గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని సంరక్షించే 8 రకాల ఎనర్జీ డ్రింక్స్, ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే విధానం !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

గర్భధారణ సమయంలో మన శరీరానికి అదనపు శక్తి అవసరమవుతుందని మనకు తెలుసు. అలా మన శరీరం విశ్రాంతి దశలో ఉండగా, శరీరానికి పూర్తిగా అవసరమైయ్యే శక్తిని కేలరీల రూపంలో భర్తీ చేసేందుకు గానూ, మనము అదనంగా తీసుకునే ఆహారము ప్రసూతికి మరియు పిండము యొక్క కణజాలానికి కావలసిన శక్తిని అందించేదిగా ఉంటుంది.

అంతేకాక, మీరు శారీరకంగా చురుకుగా గానీ ఉంటే, గర్భధారణ సమయంలో మీ శరీరానికి మరింత శక్తి అవసరమవుతుంది. అందువల్ల మిమ్మల్ని ఎల్లప్పుడు హైడ్రేట్గా ఉంచే, శక్తివంతమైన పానీయాలను మీరు తరచుగా తీసుకోవాలి.

Eight Healthy And Simple Homemade Energy Drinks During Pregnancy

మీరు గర్భధారణ సమయంలో ఉండగా తీసుకోవలసిన ఎనర్జీ డ్రింక్స్ను, మీ ఇంట్లోనే చేసుకోగల పద్ధతుల గూర్చి "బోల్డ్ స్కై " మన ముందుకు తీసుకువచ్చింది. మార్కెట్లో సులభంగా లభ్యమయ్యే ఈ రకరకాల ఎనర్జీ డ్రింక్స్ కు, ఎందుకు దూరంగా ఉండాలన్న విషయం గురించి మేము మీకు తెలియజేస్తాం !

ఇంట్లోనే తయారు చేసుకునే 8 రకాల ఎనర్జీ డ్రింక్స్ ను గర్భధారణ సమయంలో తప్పక తీసుకోవాలి !

ఈ పానీయాలను త్రాగడానికి చాలా సురక్షితంగా ఉంటాయి, ఎందుకంటే వాటిని మీరు ఇంట్లో తయారు చేస్తున్నారు, మరియు వాటిలో కలిసి ఉండే ఇతర పదార్థాల గురించి మీకు తెలుసు.

ఇప్పుడు ఆ జాబితాను మనము పరిశీలిద్దాం..

1. నీరు :

1. నీరు :

మనము వినియోగించిన ప్రతి కేలరీకి, 1 నుంచి 1.5 మి.లీ నీరు అవసరం అవుతుంది. ఇలా మనము 2-3 (లేదా) అంతకన్నా ఎక్కువ సార్లు ఈ క్యాలరీల వినియోగాన్ని పెంచుకుంటూపోతున్న ప్రతిసారీ, అంతే స్థాయిలో నీటి అవసరాన్ని కూడా పెంచుతుంది.

నీరు, హైడ్రేషన్ను మరియు అలసట నిరోధిస్తుంది.

తలనొప్పి మరియు వికారము వంటి లక్షణాలను శాంత పరచటంలో సహాయపడుతుంది.

గర్భధారణ సమయంలో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ ముప్పు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఉమ్మనీరు బాగా ఏర్పడటానికి సహాయపడుతుంది. రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

2. నిమ్మరసం :

2. నిమ్మరసం :

నిమ్మరసం, మీ శరీరంలో ఎలెక్ట్రోలైట్ను తిరిగి నింపి, మిమ్మల్ని హైడ్రేట్గా ఉంచుతుంది. ఇందులో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. "RBCs" (రెడ్ బ్లడ్ సెల్స్) ఏర్పడటానికి, శరీరాన్ని అవసరమైన ఐరన్ను గ్రహించడంలో విటమిన్-సి అనేది దోహదపడుతుంది.

వికారాన్ని తగ్గించడంలో వ్యవహరిస్తుంది. వికారం నుండి ఉపశమనాన్ని పొందటం కోసం నిమ్మరసాన్ని పుదీనా మరియు అల్లంతో కలిపి తీసుకోవచ్చు.

అలాగే ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.

