For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో చింతపండుని తినడం సురక్షితమేనా?!

By Ashwini Pappireddy
|

గర్భధారణ సమయంలో మీ రోజులు గడుస్తున్న కొద్దీ మీ శరీరం, అలవాట్లు మరియు ప్రవర్తనలో కూడా మార్పులొస్తాయి. ఇలాంటి మార్పుల్లో కొన్ని మీకిష్టమైన రుచుల మీద కూడా ప్రభావితం చేయవచ్చు, ఇలాంటి సందర్భాలలో మీరు కొత్త, వింత ఆహారాలను రుచి చేయడానికి ఇష్టపడవచ్చు. రుచుల మీద మీకు కలిగే ఈ మార్పునే డైస్యుజియా అని పిలుస్తారు.

సాధారణంగా చాలామంది మహిళలు గర్భవతులుగా వున్నప్పుడు నిమ్మ, ఊరగాయలు మరియు గ్రేప్ఫ్రూట్ వంటి పుల్లని ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతుంటారు. అది కూడా ప్రత్యేకంగా గర్భవతిగా వున్న మొదటి మూడు నెలల్లో ఇలాంటి ఆహారాన్ని రుచి చేయాలనుకుంటారు. గర్భధారణ సమయంలో మహిళలు ఎక్కువగా ఇష్టపడే ఆహార జాబితాలో చింతపండు మొదటి స్థానంలో వుంది. కానీ ప్రతి కోరిక ఆరోగ్యకరమైనది కాదు. గర్భధారణ సమయంలో చింతపండు తినడం మంచిదేనా? అంటే మా సమాధానం అవును అనే చెప్పాలి. మీరు విటమిన్ బి3లేదా సి మాత్రల కంటే అధికంగా తినకపోతే,ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

గర్భధారణ సమయంలో చింతపండు తినడం సురక్షితమేనా?

మీకు తెలుసా? మీకు మరియు మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు చింతపండు లో పుష్కలంగా ఉంటాయి. చింతపండు, నారింజ, నిమ్మ, ద్రాక్షపండు, ఆకుపచ్చ మామిడి వంటి పుల్లని పండ్లు విటమిన్లు, ఖనిజాలు మరియు అనామ్లజనకాలు వంటి వాటిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ పుట్టబోయే బిడ్డ శరీర పెరుగుదలకు మరియు అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఇందులో అనేక చింతపండ్లు ఉన్నప్పటికీ, చాలామంది స్త్రీలు తీపి చింతనే ఎక్కువగా ఇష్టపడుతారు.

అయితే, ప్రతి ఆహారాన్ని సరైన పద్దతిలో కచ్చితమైన కొలతలతో తీసుకోవాలని గుర్తుంచుకోండి - ఇది ఆరోగ్యకరమైన శరీరానికి చాలా అవసరం. మీ డైట్ లో మీరు కొత్త ఆహారాన్ని జత చేసే ముందు మీ డాక్టర్ మరియు మీ గైనకాలజిస్ట్ను సంప్రదించడం చాలా ముఖ్యం.

తీపి చింతపండులో వుండే వివిధ రకాల పోషక ప్రయోజనాల వలన ఇది చాలా మంది గర్భిణీ మహిళల ఆహార జాబితా లో సులభంగా చోటు సంపాదించుకుంటుంది.

1. భ్రూణ అభివృద్ధికి సహాయపడుతుంది

1. భ్రూణ అభివృద్ధికి సహాయపడుతుంది

చింతపండులో నియోసిన్ (నికోటినామైడ్) లేదా విటమిన్ బి3,4 లకి మంచి మూలం,100 జి లో 1.9 ఎంజి నియాసిన్ ఉంటుంది. గర్భిణీ స్త్రీకి రోజువారీ 10% అవసరాన్ని కల్పిస్తుంది మరియు నరాలు, మెదడు, జీర్ణ వ్యవస్థ మరియు మీ పుట్టబోయే శిశువులోని శ్లేష్మ పొరల అభివృద్ధికి ఇది మంచిది.

గమనిక: మీరు ఇప్పటికే విటమిన్ బి3 తీసుకుంటూ ఉన్నట్లయితే, మీ బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉండవచ్చనే విషయం ఫై మీ నియాసిన్ అధికంగా లభించే ఆహారాల పదార్థాలను తీసుకునే ముందు ఒకసారి మీ డాక్టర్తో సంప్రదించాలి.

