దగ్గు మందుకు..గర్భాధారణకు ఏమిటి సంబందం..?

Posted By:
Subscribe to Boldsky

దగ్గు మందుతో గర్భమా..? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కాదు..అక్షరాల నిజం అంటున్నాయి కొన్ని పరిశోధనలు. కొంత మంది మహిళలు గర్భాధరణ కోసం దగ్గు మందును ఉపయోగించారట..!

ఆగండి..ఆగండి..ఆవేశం ఎందుకు! అందకు పూర్తి నిర్ధాణ కానీ, సైంటిఫిక్ ఆధారాలు కానీ లేవు. కానీ దగ్గు మందును ఉపయోగించిన కొంత మంది మహిళలు మాత్రం గర్భం ధరించినట్లు చెబుతున్నారు.!

సంతానోత్పత్తిని పెంచడానికి సహజ మార్గాలు..!

ఈ విషయం నమ్మాలో లేదో తెలియదు కానీ, వారి అభిప్రాయం ప్రకారం..వీర్యకణాలు ఓవరీస్ లో ఎగ్ సెల్స్ ను చేరుకోవడానికి మాత్రం గ్రేట్ గా సహాయపడుతుందని అంటున్నారు. మరైతే ఇది ఎలా పనిచేస్తుందనేగా మీ సందేహం..? అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హెచ్చరిక: డాక్టర్స్ అనుమతి లేకుండా ఈ రెమెడీని ప్రయత్నించకూడదు.

#1

#1

దగ్గు మందులో ఏం ఉంటుంది? కొన్ని రకాల దగ్గు మందుల్లో గైఫెన్నేషిన్ (కఫోత్సారకం) ఉంటుంది. ఈ పదార్థం ఊపిరితిత్తుల్లోని మ్యూకస్ ను తొలగిస్తుంది. అంతే కాదు, ఇది సర్వికల్ మ్యూకస్(గర్భాశయ శ్లేష్మం)న్ని కూడా వదులు చేస్తుంది.

#2

#2

ఎప్పుడైతే సర్వికల్ మ్యూకస్ వదులౌతుందో, అప్పుడు స్మెర్మ్(వీర్య కణాలు)సులభంగా అండాశయాన్ని చేరుతాయి. అర్థమైందా దగ్గు మందు గర్భాధారణకు ఎలా సహాయపడుతుందో? చాలా సింపుల్ గా స్కర్విక్స్ నుండి గర్భాశయం వరకూ మ్యూకస్ ను ఫ్రీ చేస్తుంది.

#3

#3

మరికొందరి అభిప్రాయం ప్రకారం ఈ దగ్గు మంది పురుషుల్లో వంద్యత్వాన్ని నివారిస్తుందని, స్మెర్మ్ కౌంట్ పెంచుతుందని, శుక్రకణాలను చురుకుగా మార్చుతుందని అంటున్నారు. అయితే సైటింఫిక్ గా అందుకు ఆధారాలంటూ ఏవి లేవు.

#4

#4

మరైతే ఈ దగ్గు మందును ఎప్పుడు తీసుకోవాలి? నెలలో మహిళలో ఓవలేషన్ జరిగే రోజుల్లో ఈ దగ్గు మందును తీసుకోవడం మంచిది. మహిళలు మాత్రమే కాదు పార్ట్నర్ తో పాటు పురుషులు కూడా మహిళలో ఓవలేషన్ జరిగే రోజుల్లో తీసుకోవచ్చు.

#5

#5

అన్ని రకాల దగ్గు మందులు సహాయపడుతాయా? లేదు!వేటిలో అయితే గైఫెన్నేషిన్ (కఫోత్సారకం) అనే పదార్థం ఉంటుందో అది మాత్రమే సహాయపడుతుందని అంటున్నారు. మిగిలిన రకాల దగ్గు మందుల్లో మ్యూకస్ డ్రైగా మారడానికి తయారుచేసుంటారు.

జాగ్రత్తలు:

జాగ్రత్తలు:

గైనకాలజిస్ట్ లేదా డాక్టర్ ను కలవకుండా మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు.లేదంటే దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి.

English summary

Can Cough Syrup Help You Get Pregnant?

Can Cough Syrup Help You Get Pregnant? ,Though it sounds very strange, there are some people who use cough syrup to increase the chances of getting pregnant!
Subscribe Newsletter