TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
పండ్లలో రారాజు ‘మామిడి పండ్లు’ ను గర్భిణీలు తింటే అద్భుత ప్రయోజనాలు..!
మహిళ గర్భం పొందడం అత్యంత సున్నితమైన అంశం. మరో ప్రాణికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోయే తల్లికి శిరస్సు వంచి నమస్కరించాల్సిందే..
మహిళ గర్భం పొందిన తర్వాత, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భం పొందినప్పటి నుండి ఆమెకు ఇంట్లో వారితో పాటు, సన్నిహితులు, స్నేహితులు ఎన్నో సూచనలు అందిస్తుంటారు. ముఖ్యంగా బేబీ పుట్టే వరకూ జాగ్రత్తలు తీసుకోవల్సిందిగా సూచిస్తుంటారు.
అటువంటి సూచనల్లో ముఖ్యంగా ఆహారాల గురించి..ఈ సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. మహిళ గర్బం పొందిన తర్వాత పుల్లని పదార్థాలకు దూరంగా ఉండాలని చెబుతారు. అందుకు కారణం పుల్లని పదార్థాల్లో ఉండే అసిడిక్ నేచుర్. అయితే మహిళలు గర్భం పొందిన మొదట నెల నుండి పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుందని చెబుతుండటం సహజం.
మహిళ గర్భం పొందిన తర్వాత పుల్లపుల్లగా వగరుగా ఉండే మామిడి పండ్లను ఎక్కువగా ఇష్టపడుతుంది. అయితే చాలా మంది ఈ సమయంలో మామిడికాయను తినకూడదని సలహాలిస్తుంటారు.
గర్భిణీలు మామిడి పండ్లు తినవచ్చా?
ప్రెగ్నెన్సీ లో కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ ను తీసుకోవాలి. సమ్మర్లో గర్భం దాల్చితే మాత్రం మామిడి పండ్ల మీద క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. అయితే గర్భిణీల ఖచ్ఛితంగా మామిడి పండ్ల తినొచ్చా తినకూడదు లేదా మామిడిపండ్లు తినడం సురక్షితమేనా ? తెలుసుకుందాం..
విటమిన్ ఎ:
మామిడికాయలో ఉండే విటమిన్ ఎ, కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. మామిడికాయలో ఉండే కెరోటిన్ కంటెంట్ వివిధ రకాల వ్యాధులను నివారిస్తుంది. ఇంకా ఫీటస్ గ్రోత్ కు సహాయపడుతుంది. ఫీటస్ లో హార్ట్, లంగ్స్, కిడ్నీ, బోన్స్, మరియు కళ్లు డెవలప్ మెంట్ కు సహాయపడుతుంది. వివిధ రకాల బాడీ సిస్టమ్స్ ను , కార్డియక్, రెస్పిరేటరీ మరియు ఇతర నాడీవ్యవస్థను డెవలప్ చేయడానికి సహాయపడుతుంది
ఫైబర్ :
మామిడి పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. చాలా మంది మహిళలు మలబద్దకంతో బాధపడుతుంటారు. మామిడికాయలో ఉండే ఫైబర్ కంటెంట్ ఈ సమస్యను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది బ్లడ్ ప్రెజర్ ను నార్మల్ లెవల్స్ కు తీసుకొస్తుంది.
విటమిన్ సి:
విటమిన్ సి వెరీ వెరీ పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ . ఇది హానికరమైనవి శరీరంలో డెవలప్ కాకుండా నివారిస్తుంది. ఆక్సిజన్ ఫ్రీరాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడుతుంది. ఇది డీజనరేటివ్ డిసీజ్ వంటి క్యాన్సర్ ను నివారిస్తుంది. ఇంకా మామిడి కాలో ఉండే విటమిన్ సి కంటి చూపును మెరుగుపరుస్తుంది. న్యూమరాలజికల్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది. ఇది కొల్లాజెన్ ఫార్మేషన్ ను పెంచుతుంది. గాయాలను మాన్పుతుంది. దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఫీటస్ డెవలప్ చేస్తుంది. ముఖ్యంగా విటమిన్ సి శరీరంలో ఐరన్ గ్రహించడాినకి సహాయపడుతుంది.
పొటాషియం:
మామిడి పండ్లలో ఉండే పొటాషియం హార్ట్ రేటును కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. మరియు బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. గర్భధారణ సమయంలో బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. కాబట్టి ఎక్స్ ట్రా మినిరల్స్ అందిస్తుంది. అలాగే పొటాషియం శరీరంలో ఫ్లూయిడ్స్ మరియు ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ క్రాంప్స్ ను నివారిస్తుంది.
విటమిన్ బి6:
విటమిన్ బి6 మతిమరుపును నివారిస్తుంది. నార్మల్ నర్వ్ ఫంక్షన్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. హెల్తీ ఇమ్యూనిటిని మెరుగుపరుస్తుంది. ఇంకా మార్నింగ్ సిక్ నెస్ మరియు వికారం తగ్గిస్తుంది. రెడ్ బ్లడ్ సెల్స్, మరియు న్యూరో ట్రాన్స్ మీటర్స్ ను ఫార్మేషన్ ను నివారిస్తుంది. ఇది బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ ను మరియు నర్వస్ సిస్టమ్ ను మెరుగుపరుస్తుంది.
కాపర్:
కాపర్ ఒక ముఖ్యమైన న్యూట్రీషియన్ ఇది , బ్లడ్ ఫార్మేషన్ కు సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మినిరల్స్ కూడా పెరుగుతాయి. హార్ట్ , స్కెలిటిన్ సిస్టమ్, బ్లడ్ వెజిల్స్ ఫార్మేషన్ కు సహాయపడుతుంది. బోన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.
ఫొల్లెట్ :
మామిడికాలో ఉండే ఫొల్లెట్ కంటెంట్ ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కు ఫొల్లెట్ కంటెంట్ డాక్టర్స్ సూచిస్తుంటారు. ఫొల్లెట్ లోపం వల్ల బ్రెయిన్ మరియు స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ ను లోపాలను నివారిస్తుంది. ఫొల్లెట్ రెడ్ బ్లడ్ సెల్స్, డిఎన్ ఎ ఏర్పాటుకు సహాయపడుతుంది. కార్డియక్ ఫంక్షన్ సిస్టమ్ కు సహాయపడుతుంది.