For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం సురక్షితమేనా..?

By Staff
|

ఒక మహిళ అమ్మ అవుతుందనే వార్త ఆమెకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే, ఆమె గర్భధారణ సమయంలో ఏర్పడే కొన్ని ఆరోగ్య సమస్యల గురించి భయపడుతుంది.

గర్భధారణ అనేది ఒక స్త్రీ యొక్క జీవితంలో ఒక అత్యంత సున్నితమైన దశ. ఈ సమయంలో ఆమె ఆరోగ్యానికి స్థిరమైన ప్రమాదం ఏర్పడవచ్చు. ఇది ఆమె ఆరోగ్యం మరియు పుట్టబోయే బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది.

hypothyroidism

గర్భధారణ మరియు హైపోథైరాయిడిజం చికిత్స

గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఆరోగ్యకరమైన అలవాట్ల సాధన ద్వారా గర్భిణీ స్త్రీ మరియు బిడ్డ నిర్దిష్ట ఆరోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు .

అయితే, కొన్నిసార్లు గర్భధారణకు ముందే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక ఆమె గర్భవతి అయినప్పుడు హానికరం అని చెప్పవచ్చు.

ఉదాహరణకు, మధుమేహం లేదా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ గర్భం పొందితే అప్పుడు ఆమెకు ప్రత్యేకమైన రక్షణ మరియు చికిత్స అందించాలి. అదేవిధంగా, హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న మహిళ గర్భం ధరిస్తే సురక్షితమైన చికిత్సను అందించవచ్చు.

hypothyroidism

హైపోథైరాయిడిజం అంటే ఏమిటి?

థైరాయిడ్ గ్రంధి తగినంత థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేయనప్పుడు ఏర్పడే స్థితిని హైపోథైరాయిడిజం అని అంటారు. దీని వలన అనేక ప్రతికూల లక్షణాలు కలుగుతాయి.

ఈ పరిస్థితికి ఎవరైనా ప్రభావితం కావచ్చు. అలసట, సాధారణ బలహీనత, యవ్వనారంభం ఆలస్యం, అసాధారణ రుతు చక్రాలు,మూడ్ స్వింగ్స్, జుట్టు నష్టం, బరువు పెరుగుట మొదలైనవి ప్రధాన లక్షణాలుగా ఉన్నాయి.

హైపోథైరాడిజంకు లక్షణాలను బట్టి వివిధ హార్మోన్ల చికిత్సలను చేస్తారు.

hypothyroidism

గర్భధారణ సమయంలో హైపోథైరాయిడిజం చికిత్స సురక్షితమేనా?

కొన్ని వ్యాధుల చికిత్సలో గర్భధారణ సమయంలో సురక్షితం అని భావిస్తారు. పుట్టే బిడ్డకు హాని కలిగించని మందులను ఇస్తారు.

ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కూడా హైపోథైరాయిడిజంతో బాధ పడుతూ ఉంటే చికిత్స తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే, హైపో లక్షణాలు ఎక్కువగా ఆమె శిశువు యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం చేయవచ్చు.

మయో క్లినిక్ ఇటీవల నిర్వహించిన పరిశోధన అధ్యయనంలో మహిళలు గర్భధారణ సమయంలో థైరాయిడ్ చికిత్స చేయించుకోకపోతే అకాల శిశువుల జననం మరియు గర్భస్రావాలు జరుగుతాయని తెలిపింది. ఈ సమయంలో హార్మోన్ల కార్యకలాపాలలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి.

నిపుణులు కూడా చికిత్స సురక్షితం అని చెప్పుతున్నారు. ఒక ప్రొఫెషనల్ పరిశీలనలో మందులు వాడితే తల్లి లేదా శిశువుకు ఎటువంటి హాని జరగదు.

English summary

Is It Safe To Treat Pregnant Women For Hypothyroidism?

The minute a woman finds out that she is about to be a mother, she is filled with extreme joy; however, she can also be worried about some of the health complications that can occur during pregnancy.
Desktop Bottom Promotion