For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొట్టిగా ఉన్న మహిళలు పిల్లలను కనేందుకు మరిన్ని సమస్యలను కలిగి ఉంటారా !

|

గర్భధారణ అనేది మహిళల పూర్తి జీవితంలోనే చాలా సంతోషకరమైన సమయము. ఒక మహిళ యొక్క శరీరం ఈ సమయంలో భారీ మార్పుల రూపాంతరానికి గురవుతుంది, మాతృత్వమును పొందటం కోసం ఆమెను సిద్ధంగా తయారు చేయుటకు జరిగే మార్పులు, మంచిగాను మరియు చెడుగాను వంటి ఆ రెండు కూడా కావచ్చు. నేడు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, చాలామంది మహిళలు ముందుగానే ఈ మార్పులను ఎదుర్కొంటున్నారు. కానీ ఈ వ్యాసం మార్చలేని లక్షణాలు కలిగిన మహిళల కోసం మరియు ఒక నిర్దిష్ట స్థాయి వరకూ ఆమె డెలివరీని ప్రభావితం చేస్తుంది. ఇది ఆ మహిళ యొక్క ఎత్తు కారణంగా !

శాస్త్రవేత్తలు సుమారు 3000 మంది మహిళలను అధ్యయనం చేశారు మరియు పొట్టిగా ఉన్న గర్భిణీ స్త్రీలు మరియు ముందుగా శిశువుకు జన్మనివ్వటం మధ్య గల ఒక ఆసక్తికరమైన సంబంధాన్ని కనుగొన్నారు. పూర్తిస్థాయిలో వచ్చే పురిటినొప్పులు అనేవి, ఆ మహిళల జన్యుపరంగా ఉన్న ఎత్తు కారణం కానే కాదు, ఇది వారి యొక్క పోషకాహారం, అలవాట్లు మరియు జీవనశైలి కారణంగా మాత్రమే అని వారు నిర్ధారించారు.

గర్భిణీ నార్మల్ డెలివరీ కోసం కొన్ని ఎఫెక్టివ్ ప్రెగ్నెన్సీ టిప్స్

ఈ అధ్యయనం కూడా మహిళలు గర్భిణిగా ఉన్నంతకాలం సరైన ప్రినేటల్ యొక్క జాగ్రత్తలు తీసుకున్నప్పుడు, ఎత్తు తక్కువగా ఉండటం గురించి అతిగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే, చిన్న తల్లులుగా ఉండాల్సినప్పుడు మాత్రం కొన్ని సంక్లిష్టతలు సంభవించేందుకు కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాసాము అటువంటి విషయాలను గూర్చి వివరిస్తుంది. అవేంటో తెలుసుకోవడానికి మీరు కూడా చదవండి.

do shorter women have more complications in giving birth

మెడికల్ ఫీల్డ్ ద్వారా పరిగణించబడే "చిన్న ఎత్తు"

మనము చిన్నగా ఉన్న మహిళల యొక్క గర్భసమస్యల గురించి మాట్లాడుతున్నాము. ఒక మహిళ యొక్క సాధారణ యోని డెలివరీ అనేది ఏ ఎత్తులో సమస్యాత్మకంగా ఉంటుంది?

నిజంగా చెప్పాలంటే, ఈ ప్రశ్నకు ప్రత్యేకమైన సమాధానం ఏమి లేదు.

గర్భిణీలో డిప్రెషన్ లక్షణాలు, డిప్రెషన్ తగ్గడానికి నేచురల్ మార్గాలు

దీని గురించి మాట్లాడుతూ, 5 అడుగుల కంటే తక్కువ ఎత్తు గల మహిళను "చిన్నదని" భావిస్తారు. అలాగే ఇతర అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇది వాస్తవానికి, 5 అడుగుల కంటే తక్కువ ఎత్తు గల స్త్రీలు - నార్మల్ డెలివరీకి అనుకూలమైన వారు కాదని మాత్రం అర్థం కాదు. అలాంటి సందర్భాలలో కూడా నార్మల్ డెలివరీ అనేది విజయవంతమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. 5 అడుగుల కంటే తక్కువగా ఉన్న స్త్రీలకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రమే తెలియజేస్తున్నది.

ప్రధానంగా ఈ క్రింది సమస్యలు సంభవించవచ్చు

బిడ్డకు ముందుగా జన్మనివ్వడం :

బిడ్డకు ముందుగా జన్మనివ్వడం :

బిడ్డకు ముందుగా జన్మనివ్వడం అనేది మొట్టమొదటి సంభవించే సంక్లిష్టమైన పరిస్థితిగా ఉంటుంది, ఇది సాధారణంగా గర్భం దాల్చిన చిన్నగా ఉన్న మహిళలలో తలెత్తవచ్చు. 37 వారాల కంటే ముందుగా జన్మనిచ్చిన శిశువును - "అకాల పుట్టుకగా" పరిగణించబడుతుంది. ఇటువంటి పిల్లలు శ్వాసక్రియ మరియు జీర్ణక్రియతో సమస్యలను కలిగి ఉండవచ్చు. అనేకమంది మహిళలపై జరిపిన ఒక అధ్యయనంలో, గర్భంలో బిడ్డను మోస్తున్నా వ్యవధిని - మాతృత్వం ఎత్తు అనేది ప్రభావం చూపుతుంది.

