For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో గుండెల్లో మంట కలుగజేసే కొన్ని ఆహార పదార్థాలు

గర్భధారణ సమయంలో గుండెల్లో మంట కలుగజేసే కొన్ని ఆహార పదార్థాలు

|

ఒక స్త్రీ జీవితంలో అత్యద్భుతమైన, ఎంతో అందమైన కాలం గర్భధారణ సమయం. కానీ ఇది స్త్రీకి ఎన్నో క్లిష్టమైన మరియు కఠినతరమైన సవాళ్ళను విసురుతోంది. ఈ భూమి మీదకు ఒక ప్రాణి అడుగుపెట్టించడమనే ఉత్కృష్టమైన కార్యానికి సంబంధించిన నిర్ణయాలను, స్త్రీ లేదా పురుషుడు స్వతంత్రంగా కాకుండా, జంటగా కలసి తీసుకోవాలి.

బిడ్డ గర్భంలో పడ్డప్పటి నుండి కనేంతవరకు మధ్య ఉండే తొమ్మిది నెలల కాలంలో తల్లి శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖంలో మెరుపు, ఉబ్బిన కాళ్ళు మరియు పెద్దదవుతున్న పొట్ట వంటి కొన్ని మార్పులు ఇతరులు గమనించే విధంగా బయటకు కనిపిస్తాయి.

Common Foods That Cause Heartburn During Pregnancy

ఇవేకాకుండా, మీ.శరీరంలో జరిగే కొన్ని ఇతర మార్పులు కేవలం మీరు మాత్రమే గమనించగలరు. వక్షోజాలలో సున్నితత్వం, గుండెల్లో మంట మరియు మూత్రాన్ని ఆపుకోలేకపోవడం వంటివి వీటిలో కొన్ని.

గుండెల్లో మంట గురించి మాట్లాడుకుంటే, గర్భం ధరించినపుడు, పిండం ఎదగడానికి వీలుగా పొట్ట పెరిగేందుకు, కడుపులో పైభాగంలో ఉండే కండరాల వ్యాకోచం చెందుతాయి. దీనివలన కండరాలకు, జీర్ణరసాలను పై వైపుగా అన్నవాహికలోకి ఎగదన్నకుండా ఆపగలిగే సామర్థ్యంను కండరాలు కోల్పోతాయి. దీని వలన గర్భవతులకు తరచు గుండెల్లో మంటగా అనిపిస్తుంది. అయితే, ఇదేమంత పరిష్కరించడానికి వీలు పడనంత పెద్ద సమస్య కాదు.

ఈ వ్యాసం ద్వారా గర్భధారణ సమయంలో, గుండెల్లో మంట పుట్టించే ఆహారపదార్ధాలను గురించి తెలియజేయబోతున్నాము. ఈ పదార్థాలను సేవించడం మానేస్తే చాలావరకు జీర్ణ సంబంధిత అసౌకర్యాలు కలుగకుండా ఉంటాయి.

• చీజ్

• చీజ్

మీకు చీజ్ తినకుండా రోజును గడపడం దుర్భరంగా అనిపించవచ్చు. కానీ, ఇప్పుడు మీరు గర్భవతి కనుక,మీ సౌకర్యం కొరకు చీజ్ ను తినడం మానుకోవాలి. ఇదే సూత్రం మీరు తీసుకునే అధిక కొవ్వుతో కూడిన ఆహారపదార్ధాలకు కూడా వర్తిస్తుంది.

ఇదే కారణం చేత, గర్భధారణ సమయంలో, అవకాడో మరియు నట్స్ తినవద్దంటారు. ఇవి మీ కడుపును అంత త్వరగా ఖాళీ కానివ్వవు. అందుచేత, మీ కడుపు మీద ఒత్తిడి అధికంగా పడి, ఆమ్లాలు అన్నవాహిక ఎగదన్నడం వలన గుండెల్లో మంట అధికంగా కలుగుతుంది.

• కాఫీ మరియు సోడా

• కాఫీ మరియు సోడా

గర్భధారణ సమయంలో కెఫిన్ కలిగివున్న పానీయాలు లేదా సోడా సేవించడం అనేది మంచి ఆలోచన కాదు. వీలు కుదిరితే, ఈ సమయంలో మీకు నచ్చిన పానీయల్లో, కెఫిన్ తొలగింపబడిన రకాలను సేవించే ప్రయత్నం చేయండి.ఏదైనా అనివార్య కారణం వలన మీరు కాఫీ తాగవలసి వస్తే, పరగడుపున తాగకుండా జాగ్రత్త వహించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సోడా తాగకండి. గుండె మంటను నియంత్రించాలంటే, ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

• బీఫ్

• బీఫ్

బీఫ్ లో కొవ్వులు అధికంగా ఉండటం మూలాన గర్భం ధరించిన వారి గుండెల్లో మంట కలుగజేస్తుంది. కనుక బీఫ్ తినకపోవడమే మంచిది.మీరు కనుక బీఫ్ తినడం తప్పనిసరి అయితే కనుక లేతగా ఉండే కొవ్వులేని మాంసం భుజించండి. ఇవి మీ అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.

