For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో బ్రెస్ట్ (వక్షోజాలు) రంగు మారుటకు గల కారణాలు

|

మాతృత్వం అనేది ఏ స్త్రీ జీవితంలో అయిన చాలా అద్భుతమైన దశ. ఇది ముఖ్యంగా మీరు కొత్తగా మాతృత్వంను కలిగి మళ్ళీ "అమ్మగా" మారే ఒక ముఖ్యమైన, ఆశ్చర్యకరమైన సందర్భంగా ఉంటుంది. అలాంటి మార్గంలో మీకు ఎందుకు తొమ్మిది నెలల సమయం పడతుందో మీకు ఎన్నటికీ తెలియదు. మీ శరీరానికి సంభవించే మార్పుల గురించి మీకు తెలిసినా, ఇతరులతో తక్కువగా చర్చించబడేందుకు, తక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు.

అయితే, ముఖ్యమైన మార్పులు కడుపు మరియు రొమ్ము పరిమాణంలకు సంభవిస్తాయి. ఈ సమయంలోనే రొమ్ముల కూడా సంపూర్ణంగా పరిమాణం అవుతుంది. కొంతమంది స్త్రీలలో, ఛాతీ భాగంలో గల చనుమొనల నుండి పసుపు రంగు ద్రవం కారడం జరుగుతుంది. ఇందులో చాలా ఎక్కువ స్థాయిలో పోషకాలను కలిగి ఉంటుంది. పెరిగిన రక్త ప్రవాహం కారణంగా సిరలను కూడా చూడవచ్చు.

<strong>మహిళలకు బ్రెస్ట్ లో కనిపించే మార్పులు హెల్త్ పై ప్రభావం చూపుతాయా ?</strong>మహిళలకు బ్రెస్ట్ లో కనిపించే మార్పులు హెల్త్ పై ప్రభావం చూపుతాయా ?

కానీ మీరు రొమ్ము రంగులో మార్పులను గూర్చి, చనుమొనలలో మార్పులను గూర్చి, మరియు చనుమొనల చుట్టూ ఉన్న ఉబ్బెత్తుల్లో రంగు మార్పు గూర్చి ఎప్పుడైనా విన్నారా? అవును, దీనిలో గర్భవతి అయిన స్త్రీలలో, మొదటి త్రైమాసికంలో (3 నెలల కాలంలో) చనుమొనల చుట్టూ ఉన్న ఉబ్బెత్తుల్లో - గులాబీ రంగులోకి మారటాన్ని స్పష్టంగా గుర్తించవచ్చు. దానికి కారణమేమిటా అని మీరు ఆశ్చర్యపడలేదా? అయితే దాని గూర్చి చదవండి.

గర్భధారణలో రొమ్ము రంగులో మార్పుకు గల కారణాలు

reasons for breast colour change in pregnancy

హార్మోన్లు :
గర్భధారణ సమయంలో శరీరంలో జరుగుతున్న అన్ని ఇతర మార్పులకు కూడా "హార్మోన్లులే" మొదటి నేరస్థులు. ఈస్ట్రోజన్ మరియు ప్రొజెేస్టిరాన్ అనే ఈ రెండూ దానికి బాధ్యత వహిస్తాయి. గర్భధారణ-హార్మోన్లల ఉత్పత్తి, ఆకస్మిక పెరుగుదలను మెలనిన్ పెంచుతుందని చెప్పబడింది - ఇది జుట్టు, కళ్ళు మరియు చర్మాలకు రంగును అందించే పదార్ధం.

ఫలితంగా, మరింత ఎక్కువగా మెలనిన్ ఉత్పత్తి చేయబడుట వల్ల, చనుమొనల చుట్టూ చర్మం మరింత నల్లగా ఉంటుంది.

reasons for breast colour change in pregnancy

సూర్యకాంతి వల్ల :
దీనిని సమర్ధించటానికి సరైన అధ్యయనాలు లేవు, అయినప్పటికీ, ఎక్కువ సమయం సూర్యకాంతికి గురికావడం వల్ల రొమ్ములు నల్లగా మారుతుందని నమ్ముతారు. సూర్యకాంతిలో ఎక్కువగా తిరగడం వల్ల మెలనిన్ బాగా ఉత్పత్తి చెంది - చర్మం నల్లబడటానికి దారితీసే పదార్ధంగా ఉంటూ చనుమొనలు మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతాలను ప్రభావితం చేసేదిగా ఉంటుంది.