2. మలబద్ధకం మరియు బరువు పెరగటాన్ని నిరోధిస్తుంది

2. మలబద్ధకం మరియు బరువు పెరగటాన్ని నిరోధిస్తుంది

చింతపండులో ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడే ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల సాధారణంగా గర్భిణీ స్త్రీలను బాధపెట్టే మలబద్ధకాన్ని నివారించడానికి ఇది ఉత్తమమైన మార్గంగా చెప్పవచ్చు.ఫైబర్ పుష్కలంగా వున్న ఈ ఆహారాన్ని తినడం వలన గర్భిణీ స్త్రీలను అధిక బరువు పెరగకుండా నిరోధిస్తుంది. ఫైబర్ తో నిండి ఉన్నందున, ఇది అవసరమైన దానికంటే ఎక్కువ తినేలా చేయగలదు, ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఇది ముఖ్యం.

ప్రకటన

3. ఉదయంవేళ అనారోగ్యానికి చికిత్స

3. ఉదయంవేళ అనారోగ్యానికి చికిత్స

చాలామంది స్త్రీలు వారి మొదటి మూడు నెలలో ఉదయం అవగానే వాంతులు మరియు వికారంతో అనే అనారోగ్యంతో పోరాడుతారు. ఇది అలసిపోతున్నప్పుడు, ఉదయం అనారోగ్యం తరచుగా ఆరోగ్యకరమైన గర్భాన్ని సూచిస్తుంది. ఉదయం వేళ వచ్చేటటువంటి ఇలాంటి అనారోగ్యాన్ని సహజ నివారిణి చింతపండు అనే చెప్పాలి. మాలిక్ ఆమ్లం, టార్టారిక్ ఆమ్లం, మరియు పొటాషియం వంటి వాటిని అధిక మొత్తంలో కలిగివుండటం కారణంగా ఇది కడుపులో మంచి భేదిమందు ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీలు మొట్టమొదటి త్రైమాసికంలో అనుభవించే వాంతులు మరియు వికారం తగ్గడానికి ఇది చక్కగా సహాయపడుతుంది.

4. అకాల పుట్టుక ప్రమాదాన్ని తగ్గిస్తుంది

4. అకాల పుట్టుక ప్రమాదాన్ని తగ్గిస్తుంది

గర్భధారణ సమయంలో, రక్తం విస్తరిస్తూ ఉంటుంది. రక్తము పెరుగుదలకు కారణమైన ఇనుము కి

చింతపండు ఒక గొప్ప వనరు లాంటిది. గర్భధారణ సమయంలో ఇనుముని బాగా తీసుకోవడం వలన మీ శిశువులో తక్కువ జనన బరువు అవకాశాలు తగ్గిపోతాయి.

5. గర్భధారణ మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5. గర్భధారణ మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చాలా మంది మహిళలలో, గర్భం పెరిగే కొద్దీ లేదా అసాధారణ ఇన్సులిన్ నిరోధకత మరియు గ్లూకోజ్ అసహనం కలిగించవచ్చు. ఇది గర్భధారణ మధుమేహానికి దారితీస్తుంది, ఇది తల్లి, బిడ్డ ఇద్దరికి భవిష్యత్తులో టైప్ 2 మధుమేహం మరియు జీవక్రియ అసాధారణ ప్రమాదాన్ని పెంచుతుంది. చింతపండుని తినడం వలన శరీరానికి చక్కెర స్థాయిలను నియంత్రించి, గర్భసంబంధమైన మధుమేహంను అదుపులో ఉంచుతుంది.

6. అధిక రక్తపోటు అవకాశాలను తగ్గిస్తుంది

6. అధిక రక్తపోటు అవకాశాలను తగ్గిస్తుంది

అధిక రక్తపోటుతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలలో, అధిక పొటాషియంని కలిగివున్న చింతపండు అధిక రక్తపోటు ని తగ్గించడంలో ఎంతో ప్రయోజనకరమైనది.

7. ఇమ్మ్యునిటీని పెంచుతుంది మరియు క్యాన్సర్ను నివారించడానికి సహాయపడవచ్చు

7. ఇమ్మ్యునిటీని పెంచుతుంది మరియు క్యాన్సర్ను నివారించడానికి సహాయపడవచ్చు

100 జి ల చింతపండులో 11.43 ఎంజి ల విటమిన్ సి ని కలిగి ఉంటుంది. ఇది ముఖ్యమైన విటమిన్ 12 కి మంచి మూలం. అందువల్ల చింతపండు గర్భధారణ సమయంలో స్త్రీలలో రోగనిరోధకతను పెంచుతుంది. ఇది శ్వాసక్రియను పెంపొందిస్తుంది మరియు చర్మం ఆరోగ్యకరమైన గ్లో ని తెస్తుంది.

విటమిన్ సి అనామ్లజని లక్షణాలను కలిగి ఉంది మరియు హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడటంలో సహాయం చేస్తుంది.

English summary

Is Tamarind Healthy for Pregnant Women?

It is, however, important to remember that every food must be consumed in moderation – this is the key to a healthy body. It is also very important to consult your doctor and your gynecologist before introducing new foods to your diet.
Story first published:Saturday, December 9, 2017, 14:46 [IST]
Desktop Bottom Promotion