For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఆరోగ్యంగా గర్భం పొందడానికి ఆయుర్వేదం చెప్పే రహస్యాలు!

  By Lakshmi Bai Praharaju
  |

  గర్భధారణ అనేది స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశలలో ఒకటిగా భావించబడుతుంది, ఆ సమయంలో విపరీతమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. మీరు గర్భం ధరించినపుడు మీకుమీరే ఎలాంటి శ్రద్ధలు తీసుకుంటారో అనేదానిపై వివిధ రకాల మనస్తత్వాలు ఉన్నాయి, గర్భధారణ సమయంలో సంరక్షణకు సంబంధించి ఆయుర్వేద సూత్రాలు నిజంగా సంపూర్ణం, బహుళ పరిణామాలుగా పరిగణించబడుతున్నాయి.

  సూత్రాలు, భావనలు, నిర్వహణ గురించి 'గర్భిని వ్యాకరణం' లేదా 'గర్భిని పరిచర్య' లో వివరించబడింది, ఇందులో ఆమె నిజానికి గర్భవతి అయినపుడు సరైన సంరక్షణ అందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. బిడ్డకు జన్మను ఇచ్చిన తరువాత కూడా ఇదే శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అపుడే తల్లీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు.

  ఆయుర్వేదం సరైన ఆహరం, జీవనశైలి, ఆలోచనలను సిఫార్సు చేస్తుంది

  తల్లి, బిడ్డను ప్రభావితం చేయడంలో ముఖ్యమైన అంశాలు కీలకపాత్ర పోషి౦చి, సురక్షితమైన గర్భానికి తోడ్పడుతాయని ఆయుర్వేద నమ్మకం. కాబట్టి, ప్రతి విషయంలో చాలా శ్రద్ధ అవసరం. వీటితోపాటు ఆరోగ్యం, సరైన, ఖచ్చిత ఆహరం (ఆహరం, పౌష్టికం), విహార (కార్యకలాపాలు, జీవనశైలి), విచార (ఆలోచనలు, నమ్మకాలు) మొదలైనవి కూడా.

  ఆయుర్వేద గర్భధారణ గైడ్

  ఇంతకు ముందు చెపినట్టు, తల్లిని, గర్భస్ధ శిశువును ఆరోగ్యంగా, బలంగా ఉంచే అనేక కారకాల పట్ల శ్రద్ధ చూపించడం గర్భ సంరక్షరణ లో ముఖ్యమైన భాగం. నెలలు గడిచే కొద్దీ, గర్భస్ధ శిశువు పెరుగుతూ ఉంటుంది కాబట్టి, తల్లి తానూ తీసుకునే ఆహరం ఆరోగ్యంగా ఉండేట్టు అలాగే సరైన ఆహారపు అలవాట్లు ఉండేట్లు చూసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ గైడ్ గర్భవతి అయిన స్త్రీ తీసుకునే ఆహరం అలాగే జీవనశైలి విషయాలను సరిగా పాటించాలని గట్టిగా చెప్తుంది.

  1. ఉపవాసం, మితిమీరి తినడం మానేయాలి

  1. ఉపవాసం, మితిమీరి తినడం మానేయాలి

  కాలానుగుణ పండ్లు, ఆకుకూరలు, నెయ్యి, పాలు, పాల పదార్ధాలు, ఎండుద్రాక్ష, ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ అధికంగా ఉన్న ఆహరం పదార్ధాలు వంటి ఆరోగ్యకరమైన, తాజా, తేలికగా అరిగే సాత్వికమైన ఆహరం తీసుకోవాలి. ఈసమయంలో ఉసిరి, శతావరి వంటి మూలికలను కూడా తీసుకోవడం కూడా గర్భ సంరక్షణకు మంచిది.

  2. అన్ని రకాల రుచులు :

  2. అన్ని రకాల రుచులు :

  తీపి, పులుపు, ఉప్పు, చేదు, వగరు, కారం వంటి - ఆరు రకాల రుచులు మీ ఆహారంలో ఉండేట్టు చూసుకోండి.

  3. జంక్ ఫుడ్ వద్దు:

  3. జంక్ ఫుడ్ వద్దు:

  గట్టివి, వేపుళ్ళు, స్పైసీ, నిలవ పదార్ధాలు తినకండి

  4. మలబద్దకం నివారించుకోవాలి:

  4. మలబద్దకం నివారించుకోవాలి:

  గర్భాధారం సమయంలో మలబద్ధకం సమస్య వస్తే, ఒక గ్లాసు పాలలో అతిమధురం పొడి, గులాబీ రేకులతో చేసిన గుల్కండ్ ని వేసుకుని తీసుకోవచ్చు.

  5. రోజువారి పనులు:

  5. రోజువారి పనులు:

  ఆరోగ్యకర గర్భధారణకు మీ జీవనశైలి, రోజువారీ కార్యక్రమాలు కూడా గమనించుకోవడం చాలా అవసరం.

  6. బరువులు ఎత్తకపోవడం మంచిది:

  6. బరువులు ఎత్తకపోవడం మంచిది:

  మొదటి కొన్ని నెలలపాటు ఎక్కువ బరువులను మోయకండి. శారీరకంగా, మానశికంగా మీపై మీరే వత్తిడి తెచ్చుకోకండి.

  7. డ్రెస్సింగ్ సెన్స్ :

  7. డ్రెస్సింగ్ సెన్స్ :

  వదులుగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరించండి.

  8. సంతోషంగా ఉండాలి:

  8. సంతోషంగా ఉండాలి:

  మనసు సంతోషంగా ఉంచుకుంటూ, ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోండి.

  9 . ప్రతికూల విషయాలకు దూరంగా:

  9 . ప్రతికూల విషయాలకు దూరంగా:

  గర్భధారణ గైడ్ సహజ శరీర నిరోధకాలను బలంగా ప్రోత్సహిస్తుంది కూడా.

  ఆయుర్వేదం తొమ్మిది నెలల గర్భధారణలో మనస్సు సానుకూలంగా, సంతోషకరమైన ధోరణిని నిర్వహించడంపై దృష్టి పెడుతుంది. మీ మనసులో ప్రతికూల ఆలోచనలను తీసుకురాకండి, మాట్లాడడం, చూడడం లేదా ప్రతికూల విషయాలను వినడం వంటివి చేయకండి.

  English summary

  Ayurvedic Tips For A Healthy Pregnancy!

  Ayurveda believes that several vital elements play a crucial role in affecting both the mother as well as the child, thus contributing in a safe pregnancy. Hence, attention must be given to each of them. And these include healthy, proper and correct Ahara (diet and nutrition), Vihara (activities and lifestyle), and Vichara (thoughts and beliefs).
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more