిస్తుంది:

3. మలబద్దకం నివారిస్తుంది:

అన్నంలో స్ట్రార్చ్ (గంజి) అధికంగా ఉండటం వల్ల ఇది బౌల్ మూమెంట్ మీద ప్రభావం చూపుతుంది. ఇది మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది. దాంతో బౌల్ మూమెంట్ చురుకుగా ఉంటుంది. దాంతో వివిధ రకాల ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. మలబద్దకం, హెమరాయిడ్స్, వంటి సమస్యల నుండి బయటపడవచ్చు.

4. బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది:

4. బ్లడ్ ప్రెజర్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది:

అన్నంలో సోడియం కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది. గర్భంతో ఉన్నప్పుడు, బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటే సురక్షితమైన ప్రసవంను పొందుతారు .

5. యూటిఐ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు:

5. యూటిఐ ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు:

గర్భిణీల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ సహజం . ఇది బేబీ మీద ప్రభావం చూపుతుంది. అన్నం నేచురల్ డ్యూరియాటిక్ , ఇది యూరిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. గర్భాధారణ సమయంలో అన్నం తినడం వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు .

6. బ్రెయిన్ డెవలప్ మెంట్ ను ప్రోత్సహిస్తుంది:

6. బ్రెయిన్ డెవలప్ మెంట్ ను ప్రోత్సహిస్తుంది:

బ్రౌన్ రైస్ లో న్యూరోట్రాన్సమిట్టర్ న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. గర్భధారణ సమయంలో రైస్ తినడం వల్ల పుట్టబోయే బిడ్డలో బ్రెయిన్ డెవలప్ మెంట్ కు సహాయపడుతుంది. బ్రెయిన్ ఫంక్షన్స్ షార్ప్ గా ఉంటుంది.

7. వ్యాధినిరోధకతను పెంచుతుంది:

7. వ్యాధినిరోధకతను పెంచుతుంది:

అన్నంలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఇది గర్భం ప్లాన్ చేసుకునే వారికి కూడా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. గర్భిణీలో వ్యాధినిరోధకతను పెంచుతుంది. ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది.

8. బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది :

8. బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది :

బ్రౌన్ రైస్ లో ఇన్ సోలబుల్ ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందులో లో గ్లిజమిక్ ఇండెక్స్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బ్రౌన్ రైస్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తుంది. గర్భధారణ సమయంలో బ్రౌన్ రైస్ తినడం వల్ల జస్టేషనల్ డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది.

9. కొలెస్ట్రాల్ సమస్యను నివారిస్తుంది :

9. కొలెస్ట్రాల్ సమస్యను నివారిస్తుంది :

రైస్ లో కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి గర్భిణీల రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది . కొలెస్ట్రాల్ సమస్యలు లేకుండా సురక్షితంగా ఉంచుతుంది. .

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    9 Health Benefits Of Eating Rice During Pregnancy

    Rice is an unimpeachable staple food that many consume all over theworld. People use rice to prepare a myriad of cuisines. Sometimes,pregnant women tend to suffer from pica, or an insatiable desire toconsume raw foods, and rice is one of these foods. As a result,consumption of rice during pregnancy becomes a controversial issue. Solet’s have a look at benefits of consuming rice during pregnancy.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more