వేడి వాతావరణం వల్ల గర్భధారణ సమయంలో డయాబెటిస్ రిస్క్?

Posted By: Staff
Subscribe to Boldsky

గర్భిణీ స్త్రీలు సగటు ఉష్ణోగ్రత 24 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నపుడు బైటికి వెళ్ళకూడదు, అది గర్భస్ధ మధుమేహ ప్రమాదాన్ని అభివృద్ది చేస్తుందని, పరిశోధకులు చెప్పారు.

సగటు ఉష్ణోగ్రత 10 డిగ్రీలు లేదా అంతకంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న శీతల వాతావరణంలో ఉన్న గర్భిణీ స్త్రీలలో, వ్యాధి అభివృద్ధికి తక్కువ అవకాశాలు ఉన్నాయని, అధ్యయనం పేర్కొంది.

వేడి వాతావరణంలో బైటికి వచ్చే గర్భిణీలలో 7.7 శాతం గర్భస్ధ మధుమేహ ప్రమాద అభివృద్ది చెందితే, శీతల వాతావరణంలో నివశించే గర్భినీలలో 4.6 శాతం మాత్రం ప్రమాదం పొంచి ఉంటుందని అధ్యయన ఫలితాలు తెలుసుకోడానికి ప్రయత్నించాయి.

pregnancy articles

ఇంకా, ఉష్ణోగ్రత 10 డిగ్రీలు పెరిగిన ప్రతిసారీ, ప్రమాద౦ ఆరు నుండి తొమ్మిది శాతం ఎక్కువగా ఉంటుంది, చల్లని వాతావరణంలో మనిషిలోని బ్రౌన్ ఫాట్ చురుకుగా అయి వేడిని పుట్టించి, మన శరీరంలో జీవక్రియను మెరుగ్గా ఉంచుతుంది.

"వెచ్చని ఉష్నోగ్రతలో, బైట చురుకుగా ఉన్న మహిళలు, గర్భాదారణ సమయంలో బరువు తగ్గడానికి సహాయపడి, గర్భస్ధ మధుమేహాన్ని ముందుగానే గుర్తించడం జరుగుతుందని చాలామంది అనుకుంటారు," అని కెనడాలో ఒంటారియో లోని సెయింట్ మైకేల్ హాస్పిటల్ లో ప్రస్తుత రచయిత, పరిశోధకుడు గిల్లియన్ బూత్ చెప్పారు.

pregnancy articles

"అయితే, గోధుమ కొవ్వు కణజాలం అని పిలిచే రక్షిత కొవ్వు రకంగా మారడం వల్ల చల్లని ప్రదేశంలో తిరగడం వల్ల గర్భిణీల్లో ఇన్సులిన్ సెన్సిటివిటి మెరుగుపరుస్తుంది," అని బూత్ చెప్పారు.

అధ్యయనం కోసం, 12 సంవత్సరాల కాలంలో (2002 నుండి 2014 వరకు) కెనడాలో నివసిస్తున్న 3,96,828 మహిళల్లో 5,55,911 మందికి జన్మనిచ్చారని కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించింది.

pregnancy articles

అంతే కాకుండా, కెనడా, యుఎస్ తోపాటు శీతల వాతావరణంలో పుట్టిన స్త్రీలు, గర్భధారణ సమయంలో శీతల వాతావరణంలో ఉండడం వల్ల వారిలో గర్భస్ధ మధుమేహం 3.6 శాతం మాత్రమే ఉంటే, వేడి వాతావరణంలో ఉన్న గర్భిణీలలో గర్భస్ధ మధుమేహం 6.3 శాతం ఉంటుందని నిర్ధారించారు .

English summary

Hot Weather May Up Risk Of Diabetes In Pregnancy

Pregnant women should not expose themselves to temperatures averaging 24 degrees Celsius or above, as they would run the risk of developing gestational diabetes, researchers said.
Subscribe Newsletter