3. కొబ్బరి నీరు :

3. కొబ్బరి నీరు :

కొబ్బరినీరు అనేది మనకు సహజసిద్ధంగా లభించే ఐసోటానిక్ పానీయము.

ఇది ఎలెక్ట్రోలైట్స్, పొటాషియం, క్లోరైడ్, మరియు మెగ్నీషియములను గొప్ప స్థాయిలో కలిగి ఉంటుంది.

కాల్షియం, ఫైబర్, మాంగనీస్, రిబోఫ్లావిన్, మరియు విటమిన్ C వంటి గొప్ప మూలకాలకు ఈ కొబ్బరినీళ్ళు ప్రసిద్ధిగాంచింది.

మరియు నిర్జలీకరణమును (డీహైడ్రేషన్ను) నిరోధిస్తుంది మరియు శరీరంలో లవణీయతను తిరిగి తీసుకువస్తుంది. అలానే రక్తపోటును కూడా తగ్గిస్తుంది.

4. మజ్జిగ :

4. మజ్జిగ :

ఈ సహజసిద్ధమైన శీతలకరణ పదార్ధములో కాల్షియం అధికంగా ఉంటుంది. బయట దుకాణాల్లో లభించే మజ్జిగ కన్నా, మన ఇంట్లోనే తయారు చేసుకునే తాజా మజ్జిగ చాలా మంచిది. దుకాణాలలో ఇక్కడ లభించే మజ్జిగలో ఇతర పదార్థాలతో కూడిన సంకలనాలను కలిగి ఉండవచ్చు. మండు వేసవికాలంలో, ఈ పానీయం మిమ్మల్ని హైడ్రేడ్గా ఉంచుతుంది.

జీర్ణ వ్యవస్థను ఆరోగ్యకరమైనదిగా నిర్వహించడానికి సహాయపడే ప్రోబయోటిక్ బాక్టీరియాను ఇది కలిగి ఉంటుంది.

గర్భధారణ సమయంలో ఉత్పన్నమయ్యే గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

5. తాజా పండ్ల రసాలు :

5. తాజా పండ్ల రసాలు :

తాజా పండ్ల రసాలను గర్భధారణ సమయంలో తప్పక తీసుకోవలసిన గొప్ప పానీయాలని చెప్పవచ్చు. అవి మిమ్మల్ని రోజంతా హైడ్రేట్ గాను మరియు చురుకుగాను ఉంచుతాయి.

తాజా పండ్ల రసాలు విటమిన్-సి, పొటాషియం, రోగనిరోధక-పెంచే అనామ్లజనకాలను మరియు ఫోలేట్ వంటి అత్యవసర సూక్ష్మపోషకాలను కలిగి ఉంటాయి.

అవి మీ శరీరంలో నీటి శాతాన్ని మరియు ఎలెక్ట్రోలైట్ల సమతుల్యతను సరిగ్గా నిర్వహించడంలో సహాయపడతారు. ప్యాకెట్లలో దొరుకుతున్న పండ్ల రసాలను ఉపయోగించడం మానుకోండి, ఎందుకంటే అవి కృత్రిమ రుచులతో పాటు, వాటిని తాజాగా ఉంచే ఇతర పదార్ధాలను కలిగి ఉంటూ, అధికమైన చక్కెరను కూడా కలిగి ఉంటుంది.

దానిమ్మపండుతో చేసిన తాజా పండ్ల రసాలు ప్రీఎక్లంప్సియా వంటి గర్భసంబంధమైన సమస్యలను నివారించడంలో మీకు సహాయం చేస్తాయి.

పుచ్చకాయ, కస్తూరి పుచ్చకాయ, మరియు నిమ్మ వంటి కాలానుగుణ పండ్లతో కలిపి చేసిన మిశ్రమ పండ్ల రసం ద్వారా, మీరు అన్ని పండ్లలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు. అయితే, దానికి చక్కెరను (లేదా) ఉప్పును జోడించకుండా వాటిని త్రాగాలి. పండ్ల రసాల కన్నా పండ్లే మంచివని బాగా గుర్తుంచుకోండి.

