For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IVF పద్ధతి ద్వారా జన్మించిన బిడ్డల ఆరోగ్యం క్షేమమేనా?

|

మానవ జీవిత క్రమంలో, చిన్న బిడ్డగా జన్మించిన మనిషి, అనతికాలంలో యవ్వనంలోకి అడుగుపెట్టి, తదనంతరం స్త్రీ లేదా పురుషునితో కలిసి పవిత్ర వివాహ బంధంలోకి అడుగుపెడతారు. వివాహం జరిగిన కొన్నాళ్ళకు, ఆ జంట తిరిగి ఒక బిడ్డకు జన్మనిచ్చి, ఆ బిడ్డ ఎదిగేంత వరకు పోషిస్తారు. తిరిగి ఆ బిడ్డకూడా ఇదే క్రమాన్ని అనుసరిస్తుంది.

అయితే దురదృష్టవశాత్తు, కొంతమందికి సహజంగా బిడ్డను కానీ అవకాశం ఉండదు. అటువంటి పరిస్థితి కలిగిన వారు, ఆధునిక పరిజ్ఞానం యొక్క సహకారాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ రోజుల్లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ వంటి పద్ధతుల ద్వారా అటువంటి దంపతులు, తమ రక్తం పంచుకున్న బిడ్డలను పొందుతున్నారు.అనాధాశ్రమాలు, దత్తత గృహాలను సంప్రదించడానికి కొంతమంది ఇష్టపడటం లేదు.

Are IVF babies healthy

అయినప్పటికీ, ఈ రోజుకు కూడా ఈ పద్ధతి ద్వారా పుట్టిన పిల్లల పట్ల కొన్ని అపోహలు కలిగి ఉండి, పక్షపాత ధోరణి అనుసరిస్తున్న సందర్భాలు కోకొల్లలు. వీరిని గురించి మాట్లాడే సందర్బంలో మొట్టమొదట ఉదయించే ప్రశ్న, వీరి ఆరోగ్యం సహజ పద్దతులలో పుట్టిన వారి వలే ఉంటుందా? లేదా?

ఈ వ్యాసం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానమే కాక మరీంత సమాచారం అందించబోతున్నాం. చదివేయండి ఇక!

1. బహుళ గర్భస్థ పిండాల బదిలీ (Multiple Embryo Transfer):

1. బహుళ గర్భస్థ పిండాల బదిలీ (Multiple Embryo Transfer):

ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) పద్దతిలో పిండాలను కృత్రిమంగా మహిళ శరీరంలోకి ప్రవేశపెట్టి, అవి ఫలదీకరణ చెందేవరకు ఎదురుచూస్తారు. ప్రవేశపెట్టబడిన అన్ని పిండాలు ఫలదీకరణ చెందవు. ఫలదీకరణ అవకాశాలను మెరుగుపరిచి, గర్భం ధరించేటట్లు చేయడానికి, చాలా IVF సంస్థలు, ఒకటికన్నా ఎక్కువ పిండాలను ఒకేసారి ప్రవేశపెడతారు.

దీని ఫలితంగా, కొన్నిసార్లు కొందరు మహిళల్లో ఒకటికన్నా ఎక్కువ పిండాలు ఫలదీకరించబడతాయి. సహజంగా గర్భం ధరించిన వారిలో కూడా కవలలు లేదా ఇంకా ఎక్కువమంది బిడ్డలు గర్భంలో ఉన్నప్పుడు, ముందస్తుగా ప్రసవించినట్టుగా, IVF పద్ధతిలో కూడా ముందస్తు జనానాలు సంభవించి, తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టవచ్చు.

దీనివలన పుట్టిన పిల్లలలో ఎటువంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తవు. వీరు కూడా ఆరోగ్యవంతమైన వయోజనులుగా ఎదిగి, అందరివలే సాధారణ జీవితాన్ని గడుపుతారు.

2. నవజాత శిశు సమస్యలు:

2. నవజాత శిశు సమస్యలు:

ఇక్కడ ప్రతిఒక్కరు అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, IVF అంటే పిండం ఫలదీకరణ చెందడానికి సహాయపడే ఒక ప్రక్రియ మాత్రమే. అది కనుక విజయవంతంగా జరిగితే, ఆ మహిళ గర్భం దాలుస్తుంది. ఆ క్షణం నుండి ఆమెలో కలిగే మార్పులు, బిడ్డలో ఎదుగుదల అన్నీ సాధారణంగా ధరించిన గర్భాన్ని సంపూర్ణంగా పోలి ఉంటాయి.

ఈ బిడ్డలు కూడా సహజంగా ఎదగవలసిన రీతిలోనే ఎదుగుతారు. కనుక, చాలా సందర్భాలలో ఆ బిడ్డ జన్మించిన తరువాత, ఆమె / అతని బరువు సాధారణంగా జన్మించిన బిడ్డల వలెనే ఆరోగ్యకరంగానే ఉంటుంది. సహజంగా జన్మించిన బిడ్డ యొక్క పెరుగుదల పారామితులు, IVF ద్వారా జన్మించిన బిడ్డలు కూడా అందుకునే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.