<strong>గర్భధారణ సమయంలో గర్భిణీ రొమ్ముల్లో జరిగే 7 మార్పులు</strong>గర్భధారణ సమయంలో గర్భిణీ రొమ్ముల్లో జరిగే 7 మార్పులు

పరిణామాత్మక ప్రయోజనం :
ఛాతీ యొక్క హైపెర్పిగ్మెంటేషన్ కోసం, ఇతరుల కంటే ఇది మరింత సంతృప్తికరమైన వివరణ. నవజాత శిశువులు (అప్పుడే పుట్టిన పిల్లలలో) అస్పష్టమైన దృష్టిని (చూపును) కలిగి ఉంటారు. అటువంటి పిల్లలకు తల్లిపాలను గుర్తించటంలో సహాయపడటానికి ముదురు రంగులో చనుమొనలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ద్వారా, పిల్లలు వారి తల్లులను గొళ్ళెంలా పట్టుకొని, ఆరోగ్యకరమైన పోషణను కలిగే వారిగా హామీని కలిగి ఉంటుంది.

reasons for breast colour change in pregnancy

ఎంతకాలం వరకు ఈ రంగులో మార్పు ఉంటుంది ?
చనుమొనలు మరియు దాని చుట్టూ ఉన్న చర్మంలో ఇలాంటి మార్పులు తాత్కాలికమని, పిల్లలకు జన్మనివ్వడం తర్వాత అవి మళ్ళీ సాధారణ స్థితికి తిరిగి రావచ్చని శాస్త్రవేత్తలు చెబుతారు. ఖచ్చితంగా చెప్పాలంటే, తల్లులు తమ పిల్లలకు తల్లిపాలను అందించే వరకూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి, ఒక్కసారి తల్లిపాలను పట్టడం ఆపాక తిరిగి మామూలు స్థితిలోకి మారుతుంది.

తల్లిపాలు లేని మహిళలలో చాలా త్వరగా సాధారణ స్థాయికి చేరుకోవడాన్ని చూడవచ్చు. అయినప్పటికీ, కొందరు స్త్రీలకు నలుపు రంగు అనేది వారి జీవితమంతా ఉంటుంది. కానీ, ఇది పూర్తిగా సాధారణమైన చర్య మాత్రమే మరియు ఆందోళన చెందాల్సిన ఒక వైద్య పరిస్థితి అయితే మాత్రం కాదు.

జన్యువులు, BMI, బరువు పెరుగుట, ధూమపానం మరియు అనేక ఇతర అంశాల వంటివి, మీరు తిరిగి-సాధారణ స్థితికి చేరుకునే పెట్టించే అవకాశాలుగా చెప్పవచ్చు. అవి చనుమొనలు మరియు దాని చుట్టూ ఉన్న చర్మ ప్రాంతంలో జరగబోయే ఇతర మార్పులకు కారణాలుగా చెప్పవచ్చు.

చనుమొనలు మరింత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అవి అలాగే వాచినట్లుగా మరియు సున్నితత్వంగా కూడా ఉంటాయి. ఇది ఎల్లప్పుడూ ఒక జలదరింపు సంచలనాన్ని కలిగి ఉంటుంది. డెలివరీ తేదీ దగ్గరకు వస్తున్నందున చనుమొనల చుట్టూ ఉన్న ప్రాంతం మరింత పెద్ద పరిమాణంగా మార్పుచెందుతుంది.

మరో మాటలో చెప్పాలంటే, ఛాతీపై నల్లటి రంగుగా ఉండే ప్రాంతాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇంతేకాకుండా, ఈ రెండు స్తనాలలో చిన్న గడ్డలను చూడవచ్చు. అది మాంట్గోమెరి యొక్క గడ్డ మాత్రమే గాని - వేరే ఇంకేమి కాదు. అవి ఒక రకమైన ద్రవాన్ని స్రవించేదిగా ఉంటూ, చనుమొనలను సరళీకృతం చేస్తూ, వాటికి పగుళ్లు లేకుండా ఉంచడానికి సహాయకారిగా ఉంటుంది.

నిజానికి, ఈ ద్రవము శిశువు యొక్క ఆకలిని పెంచేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అది మాత్రమే కాకుండా, స్తనాలలో - చనుమొనల చుట్టూ జుట్టు పెరిగేదిగా కూడా కనిపిస్తుంది.

English summary

Reasons For Breast Colour Change During Pregnancy

Did you know what is the main reason for breast colour change in pregnancy? Read to know more.
Desktop Bottom Promotion