 • చాక్లెట్

• చాక్లెట్

గర్భవతులు చాక్లెట్ తినకూడదనడానికి వివిధ కారణాలు ఉన్నాయి. మొదటిది, చాక్లెట్లో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఇది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు,అజీర్తి మరియు గుండెల్లో మంట కలుగజేస్తుంది. రెండవది, చాక్లెట్లో థియోబ్రోమిన్ సమృద్ధిగా ఉంటుంది. ఒక రకమైన మిథయిల్ గ్సాంథిన్ అయిన థియోబ్రోమిన్, రిఫ్లక్స్ మరియు గుండెల్లో మంట కలుగజేస్తుంది.

• కారంగా ఉండే ఆహారం

• కారంగా ఉండే ఆహారం

గర్భిణీ స్త్రీలలో గుండెల్లో మంటకు, కారంగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్య కారణం. మిరియాలు, పచ్చిమిర్చి మరియు క్యాప్సికంలను పచ్చిగా తినరాదు. ఇవి గుండెల్లో మంట కలిగేట్టు చేస్తాయి.మీకు కనుక కారంగా ఉండే ఆహారపదార్ధాలు తినాలనే కోరిక తెగ ఎక్కువగా ఉంటే కనుక కొద్ది మొత్తాల్లో తినండి.

• ప్రాసెస్డ్ మరియు బేక్డ్ ఆహార పదార్థాలు

• ప్రాసెస్డ్ మరియు బేక్డ్ ఆహార పదార్థాలు

మార్కెట్ లో లభించే బేక్డ్ ఆహార పదార్థాలలో నిల్వ ఉండటానికై వివిధ రసాయనాలు విరివిగా వాడతారు. చూడగానే ఆకర్షణీయమైన విధంగా కనపడటానికి కృత్రిమ రంగులు వాడతారు. ఈ పదార్థాల తయారీ కొరకు ఉపయోగించే మైదా పిండి కోయిదా గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి చేటు చేస్తాయి.

• మద్యం

• మద్యం

గర్భధారణ సమయంలో మద్యపానం చేయడం వలన పిండాభివృద్ధి పై ప్రతికూల ప్రభావం పడుతుందని మనందరికీ తెలిసిందే! మద్యపానం మామూలు సమయంలో కూడా మీకు అసౌకర్యం కలిగించడమే కాక, గర్భధారణ సమయంలో గుండెల్లో మంట కలుగజేస్తుంది. కనుక, మీరు గర్భం ధరించారని తెలిసిన మరుక్షణం నుండి మద్యానికి వీలైనంత దూరంగా ఉండటం చాలా తెలివైన పని.

• పెప్పర్మింట్

• పెప్పర్మింట్

పెప్పర్మింట్ తినడం వలన అన్నవాహిక మరియు కడుపుకు మధ్య ఉండే సంవరణి కండరము ( sphincter muscle) వ్యాకోచిస్తుంది. గర్భిణీ స్త్రీలలో పొట్ట కండరాలు అప్పటికే వ్యాకోచం చెంది ఉంటాయి కనుక, పొట్టలోని ఆమ్లాలు వెనుకకు ప్రయాణించి, అన్నవాహికలోకి సులువుగా చేరిపోతాయి.

• వెల్లుల్లి

• వెల్లుల్లి

వెల్లులిలో ఫ్రక్టన్స్ అనే పదార్థాలు ఉంటాయి. వీటిని మానవ శరీరం పూర్తిగా జీర్ణం చేయలేక, అజీర్తి కలుగజేస్తుంది. గర్భిణీ స్త్రీలలో అప్పటికే జీర్ణ వ్యవస్థ పై ఒత్తిడి వుంటుంది కనుక వెల్లుల్లిని తింటే గుండెల్లో మంట కలుగుతుంది. కనుక వెల్లుల్లి తినకపోవడమే శ్రేయస్కరం. మీరు గర్భం ధరించక ముందు, మీ శరీరానికి వెల్లుల్లితో ఇబ్బంది లేనప్పటికీ, మీరు గర్భిణిగా ఉన్నప్పుడు అది మీకు సరిపడకపోవచ్చు.

English summary

Common Foods That Cause Heartburn During Pregnancy

As beautiful as the period of pregnancy is, the fact is that this is not easy on your body. There is no doubt about the fact that the idea of bringing a child into the earth is a major decision that has to be taken not by an individual but by a couple as a whole.However, in the nine months from conceiving the child to its delivery, most of the changes happen in the mother's body. Some of these changes are external and may be noted by people around. This includes things like your glowing face, swollen ankles or the protruding belly.
Desktop Bottom Promotion