కనుక, ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఈ చిన్నారుల్లో తలెత్తినప్పుడు, దానికి కారణం IVF అని కలత చెందవలసిన అవసరం లేదు. సహజంగా చాలామందికి ఎదురయ్యేవే!

3. సంతానోత్పత్తి సమస్యలు:

3. సంతానోత్పత్తి సమస్యలు:

మనమంతా గుర్తించవలసిన విషయం ఏమిటంటే, IVF అనేది నూతన ఆవిష్కరణ కాదు. తొలితరం IVF బిడ్డలు పుట్టి ఇప్పటికి చాలా కాలమయ్యింది. ముప్పయ్యవ దశకంలోనే వారు జన్మించారు. వారిలో చాలామంది పిల్లలను కూడా కన్నారు.

IVF ద్వారా జన్మించిన బిడ్డలలో సంతానోత్పత్తి సమస్యల గురించి తరచుగా వింటుంటాం. వీరిలో సంతానం కలగడంలో కొంత క్లిష్టత ఎదురవుతుంది. మగవారిలో ఈ సమస్య అధికం. అయినప్పటికీ, ఈ సమస్యకు కారణం తల్లిదండ్రుల ద్వారా వారికి సంక్రమించిన జన్యుపరమైన వంధ్యత్వం వలనే తప్ప, వారి తల్లిదండ్రులు అనుసరించిన సంతానోత్పత్తి చికిత్స వలన కాదు.

ఇదే విషయాన్ని న్యూ ఓర్లీన్స్ లో జరిగిన అమెరికన్ అకాడమీ పీడియాట్రిక్స్ నేషన్ కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ లో నిపుణులు ధృవపరిచారు.

4. జన్యుపరమైన లోపాలు:

4. జన్యుపరమైన లోపాలు:

ఒక వ్యక్తి యొక్క జన్యుపరమైన లక్షణాలు, వారి ఎపిజెనెటిక్స్ చే నిర్ధారింపబడతాయి. ఈ జన్యువులను నియంత్రించే విధానాలు కూడా ఉన్నాయి.మనలో జన్యువులు సక్రియంగా ఉన్నాయా లేదా నిశ్శబ్దంగా ఉన్నాయా అనే దానిపై ఆధారపడి ఎపిజెనెటిక్స్ ద్వారా వాటిని నియంత్రిస్తారు.

గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవించే వరకు మధ్య ఉండే సమయంలో, మన జన్యుపరమైన లక్షణాల యొక్క సంపూర్ణ సమాచారం ఎపిజెనెటిక్స్ లో భద్రపరచబడతాయి. తరువాతి కాలంలో, ఆ వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితులపై, ఎపిజెనెటిక్స్ లోని సమాచారం ప్రభావం చూపుతుంది. ఈ విషయంగా జరిపిన పరిశోధనలలో తేలినది ఏమిటంటే, IVFమరియు ఎపిజెనెటిక్స్ మధ్య ఎటువంటి సంబంధం లేదు.

దీని అర్ధం ఏమిటంటే, ఒక బిడ్డ IVF పద్ధతి ద్వారా జన్మించినంత మాత్రాన, ఆమె/అతనిలో జన్యుపరమైన సమస్యలు అధికంగా ఉంటాయనుకోవడం అసమంజసం. IVF ద్వారా జన్మించిన వారైనా లేదా సహజంగా జన్మించిన వారైనా, జన్యుపరమైన సమస్యలు వారిలో తలెత్తే అవకాశాలు సమానంగా ఉంటాయి.

5. బుద్ధి మాంద్య సమస్యలు :

5. బుద్ధి మాంద్య సమస్యలు :

గత మూడు దశాబ్దాలలో IVF చికిత్స బహుళ ప్రసిద్ధి చెందింది. 2018 లో ఉన్న లెక్కల ప్రకారం, ప్రపంచంలో ఐదు మిలియన్ల కన్నా ఎక్కువమందిప్రజలు IVF అనే ఈ అద్భుత సాంకేతికత ద్వారా జన్మించిన వారే! వీరిలో బుద్ధి మాంద్యం మరియు ఆటిజంతో బాధపడుతున్న వారి నిష్పత్తి సహజంగా జన్మించిన వారిలో బుద్ధి మాంద్యం మరియు ఆటిజంతో బాధపడుతున్న వారి నిష్పత్తితో సమానంగానే ఉంది.

కనుక, నిజానికి బుద్ధి మాంద్యం మరియు IVF జననాల మధ్య ఎటువంటి సహసంబంధం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. IVF చికిత్స ద్వారా జన్మించిన పిల్లలు, సహజంగా జన్మించిన పిల్లలతో సమానమైన ఆరోగ్యం కలిగి ఉంటారు.

English summary

Are IVF babies healthy

There are many who cannot conceive in the natural method. So, they tend to opt for other methods of having their baby. IVF is one method to produce your offspring. And also there are many successful stories on IVF. But at times the babies may have neonatal issues, genetic disorders, etc.Are IVF Babies Healthy?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more