For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు నిమ్మరసం తాగడం వలన కలిగే పది ప్రయోజనాలు

|

గర్భిణిగా ఉన్నప్పుడు నిమ్మరసం తాగడం వలన కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా? గర్భధారణ అనేది ఆనందకరమైన సందర్భం, అదే సమయంలో చాలా సవాళ్ళతో కూడుకుని ఉంటుంది. కనుక గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్య విషయంలో చాలా జాగరూకతతో మెలగాలి. మీరు తీసుకున్న ఆహారం, మీ ఆరోగ్యాన్ని మరియు మీ శిశువు యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా,మీరు గర్భాన్ని మోస్తున్నప్పుడు, మీ పోషక అవసరాలు మారుతాయి. మీరు మీ కోసం మాత్రమే కాక, మీ లోపల ఎదుగుతున్న మీ శిశువు కొరకు కూడా తింటూ ఉండాలి. దీని అర్ధం మీరు చాలా ఎక్కువగా తినాలని కాదు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని సేవిస్తూ అనారోగ్యకరమైన వాటికి దూరంగా ఉండాలి.

పండ్లు పోషకాలు పుష్కలంగా ఉన్నందున, గర్భిణీ స్త్రీలు వీటిని ముఖ్యంగా తినాలి. అయితే, గర్భిణీ స్త్రీలు పూర్తిగా తినకూడని పండ్లు కొన్ని ఉన్నాయి. అయితే, నిమ్మకాయ సురక్షితమైనదేనా? అవును, నిమ్మరసం గర్భిణీ స్త్రీలకీ సురక్షితమైనదే! అయినప్పటికీ, గైనకాలజిస్ట్ ను సంప్రదించి తాగడం మంచిది. గర్భవతిగా ఉన్నప్పుడు నిమ్మ రసం తాగడం వలన కలిగే ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకోండి.

10 Benefits Of Lemon Juice When Pregnant
విటమిన్ సి:

విటమిన్ సి:

గర్భిణుల్లో చాలామంది విటమిన్ సి యొక్క లోపంతో బాధపడుతున్నారు. నిమ్మకాయ విటమిన్ సి యొక్క మంచి వనరు. గర్భిణీ స్త్రీలు నిమ్మ రసంను రోజూ త్రాగితే, వారు విటమిన్ సి సప్లిమెంట్ల మీద ఆధారపడకుండానే, కావలసిన విటమిన్ సిని పొందగలరు.

మలబద్దకం:

మలబద్దకం:

సాధారణంగా, గర్భిణీ స్త్రీలలో మలబద్ధకం సమస్య అధికం. నిమ్మ రసం తాగితే, కాలేయం ప్రేరేపణకు సహాయపడుతుంది. ఇది అతిసారం మరియు మలబద్ధకంలను నిరోధిస్తుంది. మీరు నిమ్మరసంను క్రమం తప్పకుండా తాగితే, మీ ప్రేగుల్లో కదలికలు సక్రమంగా ఉంటాయి.

హైడ్రేషన్:

హైడ్రేషన్:

నిమ్మరసం తాగితే, గర్భిణీ స్త్రీ యొక్క శరీరం హైడ్రేట్ అవుతుంది. గర్భవతిగా ఉన్నప్పుడు నిమ్మరసం తాగడం వలన కలిగే ప్రయోజనాలలో ఇది ఒకటి.

యాంటీఆక్సిడెంట్లు

యాంటీఆక్సిడెంట్లు

నిమ్మరసం కూడా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల నిమ్మకాయలను మంచి క్లెన్సర్లుగా భావిస్తారు. నిమ్మరసం మీ శరీరంలో విషాలను బయటకు నెట్టేస్తుంది. అంతేకాకుండా, గర్భిణీ స్త్రీలు నిమ్మ రసంను క్రమం తప్పకుండా తాగితే, కొన్ని రకాల అంటురోగాల నుండి దూరంగా ఉండవచ్చు.

బిడ్డకు ఉపయోగకరం:

బిడ్డకు ఉపయోగకరం:

కొన్ని అధ్యయనాల ప్రకారం, నిమ్మరసం తాగితే గర్భంలో శిశువుకు మంచిది అని చెబుతారు. బిడ్డ యొక్క ఎముకల నిర్మాణానికి అవసరమైన పొటాషియం నిమ్మకాయలలో ఉంటుంది. అలాగే, నిమ్మ రసం బిడ్డ యొక్క మెదడు అభివృద్ధిలో సహాయపడుతుంది.

అజీర్ణం

అజీర్ణం

మీ జీర్ణ అవయవాలకు మేలు కలిగించడం చేత నిమ్మరసం అజీర్ణంను కూడా నివారిస్తుంది. గర్భవతిగా ఉన్నప్పుడు నిమ్మరసం తాగడం వలన కలిగే ప్రయోజనాలలో ఇది ఒకటి.

అధిక రక్తపోటు:

అధిక రక్తపోటు:

మీరు గర్భవతి అయినప్పుడు, అధిక రక్తపోటు కలిగి ఉండటం మంచిది కాదు. కొన్ని ఆధారాలు దీర్ఘకాలిక అధిక రక్తపోటు ముందస్తు జననాలకు దారితీస్తుందని చెప్తున్నాయి. నిమ్మరసం తాగడం వలన,మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, కనుక దీనిని గర్భవతిగా ఉన్నప్పుడు సేవించడం అవసరం.

పాదాల వాపు:

పాదాల వాపు:

పాదాల వాపు నొప్పిని కలుగజేయటమే కాక అనారోగ్యం కూడా! ఒక చెంచాడు నిమ్మ రసం తీసుకొని గోరువెచ్చని నీటిలో కలిపి తాగండి . ఇలా చేస్తే మీరు గర్భవతిగా ఉన్నప్పుడు వాపు తగ్గించడానికి సహాయపడుతుంది.

నెప్పులు

నెప్పులు

ప్రసవానికి ముందు స్త్రీలు ఆందోళనకు లోనవుతారనేది నిజం. కొంతమంది తేనెతో కలిపి నిమ్మ రసంను తీసుకోవడం వలన ప్రసవం సులభంగా జరుగుతుందని చెప్తారు. ఈ చిట్కా పని చేయాలంటే, 5 వ నెల నుండి డెలివరీ తేదీ వరకు నిమ్మరసంను తీసుకోవడం అవసరం. పాటించేముందు,గైనకాలజిస్ట్ ను సంప్రదించి తాగడం మంచిది.

గుండెల్లో మంట

గుండెల్లో మంట

గర్భవతి ఉన్నప్పుడు నిమ్మ రసం తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. నిమ్మరసం గర్భంతో ముడిపడిఉన్న అనేక చిన్న చిన్న నలతలు, రుగ్మతలు నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఉదాహరణకు, ఉబ్బరం మరియు గుండెల్లో మంటను నిరోధించవచ్చు. దీనిలో మెగ్నీషియం మరియు కాల్షియం కూడా ఉండటంతో, జ్వరం, స్కర్వీ, జలుబు మరియు ఉబ్బసం వంటి కొన్ని రోగాలు నియంత్రించబడతాయి.

English summary

10 Benefits Of Lemon Juice When Pregnant

As fruits are rich in nutrients, they are important for the pregnant women. Of course, there are some fruits which must be totally avoided when pregnant. Is lemon safe? Well, lemon juice is considered safe for pregnant women. But still, it is very important to consult your gynecologist before consuming it. Let us take a look at the benefits of lemon juice when pregnant.
Story first published: Saturday, July 14, 2018, 14:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more