6. హెర్బల్-టీ:

6. హెర్బల్-టీ:

కెఫిన్ లేని, హెర్బల్-టీ తో మీ రోజును గొప్పగా ప్రారంభించండి. ఈ క్రింద వివరించబడిన హెర్బల్-టీ ల కోసం మీ ప్రాముఖ్యతను ఇవ్వవచ్చు.

i) రూయిబోస్-టీ లో యాంటీ-ఆక్సిడెంట్లు అధికంగా ఉంటుంది.

తయారీ విధానం :

ఒక టీ కప్పు నీటిలో రూయిబోస్ ఆకులను వేసి బాగా మరిగించండి. 3 - 5 నిమిషాల పాటు దీనిని చల్లార్చిన తర్వాత ఆస్వాదించండి.

ii) పుదీనా-టీ ను త్రాగటం వల్ల వికార లక్షణాలను తగ్గిస్తుంది.

తయారీ విధానం :

వేడి నీటిలో గ్రీన్-టీ ను కలిపి ఉంచండి. 2 నిమిషాలు ఈ టీని మరిగించగా వచ్చిన పొంగులో, రుచి కోసం పుదీనాను మరియు కాస్త చక్కెరను జోడించండి. ఇలా తయారు చేసుకొన్న టీ త్రాగడానికి సిద్ధంగా ఉంది.

iii) ఎర్రని రాస్ప్బెర్రీ ఆకులతో చేసిన టీ, పురిటి నొప్పులతో వచ్చే బాధలను నియంత్రిస్తాయి.

తయారీ విధానం :

1 టీస్పూన్ ఎరుపు రాస్ప్బెర్రీ ఆకులను తీసుకొని, ఒక కప్పు వేడినీటికి జోడించండి. పొంగు వచ్చే 10-15 నిముషాల వరకూ అలానే ఉంచిన తర్వాత వడ్డించుకొని, త్రాగాలి.

7. కూరగాయల రసాలు :

7. కూరగాయల రసాలు :

తాజా కూరగాయల రసాలు గర్భధారణ సమయంలో మీ రోజువారీ పోషకాలను అందించడానికి సహాయపడతాయి.

ఇవి ముఖ్యమైన పోషకాలతో పాటు, మంచి ఫైబర్ను యొక్క మోతాదులను కూడా మీకు అందిస్తాయి.

వీటిలో గొప్ప మూల పదార్థంగా ఫోలిక్ ఆమ్లమును కలిగి ఉండటం వల్ల, మీ శిశువులో న్యూరల్ ట్యూబ్లో ఉన్న లోపాలు తలెత్తకుండా చూడటంలో సహాయపడతాయి.

క్యారట్ జ్యూస్లో, బీటా-కరోటిన్లో అనేది చాలా అధికంగా ఉంటుంది, ఇది మీ శిశువు యొక్క దృష్టిని, శరీర కణాలు మరియు కణజాలాలను వృద్ధి చేస్తుంది మరియు రోగనిరోధక వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది.

పాలకూర, బ్రోకలీ మరియు క్యాబేజీ వంటి క్రూసిఫరస్ కూరగాయలలో ప్రోటీన్లు మరియు ఫోలిక్ యాసిడ్లు చాలా అధికంగా ఉంటాయి. జ్యూసులను తాగడం కన్నా, పండ్ల మాదిరిగానే కూరగాయలను కూడా తినడం మంచిది.

8. పాల ఉత్పత్తులు :

8. పాల ఉత్పత్తులు :

విటమిన్-B12, కాల్షియం మరియు ప్రోటీన్లకు పాలనేవి సహజ వనరని చెప్పవచ్చు. దీనిని గర్భధారణ సమయంలో తప్పనిసరిగా తీసుకోవలసిన పానీయముగా ఉంటుంది. పాలు ఆధారితమైన పానీయాలు మీ యొక్క శక్తిని బాగా పెంచుతాయి. తాజాగా తీయగా ఉన్న పెరుగు/లస్సీ (లేదా) చల్లని పాలను త్రాగవచ్చు.

English summary

Eight Healthy And Simple Homemade Energy Drinks During Pregnancy

Eight Healthy And Simple Homemade Energy Drinks During Pregnancy,Moreover, if you are physically active, then your body burns more energy during pregnancy. This is why you need energy replenishing drinks, which will also keep you hydrated.
Story first published: Thursday, February 15, 2018, 9:00 [IST]
Subscribe Newsletter