సెఫలోపెల్విక్ యొక్క అసమానత :

సెఫలోపెల్విక్ యొక్క అసమానత :

శిశువు తల, సాధారణ యోని-డెలివరీ కోసం తల్లి యొక్క పొత్తికడుపుకు అనుగుణంగా లేని ఒక సంక్లిష్టమైన వైద్య పరిస్థితి ఇది. చాలా సందర్భాలలో, శిశువు యొక్క తల జనన కాలువ గుండా వెళ్ళేటందుకు పెద్దదిగా ఉంటుంది. చిన్నగా ఉన్న మహిళలను - ఇతరులతో పోల్చినప్పుడు వారు పొత్తికడుపును చిన్నదిగా కలిగి ఉంటారు, ఇది సాధారణంగా చిన్నగా ఉన్న మహిళల్లో జరుగుతుంది.

ప్రసూతి నాళవ్రణము :

ప్రసూతి నాళవ్రణము :

ఒక ప్రసూతి నాళవ్రణం అనేది యోని మరియు మూత్ర నాళం లేదా పురీషనాళం మధ్య ఏర్పడే ఒక రంధ్రం. రెండు అవయవాలు మధ్య చర్మం ఒక ప్రకరణముగా సృష్టించబడిన ఒక మార్గాన్ని ఇస్తుంది. పుట్టే శిశువు చాలా పెద్దదిగా ఉన్నప్పుడు, శిశువును బయటకు పంపించటకు దీర్ఘకాలముగా చేసే ప్రయత్నాలలో, అవసరమైతే కణజాలమును నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రసూతి నాళవ్రణం యొక్క సంభావ్యత తక్కువగా ఉన్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

తక్కువ బరువు మరియు ఎత్తు కలిగి ఉన్న శిశువు :

తక్కువ బరువు మరియు ఎత్తు కలిగి ఉన్న శిశువు :

చిన్నగా ఉన్నా మహిళల విషయంలో గర్భాశయ మరియు పొత్తికడుపు పరిమాణాలు తక్కువ ఉండటం వలన, శిశువుకి అభివృద్ధి కోసం తగినంత అనువైన పరిస్థితులు లభించదు; మరియు ఇది ఒక చిన్న శిశువు జననానికి దారితీస్తుంది. ఇలా ఆ శిశువు పెరిగిన ప్రభావం ఆధారంగా ఆ బిడ్డ బరువును మరియు ఎత్తు ఆధారపడి ఉంటాయి.

భగచ్ఛేదన (ఎపిసోటోమీ) :

భగచ్ఛేదన (ఎపిసోటోమీ) :

ఎపిసోటోమీ అనేది చాలా మంది స్త్రీలకు, ప్రత్యేకంగా మొదటి ప్రసవ సమయంలో జరుగుతుంది కాబట్టి ఇది ఒక సమస్య కాదు. శిశువు యొక్క శిరస్సును రక్షించడానికి యోని మరియు పాయువు మధ్య చిన్నగా కట్ చేయబడుతుంది. కత్తిరించడం / కోయడం ఖచ్చితంగా చిన్న మహిళలకు లోతుగా ఉంటుంది మరియు ఇది నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

పిండం యొక్క బాధ :

పిండం యొక్క బాధ :

దీర్ఘకాలిక శ్రమ కారణంగా, పిండం కడుపులో అసౌకర్యంగా ఉంటుంది మరియు కొన్ని సమయాల్లో వాటి మనుగడ కోసం ఆక్సిజన్ కూడా అవసరమవుతుంది. ఈ పరిస్థితి చాలా అరుదుగా సంభవిస్తుంది.

అధిక రక్తస్రావం:

అధిక రక్తస్రావం:

శిశువుకు బయటకు రావడానికి తక్కువ స్థలము(స్పేస్) ఉన్నందున, ఆ శిశువు యొక్క అనుకూలమైన జననం కోసం అప్లై చేసే ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది యోనిలో కణజాలకు నష్టమును కలిగిస్తుంది మరియు సాధారణ కంటే ఎక్కువ రక్తస్రావమునకు దారితీస్తుంది.

సమస్యల అవకాశాలను తగ్గించటం ఎలా?

సమస్యల అవకాశాలను తగ్గించటం ఎలా?

ప్రసూతి మహిళల ఎత్తు అనేది, ఆమె గర్భం మీద ప్రభావం చూపే అనేక అంశాలలో ఒకటి. ఎత్తు పెంచడానికి ఏదీ చేయలేము, ఎందుకంటే ఇది ఎక్కువగా జన్యువులపై ఆధారపడి ఉంటుంది. కానీ, చిన్నతనంలో సరైన పోషణ లేకపోవడం వలన ఎత్తు పెరుగుదలలో జాప్యం వస్తుంది.

కాబట్టి, తల్లులు సరైన ఆహారాన్ని తమ పిల్లలకు అందించడానికి జాగ్రత్తలను తీసుకోవాలి. గర్భధారణ సమయంలో, ఆ ప్రక్రియ మరింత సులభతరం చేయడానికి అవసరమైన ఇతర కారకాలపై దృష్టిని పెట్టడం మంచిది. సరైన ఆహారం తీసుకోవడం, తగిన బరువు పెరుగుట, తగిన వ్యాయామం మరియు గర్భధారణముల మధ్య కనీస కాలవ్యవధి 18-23 నెలలుగా ఉండాలి.

English summary

do shorter women have more complications giving birth | Pros and cons of getting pregnant for a shorter girl

Check out the pros and cons of pregnancy for a shorter girl.
Story first published: Tuesday, November 14, 2017, 15:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more