గర్భిణీలకు జుట్టు రాలడం దగ్గర నుండి క్యాన్సర్ నివారిణి వరకూ సహాయపడే వెల్లులి..!

Posted By:
Subscribe to Boldsky

మహిళల జీవితంలో గర్భధారణ అనేది చాలా కష్టమైన ఘట్టం. కష్టమైన మహిళలు గర్భం పొందడానికి ఇష్టపడుతారు. మాత్రుత్వంలో ఉండే ఆనందం మరెందులో లేదు. గర్భం పొందిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తల్లి తీసుకొనే ఆహారం బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి, ఎక్కువ న్యూట్రీషియన్స్ పొందేలా చూసుకోవాలి . గర్భిణీలు స్త్రీలు తీసుకొనే ఆహారం ప్రత్యేకంగా ఎంపిక చేసి తీసుకోవాల్సి ఉంటుంది.

గర్భణీ మహిళలు ప్రతి ఒక్కటీ తినడానికి లేదు . కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను నివారించడం వల్ల ఆరోగ్యంగా ఉండగలరు ఏదైనా ప్రత్యేకంగా తినాలనిపించినప్పుడు డాక్టర్ ను సంప్రదించి తీసుకోవడం మంచిది .

What Are The Health Benefits Of Eating Garlic During Pregnancy?

గర్భధారణ సమయంలో గర్భిణీలు తినకూడని ఆహారాలు చాలానే ఉన్నాయి . వాటిలో ముఖ్యంగా, బొప్పాయి, పైనాపిల్, వంకాయ, వంటివి తినకూడదు. తినకూడని ఆహారావలే, గర్భాధారణ సమయంలో తినాల్సిన ఆహారాలు కూడా చాలా ఉన్నాయి. వీటి వల్ల మదర్ హెల్త్ తో పాటు, పొట్టలో పెరిగే ఫీటస్ హెల్త్ కు కూడా చాల మంచిది. అలాంటి ఆహారాల్లో గార్లిక్ ఒకటి.

గర్భిణీలకు "కాఫీ, టీ" ల కంటే జింజర్ టీ ఆరోగ్యకరమైనది..సురక్షితమైనది..!

గర్భాధరణ సమయంలో వెల్లుల్లి తినడం వల్ల గర్భిణీస్త్రీలకు చాలా ఎఫెక్టివ్ గా హెర్బ్ గా పనిచేస్తుంది . గర్భధారణ సమయంలో తీసుకోవడం వల్ల గర్భిణీలకు చాలా సురక్షితం మరియు ఆరోగ్యానికి సహాయపడే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

గర్భిణీలకు వాంతులను నివారించే జింజర్ రెమెడీస్ ...

గర్భాధారణ సమయంలో వెల్లుల్లిని ఒక పరిమితిలో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాంటి ప్రయోజనాలను మీరు కోల్పోకుండా చూసుకోవాలి. గర్భిణీ స్త్రీల రెగ్యులర్ డైట్ లో వెల్లుల్లి చేర్చడం వల్ల కలిగే ప్రయోజాలను ఈ క్రింది లిస్ట్ ద్వారా తెలపడం జరిగింది.

గర్భధారణ సమయంలో వెల్లుల్లి తినడం వల్ల పొందే ప్రయోజనాలు...

జుట్టు రాలడం నివారిస్తుంది:

జుట్టు రాలడం నివారిస్తుంది:

గర్బిణీల రెగ్యులర్ డైట్ లో ఉండాల్సిన ఆహారాల్లో వెల్లుల్లి ఒకటి . ఎందుకంటే, వెల్ల్లుల్లి ఉండే అల్లిసిన్ అనే కంటెంట్ జుట్టు రాలడం నివారిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తుంది . బాడీ వెయిట్ ను కంట్రోల్లో ఉంచుతుంది . మరియు హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ లను నివారిస్తుంది . గర్భిణీ మహిళలు వారి రెగ్యులర్ డైట్ లో ఎంత పరిమానంలో తీసుకోవాలో డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి.

క్యాన్సర్ నివారిస్తుంది:

క్యాన్సర్ నివారిస్తుంది:

వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ప్రమాధం ఉండదు. కోలన్ క్యాన్సర్ నివారించడానికి ఇది ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మరియు క్యాన్సర్ ను దూరం చేస్తుంది.

కోల్డ్ మరియు ఫ్లూ నివారిస్తుంది:

కోల్డ్ మరియు ఫ్లూ నివారిస్తుంది:

వెల్లుల్లిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హానికరమైన బ్యాక్టీరియాను దూరం చేస్తుంది . దాంతో జలుబు మరియు దగ్గు నివారించుకోవచ్చు . వ్యాధినిరోధకశక్తి స్ట్రాంగ్ గా ఉంటుంది మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ దూరం చేస్తుంది. అందువల్ల కొన్ని సాధరణ జబ్బులను నివారించుకోవడానికి గర్భిణీ డైట్ లో వెల్లుల్లి చేర్చడం మంచిది.

వైజినల్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

వైజినల్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

వెల్లుల్లి వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఈస్ట్ హైపర్సెన్సిటివిటి సిండ్రోమ్ ను కూడా నివారిస్తుంది. గర్భాధారణ సమయంలో క్యాండిడా రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ దూరం చేయడంలో గార్లిక్ గ్రేట్ గా సహాయపడుతుంది. అందువల్ల గర్భిణీలు తప్పకుండా గార్లిక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి .

English summary

What Are The Health Benefits Of Eating Garlic During Pregnancy?

Eating garlic has many health benefits, some of which are also extremely important while you are pregnant. However, as is mandatory when you are pregnant, make sure you first speak to your doctor about the same before you eat it.
Story first published: Friday, April 7, 2017, 19:00 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter